ఒక బృందావనం
ఒక బృందావనం పాటను ఘర్షణ చిత్రం కోసం రాజశ్రీ రచించారు. పాడినది వాణీ జయరాం. సంగీతం ఇళయరాజా అందించారు. ఈ పాటను కార్తీక్, నిరోషా లపై చిత్రీకరించారు
"ఒక బృందావనం" | |
---|---|
("oka brundavanam") | |
రచయిత | రాజశ్రీ |
సంగీతం | ఇళయరాజా |
సాహిత్యం | రాజశ్రీ |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
భాష | తెలుగు |
రూపం | యుగళగీతం |
గాయకుడు/గాయని | వాణీ జయరాం |
చిత్రంలో ప్రదర్శించినవారు | కార్తీక్, నిరోషా |
గీత సాహిత్యం
మార్చుపల్లవి :
ఒక బృందావనం...సోయగం...ఎద కోలాహలం..క్షణ క్షణం...
ఒకే స్వరం..సాగెను తీయగా..ఒకే సుఖం విరిసేను హాయిగా..
ఒక బృందావనం...సోయగం......
చరణం 1 :
నే సందెవేళ జాబిలీ...నా గీతమాల ఆమనీ...
నా పలుకు తేనె కవితలే...నా కులుకు చిలక పలుకులే...
నే కన్న కలల మేడ నందనం...నా లోని వయసు ముగ్ధ మోహనం...
ఒకే స్వరం..సాగెను తీయగా..ఒకే సుఖం విరిసేను హాయిగా..
ఒక బృందావనం...సోయగం......
చరణం 2 :
నే మనసుపడిన వెంటనే... ఓ ఇంద్రధనుస్సు పొందునే...
ఈ వెండి మేఘమాలనే...నా పట్టుపరుపు చేయనే..
నే సాగు బాట జాజిపూవులే...నాకింక సాటి పోటి లేదులే ..
ఒకే స్వరం..సాగెను తీయగా..ఒకే సుఖం విరిసేను హాయిగా..
ఒక బృందావనం...సోయగం......