ఒడ్డెర ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులం వీరిని వడ్డెర అని మాత్రమే అని పిలుస్తారు.

ఒడ్డెవారు వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
దక్షిణ భారతదేశానికి చెందిన కులాలు, ఆదివాసీల గురించిన పుస్తకం

వృత్తి

మార్చు

రాళ్లు కొట్టే వృత్తి. ఆధునిక పరిజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో మట్టి, సిమెంటు ఇటుకలు, ఐరన్‌, ప్లాస్టిక్‌, ఫైబర్‌ వంటి వాటితో నిర్మాణాలు సాగుతూ వస్తున్నాయి. దీంతో వంశపారంపర్యంగా కుల వృత్తినే జీవనోపాధిగా మలుచుకున్న వడ్డెర్ల సమ్మెట మూలన పడే దుస్థితి ఏర్పడింది.కుల వృత్తి కుంటుపడటంతో క్వారీల్లో కూలీలుగా వ్యవసాయ కూలీలుగా రూపాంతరం చెందారు. పట్టణాలు, నగరాలకు వలస పోయి భవన నిర్మాణ కూలీలుగా, ఇతరత్రా పనులు, చేతి వృత్తులు వంటివి చేస్తున్నారు. కొండలను పిండి చేయగల సత్తా వారిది.తవ్వకం పనుల్లో వడ్డెర్లకు 20శాతం కేటాయించడానికి ,వడ్డెర సంఘం 'వడ్డెర భవన్‌' నిర్మించేందుకు అత్తాపూర్‌లో 650 చదరపు గజాలు కేటాయించడానికి ప్రభుత్వం అంగీకరించింది.

వృత్తి, సామాజిక జీవనం

మార్చు

ఏళ్ళ తరబడి రాత్రింబవళ్ళు చాకిరి చేస్తారు. గ్రామాల్లో తవ్వే చెరువుల నుండి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు వీరి శ్రమ దాగి ఉంది. ఎక్కడ పని దొరకితే అక్కడికి వాలి పోతారు. జీవితం మొత్తం వలసలతోనే వారు కాలం వెల్లబుచ్చుతారు. భార్య, భర్త ఇద్దరు కలిసి పనిచేస్తేనే పని దొరికేది లేదంటే ఇద్దరు ఇంటి వద్దే ఉండాల్సిందే. యంత్రాలు రంగ ప్రవేశంతో వడ్డెరులకు రాను రాను పనిదొరికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. రాళ్ళు కొట్టడం, బావులు తవ్వడం, చెరువు పూడికతీత, రోడ్లు వేయడం వంటి పనులను యంత్రాల ద్వారా చేయిస్తున్నారు. రాళ్లను తెచ్చి రోళ్లుగా మలిచి వాటిని అమ్మి కడుపు నింపుకుంటారు.ఇటుక సిమెంట్‌ వస్తువుల వాడకంతో పాటు స్లాబ్‌ ఇళ్లు నిర్మిస్తున్న కొద్దీ వీరికి పనులు దొరకటం లేదు. వడ్డెరులు గుట్టలపై ఉన్న రాళ్లను పగులగొట్టి రోడ్లకు కంకర, గార్డెన్‌లకు నీళ్లపు రాళ్లను భవనాలకు చూరు కంకర, గృహ అవసరాలకు ఉపయోగపడే రాళ్లను పొలాలకు చుట్టూ పెన్సింగ్‌ వేయటానికి కడ్డీలను తయారు చేస్తుంటారు. అయితే వీరు తయారు చేస్తున్న వస్తువులన్నింటికీ నేడు అనేక రకాలైన యంత్రాలు రావడంతో వీరు రోజుల తరబడి చేసే పనులను యంత్రాలతో గంటా, రెండు గంటల్లో పూర్తి చేస్తుండడంతో వీరికి గ్రామాల్లో పెద్దగా పనులు దొరకటం లేదు.

సమస్యలు

మార్చు

ఒకప్పుడు ఇళ్లు నిర్మించాలంటే ముందుగా వడ్డెరులను సంప్రదించే వారు. ఇల్లుకు సరిపడా రాళ్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం యంత్రాల వాడకంతో వడ్డెరులు పనిని కోల్పోయారు.జాయింట్‌ క్రషర్‌మిషన్ల వినియోగంతో వీరి ఉపాధికి గండి పడుతుంది. పెద్ద పెద్ద క్వారీల వద్ద, ప్రాజెక్టుల వద్ద గుడిసెలను వేసుకొని జీవించే వీరి జీవితాలకు రక్షణ కొరవడింది. ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రమాదం జరిగితే వీరి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. వీరంతా అసంఘటితంగా పనిచేస్తుండటం వీరి దౌర్భాగ్యానికి మరో కారణం. పనిచేసే ప్రదేశాల్లో వీరికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వీరిని బిసీలుగా గుర్తించినప్పటికీ సహజంగా సంచార జాతులు కావడంతో ఎస్టీల లక్షణాలు ఉన్నాయి. వీరిని ఎస్టీల్లో చేర్చాలనడానికి ప్రధాన కారణం లంబాడీలు, ఎరుకలు, యానాదులు, వడ్డెరలు.... వంటి వారిని విముక్తి జాతులుగా గతంలో పరిగణించారు. కాగా కాలక్రమేణా లంబాడీ, ఎరుకల, యానాదులను ఎస్టీల్లో గుర్తించారు కాని వడ్డెరులను మాత్రం విస్మరించారు.తమను ఎస్టీల్లో చేర్చాలంటూ వడ్డెరులు కోరుతున్నారు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఒడ్డెర&oldid=4348613" నుండి వెలికితీశారు