ఎరుకల
ఎరుకల లేదా కుర్రు ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో నివసిస్తున్న సామాజికవర్గం. ఎరుకలవారు దక్షిణ భారతదేశపు ఆదివాసులు. తమను తాము కుర్రువారిగా పిలుచుకుంటారు. తెలుగు ప్రాంతాలలో వీరిని ఎరుకలు అని పిలుస్తారు. ఈ జాతికి చెందిన మహిళలకు ఎరుక చెప్పటం (సోది, గద్దె, జ్యోతిష్యం) ప్రధాన వృత్తిగా ఉండేది కనుక వీరిని ఎరుకలవారు అని పేరువచ్చింది. మహారాష్ట్రలో ఎరుకలను కైకాడి - కుచికొర్వే (మకడ్‌వాలా) అని వ్యవహరిస్తారు.[1]
ఎరుకల | |
---|---|
వర్గీకరణ | గిరిజనులు, మరియు ఆదివాసులు. |
మతాలు | హిందూమతం |
భాషలు | ఎరుకల భాష, తెలుగు, తమిళం, కన్నడ |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక |
Subdivisions | 6 |
చరిత్ర
మార్చుఎరుకలు తమను తాము మహాభారతంలోని ఏకలవ్యుని వంశంగా భావిస్తారు. మహాభారతంలో ఏకలవ్యుడు నిషాధ కులానికి చెందిన వాడని చెప్పబడింది. నిషాధులకే ఉత్తర భారతదేశంలో కిరాతులు అని కూడా వ్యవహరిస్తారు. కిరాతులు, నిషాదులు ఆరితేరిన విలుకాండ్రు. బస్తర్ లోని భిల్ (విల్లు అనే పదానికి అపభ్రంశం) తెగ ఈ కిరాతులు, నిషాధులకు సంబంధం కలవారని, ఎరుకలు, భిల్ తెగ యొక్క ఒక శాఖ అని భావిస్తారు.
ఆధునిక చరిత్ర
మార్చుఅనేక మార్పులు మరియు సంవత్సరాలు గతించిన తరువాత ఎరుకుల జాతి ప్రజలు అడవికి పరిమితమై అటవీ ఉత్పత్తులు మరియు వేటాడము ద్వారా జీవనము సాగించేవారు. భ్రీటీషు వారి పాలనలో 1878 సంవత్సము అటవీ ఉత్పత్తులను ఉపయెాగించటము మరియు వేటాడము నిషేధించిన కారణముగా ఎరుకుల జాతి ప్రజలు మైదాన ప్రాంతములకు (గ్రామాలకు) విస్తరింటము జరిగింది. ఆ కారణముగా ఎరుకుల ప్రజలు అడవి సంపద మీద హక్కులు కోల్పోఇ మైదాన ప్రాంతములలో నివసించుట వలన గ్రామ సమాజములో కనీస సౌకర్యాలు, గౌరవము పోందలేక పోయారు. 1911 సంవత్సము భ్రీటీషు పాలకులు ( నేటి చెనై పట్టణము అధికారులు) ఎరుకుల జాతి ప్రజలను నేరస్తుల యెుక్క జాబితాలో చేర్చారు. అప్పటి నుండి భ్రీటీషు వారి కాలములో దుర్బర దారిద్రము ఎరుకుల జాతి ప్రజలు అనుభవించారు. భారతదేశనికి స్వాతంత్ర్యము వచ్చిన తరువాత 1952లో అట్టి నేరస్తుల జాబితాలో నుండి ఎరుకుల జాతిని తోలగించటము జరిగింది. కాని నేటికి కూడా అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు దుర్బర దారిద్రము అనుభవించుచున్నారు.భ్రీటీషు పాలనలో ఎరుకుల జాతి ప్రజలు వ్యవసాయ కూలిలుగా మరియు చిన్న వర్తకులుగా మరియు చాపలు అల్లటము,బుట్టలు, తయారు చేయటము ద్వారా జీవనము సాగించేవారు. ఈ కాలములో అనేకమంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరి కోంతమంది ఆర్థిక స్వాతంత్ర్యము అనుభవిస్తున్నారు. కాని భారతదేశనికి స్వాతంత్ర్యము వచ్చి 66 సంవత్సరాలు గడచినా ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఎరుకుల జాతి ప్రజలు సమాజములో అణచివేతకు, అవమానలకు గురై బాధలు అనుభవిస్తున్నారు.
గణాంకాలు
మార్చు- నివాసము : మైదాన ప్రాంతాలు, కోండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు.
- జీవనాధరము: వ్యవసాయము, చేతి వృత్తులు,జంతు పోషణ.
- అక్షరాస్యత 1991 లెక్కల ప్రకారము 25.74%
జనాభా
మార్చు- ఆంద్రప్రదేశ్ 531000
- తమిళనాడు 13000
- ఓరిస్సా 1800
- కర్ణాటక 1200
- మహరాష్ట్ర 600
- ఢిల్లి 200
- గుజరాత్ 200
- పాండిచేరి 200
- చత్తీస్ ఘఢ్ 200
- జార్ఖండ్ 87
భాష
మార్చుఎరుకుల ప్రజలు తమ స్వంత భాష అయిన ఎరుకుల భాషను ఉపయెాగిస్తారు, దానిని కుర్రు భాష లేక కులవత అంటారు, ఇది రవుల మరియు ఇరుల అనే ధ్రవిడ భాషలకు సమీపముగా ఉంటుంది. ఆంద్రప్రదేశ్ లో ఎరుకుల భాషను తమ కుటుంబాలలో ఉపయెాగిస్తారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో ఈ భాషను ఎక్కువగా ఉపయెాగిస్తారు.
ఉప జాతులు
మార్చుఎరుకుల జాతి ప్రజలు తమ ఉప వృత్తుల ఆధారముగా విభజించబడింది.
- దబ్భ ఎరుకుల ( వీరు బుట్టలను వెదురు పుల్లలతో తయారు చేస్తారు.)
- ఈత పుల్లల ఎరుకుల (వీరు బుట్టలను ఈత పుల్లలతో తయారు చేస్తారు.)
- కుంచపురి ఎరుకుల ( వీరు దువ్వెనలు తయారు చేస్తారు .)
- పరికె ముగ్గుల ఎరుకుల ( వీరు భవిషత్ వాణి చెప్పటం ధ్వార జీవనము సాగిస్తారు.)
- కరివేపాకు ఎరుకుల ( ఆకు కుారలు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
- ఉప్పు ఎరుకుల ( ఉప్పు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
ప్రతి ఉప జాతి నాలుగు గోత్రముగా విభజించబడినది
ప్రతి గోత్రమునకు అనేక ఇంటి పేర్లు ఉన్నాయి. ( ఏ గోత్రమునకు చెందినవారు అనేది ఇంటి పేర్లు ఆధారముగా గుర్తిస్తారు )
కోరమ,కోరభ,కానిమాను,కనిహేలు, మరియు ఇతర పేర్లతో పిలువబడుచున్న కాణి చెప్పు వారు కూడా ఎరుకుల జాతికి చెందిన వారు.
ఇంటిపేర్లు, గోత్రాలు, ప్రాంతాలు
మార్చుసురసుర | సాతుపాడి | రాయలసీమ నంద్యాల | |||
అన్నగని | సాతుబడి | ప్రకాశం జిల్లా | |||
అంబటి | మానుబడి | విశాఖపట్నం,తుర్పుగోదావరి,స్టువర్టుపురం | |||
ఆవుల | మేడ్రగూతి | స్టువర్టుపురం | |||
అంచి | కావాడి | లింగాల | |||
అనప | కావాడి | స్టువర్టుపురం | |||
ఆమస | మానుబడి | ఆత్మకూరు,స్టువర్టుపురం | |||
అంగడి | సాతుబడి | స్టువర్టుపురం | |||
అలిజె | సాతుబడి | తెలంగాణా | |||
ఇట్ట | మానుబడి | ప్రకాశం జిల్లా | |||
ఇరగ | కావాడి | ప్రకాశం జిల్లా | |||
ఇరుకు | కావాడి | లింగాల | |||
ఉయ్యాల | కావాడి | స్టువర్టుపురం,ప్రకాశం జిల్లా | |||
కట్టా | కావాడి | ఆళ్ళూరు, ఆత్మకూరు, స్టువర్టుపురం, ప్రకాశం జిల్లా | |||
కామంచి | మానుబడి | ఆళ్ళూరు | |||
కర్రెద్దుల | కావాడి | ఆత్మకూరు, స్టువర్టుపురం | |||
కిల్లా | సాతుబడి | నెల్లూరు జిల్లా,స్టువర్టుపురం,బిట్రగుంట | |||
కేంసారం | సాతుబడి | తెలంగాణా | |||
కురకుల | కావాడీ | తెలంగాణా | |||
కందుల | సాతుబడి | లింగాల | |||
కంప | కావాడి | లింగాల,స్టువర్టుపురం | |||
కరుకొండ | సాతుబడి | లింగాల | |||
కొండ్రెడ్డి | కావాడి | లింగాల | |||
కోనేటి | సాతుబడి | ఆళ్ళూరు | |||
కంద్రకొండ | సాతుబడి | స్టువర్టుపురం | |||
కొండ్రెడ్డి | మేండ్రగూతి | స్టువర్టుపురం | |||
కుంభ | సాతుబడి | గుంటూరు జిల్లా | |||
గజ్జెల | మేండ్రగూటి | స్టువర్టుపురం | |||
గంటా | మానపటి</గుంటూరు> | లింగాల,కృష్ణా జిల్లా, స్టువర్టుపురం | |||
గుణాదరి | సాతుబడి | గుంటూరు జిల్లా | |||
గుర్రంకొండ | సాతుబడి | కప్పరాళ్ళతిప్ప,ఆత్మకూరు | |||
గుత్తి | కావాడి | బిట్రగుంట | |||
గొజ్జా | కావాడి | లింగాల | |||
చిత్తూరి | కావాడి | లింగాల,స్టువర్టుపురం | |||
చిన్నపోతుల | మేండ్రగూతి | స్టువర్టుపురం | |||
జగన్నాథం | కావాడి | ప్రకాశం జిల్లా, కడప, స్టువర్టుపురం | |||
దాసరి | సాతుబడి | ఆళ్ళూరు, స్టువర్టుపురం, తెలంగాణా | |||
దాసు | కావాడి | ఆళ్ళూరు, ప్రకాశం జిల్లా | |||
దేవర | సాతుబడి | కప్పరాళ్ళతిప్ప, స్టువర్టుపురం | |||
దేవరకొండ | మేండ్రగూతి | అన్ని ప్రాంతాల్లో | |||
దేవరాయ (దేవరాజు) | కావాడి | తెలంగాణా | |||
దేవుసారి | సాతుబడి | తెలంగాణా | |||
ముకిరి | కావాడి | గుంటూరు జిల్లా | |||
నల్లగొండ్ల | మేండ్రగూతి | కప్పరాళ్ళతిప్ప, ఆళ్ళూరు, లింగాల | |||
నలబాయి | మేండ్రగూతి | కప్పరాళ్ళతిప్ప, ఆళ్ళూరు | |||
నల్లబొత్తుల | మేండ్రగూతి | లింగాల, స్టువర్టుపురం | |||
నెమలి | కావాడి | తెలంగాణా | |||
నెలికుదురు | సాతుబడి | లింగాల | |||
పాలకీర్తి | సాతుబడి | కప్పరాళ్ళతిప్ప | |||
పాలకొంద | సాతుబడి | అన్ని ప్రాంతాల్లో | |||
పిట్ల | కావాడి | ప్రకాశం జిల్లా | |||
పీరిగ | సాతుబడి, కావాడి | కప్పరాళ తిప్ప, ఆత్మకూరు, లింగాల | |||
పూదటా | సాతుబడి | తెలంగాణా | |||
పూజారి | కావాడి | ఆత్మకూరు,లింగాల | |||
పెనుగొండ | కావాడి | ఆత్మకూరు, రాయలసీమ | |||
పేరం | సాతుబడి | లింగాల, ఆళ్ళూరు | |||
పొన్నా | సాతుబడి | లింగాల,కృష్ణా జిల్లా | |||
పొర్సా | సాతుబడి | ఆత్మకూరు, ప్రకాశం జిల్లా | |||
పోల | సాతుబడి | ఆత్మకూరు, లింగాల | |||
బాదనపూరి | కావాడి | ఆళ్ళూరు, తెలంగాణా | |||
బల్లాని | సాతుబడి | స్టువర్టుపురం | |||
బల్లారి | సాతుబడి | లింగాల | |||
బోనగిరి | కావాడి | స్టువర్టుపురం, కప్పరాళ్ళతిప్ప | |||
బొచ్చు | సాతుబడి | స్టువర్టుపురం, కప్పరాళ్ళతిప్ప | |||
బొజ్జగాని | కావాడి | స్టువర్టుపురం, లింగాల | |||
బాగ్యం | సాతుబడి | కప్పరాళ్ళతిప్ప | |||
మద్దెల | మానుబడి | ఆళ్ళూరు | |||
మర్కల్ | సాతుబడి | తెలంగాణా | |||
మల్లి | కావాడి | కప్పరాళ్ళతిప్ప, స్టువర్టుపురం, లింగాల | |||
మాదినె | మానుబడి | చిత్తూరు జిల్లా | |||
మేడ (ద) | సాతుబడి | అక్కడక్కడా | |||
మండ్లా, సిరిగన | కావాడి | రాయలసీమ, ధర్మవరమ్ | |||
రాగాల | సాతుబడి | స్టువర్టుపురం | |||
రాస్టపురం | కావాడి | తెలంగాణా | |||
వల్లభ | మానుబడి | గుంటూరు జిల్లా | |||
వనమ | కావాడి | తెలంగాణా | |||
వల్లగి | కావాడి | స్టువర్టుపురం | |||
వల్లగుల | సాతుబడి | లింగాల | |||
పల్లెపు | మేండ్రగూతి | అక్కడక్కడా | |||
పాల్వాయి | సాతుబడి | లింగాల | |||
కుతాడి | కావాడి | తెలంగాణా | |||
శ్రీరామ్ | సాతుబడి | తెలంగాణా | |||
శ్రీరామ | మానుబడి | ప్రకాశం జిల్లా | |||
సార్ల | కావాడి | ప్రకాశం జిల్లా | |||
సొరకాయల | కావాడి | ప్రకాశం జిల్లా | |||
లోసారి | సాతుబడి | లింగాల | |||
PARASA | సాతుబడి | Nakarikallu Palnadu District |
మతము
మార్చుఎరుకుల ప్రజలు హిందు దేవతలైన, శివుడు, వెంకటేశ్వరుడు, నరశింహస్వామి, నారయణస్వామి, రాముడుని ఆరాధిస్తారు. మరియు పోలిమేర దేవతలైన అంకమ్మ, కోల్లపుర,సుంకలమ్మ, పోలేరమ్మ,ఎల్లమ్మ, మొదలగు గ్రామ దేవతలను ఆరాధిస్తారు. ఎరుకుల ప్రజలు ప్రకృతి దేవతలైన సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్నిని పూజిస్తారు.హిందు పండగలను ఆచరిస్తారు. సంక్రాంతి, శివరాత్రి, శ్రీరామనవమి, దసర,ఉగాది పండగలను ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో హిందు ఆలయములలోనికి అనుమతి నిరాకరించుట వలన చెట్లు వద్ద రాతి బోమ్మలు, మట్టి బోమ్మలు పెట్టుకోని ఆరాధిస్తారు. ఎక్కువమంది ప్రజలు హిందు మతాన్ని పాటిస్తారు. ఐతే ఇప్పుడిప్పుడే మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం చొచ్చుకు వస్తుంది. క్రైస్తవులుగా మారిన కూడా తమ స్వంత గుర్తింపుతో క్రైస్తవ మతము (లేక) పాటించే విధానము ద్వారా తమ ప్రత్యేకతను కాపాడుకోంటున్నారు.
సామాజిక పద్దతులు
మార్చుఎరుకుల ప్రజలలో సాధారణముగా కుటుంబ వ్యవస్ధ తండ్రి వారసత్వ సాంప్రదాయకముగా ఉంటుంది. వివాహాలలో మేనరిక సంబంధాలు అనుమతిస్తారు . ఏక భార్యత్వము కుటుంబ సాంప్రదాయక ప్రమాణము . ఐతే కోన్ని ప్రత్యేక సందర్భములలో బహు భార్యత్వము అనుమతిస్తారు.వివాహలు సాధారణముగా చర్చల ద్వారా, కానుకలు ( ఓలి ) ద్వారా జరిపిస్తారు. సాంప్రదాయకముగా వివాహము ఐన స్త్రీలు వివాహమునకు గుర్తుగా కంఠాభరణము ధరిస్తారు. ఈ కాలములో తాళి బొట్టు,మంగళ సూత్రము ధరిస్తున్నారు. విడాకులు అనుమతిస్తారు కాని వ్యభిచారము, పిల్లలు పుట్టక పోవటము కారణముగా భార్య, భర్తలలో ఎవరైన విడాకులు కోరవచ్చు. వితంతువులు మరోక వివాహమునకు అర్హులు. కుటుంబ సమస్యలు చర్చల ద్వారా లేదా కుల పంచాయితీ ద్వారా పరిష్కరిస్తారు. ఎరుకుల కుటుంబ వ్యవస్థను నడిపించటానికి సామాజికముగా వారికి క్రమశిక్షణ పద్ధతులు ఉన్నాయి. వాటిని కుల పంచాయితీ లని అంటారు. కుల పంచాయితిలో అనేక మంది అనుభవము కలవారు ఉంటారు. వారికి అనుభశాళి, కుల వ్యవస్థను గూర్చిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడుగా ఉంటారు. కుల పంచాయితీ కుటుంబ తగాదాలు, నేరాలు, వ్యభిచారము, అప్పులు, ఆస్తి వివాదాలు, భూ వివాదాలు మొదలగు వాటిని పరిష్కరిస్తుంది. ఈ కుల పంచాయితీలో నేర నిర్ధారణ కోన్ని పద్ధతుల ఆధారముగా జరుగుతుంది. 1) వేడి నూనెలో చేతిని ముంచటము ద్వారా 2) కాలిన ఇనుప కడ్డీను చేతులతో పట్టుకోవటము ద్వారా 3) నిప్పల మీద నడువుట ద్వారా నేర నిర్ధారణ జరుగుతుంది. కుల పంచాయితీలలో వివాదాలు పరిష్కరించటమే కాకుండా స్థానిక సంఘములో ఐకమత్యమును మరియు వ్యక్తిగత ప్రవర్తన పరిశీలన జరుగుతుంది. ఎవరైనా కుల పంచాయితీను అతిక్రమించితే వారిని కుల బహిష్కరణ చేస్తారు.
ఆహర అలవాట్లు
మార్చుఎరుకుల ప్రజలు మాంసహరులు, బియ్యము, పప్పు దినుసులు ఆంధ్ర ప్రాంతాలలో భుజిస్తారు. రాగి జావ, బియ్యము రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో భుజిస్తారు.సాంప్రదాయకముగా చాపలు అల్లటము, పశు పోషణ, పందుల పెంపకము, బుట్టలు తయారు చేయటము, చీపుర్లు తయారు చేయటము తమ వృత్తిగా కొనసాగిస్తారు. మరియు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తారు . ఎరుకుల స్త్రీలు భవిష్యత్తు వాణి (సోది) చెప్పటములో ప్రత్యేకముగా ఉంటారు మరియు కుటుంబ పాలనలో తెలివిగా ఉంటారు.
కుల వర్గీకరణ
మార్చుఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 33వ కులం. తెలంగాణాలోని ఎరుకలవాళ్ళు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఎ గ్రూపులో 25 వ కులం. అందుకే తెలంగాణా ఎరుకలవాళ్ళు షెడ్యూల్డు తెగ గుర్తింపునే కోరుతున్నారు. గిరిజన తెగలలో ఈనాడు ఎరుకలు సాంఘికంగా బలమైన తెగ. ఎరుకలమ్మలు సోదె చెప్పేవారు. స్టూవర్టుపురం, కప్పరాళ్ళతిప్ప, సీతానగరం (తాడేపల్లి) Nakarikallu ( Palnadu District ) లాంటి గ్రామాలు ఈ తెగ ప్రజల ఆధిపత్యంలో ఉన్నాయి. ఎరుకల భాష తమిళ భాషకు దగ్గరగా ఉంటుంది.
ఆకివీడు ప్రాంతంలో తెలగపాముల కుటుంబాలు ఎరుకల వారితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. వీరిని ఎరుకల కులస్తులుగా గుర్తించి షెడ్యూల్డు తెగల రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. నాలుగైదు తరాలు నుంచి పూర్తిగా దొంగతనాలు పైనే జీవించిన వీరి పిల్లలు ఉన్నత చదువులకు కూడా వెళుతున్నారు.
మూలాలు
మార్చు- ↑ Chaudhuri, Sarit Kumar; Chaudhuri, Sucheta Sen, eds. (2005). Primitive tribes in contemporary India: concept, ethnography and demography. Vol. 2. Mittal Publications. p. 263. ISBN 81-8324-026-7.