ఒ-రకం బాయిలరు ఒక వాటరు ట్యూబు బాయిలరు.[1] ఈ బాయిలరు ఆకృతి చూచుటకు ఇంచుమించు ఇంగ్లీషు అక్షరం O లా వుండటం వలన O టైపు/రకం బాయిలరు అంటారు.నిజానికి ఇది కూడా డి- రకం బాయిలరు వలె రెండు డ్రమ్ములు కల్గి వున్న బాయిలరు.మొదట్లో ఈరకపు బాయిలరులో బొగ్గును ఇంధనంగా వాడేవారు. తరువాత ఘనఇంధనం తరువాత ఆయిల్ ఫైర్డ్ - గ్యాస్ ఫైర్డ్ బా యిలరుగా మార్చిన తరువాత మెరీన్ బాయిలరుగా ఓడల్లో నావికాదళ షిప్పులలో వాడటం మొదలైనది.దీనిని ప్యాకెజ్డ్ బాయిలరు అనికూదా అంటారు

రేఖా చిత్రం

బాయిలరులోని నిర్మాణ భాగాలు

మార్చు

స్టీము డ్రమ్ము

మార్చు

ఇది మందమైన ఉక్కు ప్లేట్ తో చేసిన స్తూపాకారం. స్తూపాకారం డ్రమ్ము వృత్తాకార భాగంలో డ్రమ్ములోపలి వెళ్ళు పరిమాణంలో మ్యాన్ హోలు వుండి బలమైన మూతతో బోల్టులతో బిగింపబడి వుండును.ఈ స్తూపాకార డ్రమ్ము భూసమాంతరంగా పొడవుగా ఫర్నేసులో పైభాగాన వుండును.అయిలే డి-రకపు బాయిలరు వలె కాకుండా, ఫర్నేసుకు ఇంచుమించు మధ్య భాగంలో డ్రమ్ము వుండును.డ్రమ్ము బాయిలరు కెపాసిటిని బట్టి డ్రమ్ము వ్యాసం పెరుగును. డ్రమ్ము మ్యాన్ హోలు మూత సైజు కనీసం రెండుఅడుగులు వుండును.

వాటరు డ్రమ్ము

మార్చు

ఇది కుడా మందమైన కార్బను ఉక్కు పలకతో చెయ్యబడివుండును.ఇది కూడా స్టుపాకారంగా వుండి ఫర్నేసులో క్షితిజసమాంతరంగా వుండును.వాటరు డ్రమ్ము బాయిలరు ఫర్నేసు మధ్యలో కింది భాగంలో, సరిగా స్టీము డ్రమ్ముకు దిగువభాగంలో వుండును. ఇది కూడా ఇంచుమించు స్టీము డ్రమ్ము వ్యాసంలో వుండును. ఈ వాటరు డ్రమ్ము వృత్తాకార భాగంలో మూత వున్న మ్యాన్ హోల్ వుండును.

వాటరు ట్యూబులు

మార్చు

బాయిలరులో స్టీము ఈట్యూబుల్లోనే తయారు అగును.ఇవి కార్బను ఉక్కుతో చెయ్యబడి వుండును. ట్యూబుల గోడమందం 3.0 మిల్లిమీటర్లు వుండును.ట్యూబుల వెలుపలి వ్యాసం 50 మిల్లి మీటర్లు ఉండును.ఈ ట్యూబులు స్టీము డ్రమ్మును, వాటరు డ్రమ్మును కలుపుతూ నిలువుగా అతుకబడి వుండును. ట్యూబులు రెండు చివరలు కొద్దిగా వంపుగా వుండి డ్రమ్ములకు అతుకబడి వుండును.

డౌన్ కమరు

మార్చు

దీని ద్వారా హట్ వాటరు/వేడి నీరు స్టీము డ్రమ్ము నుండి వాటరు డ్రమ్ముకు ప్రసరణ అగును.

ఫర్నేసు

మార్చు

బాయిలరు ఫర్నేసులోనే ఇంధనాన్ని మండించెదరు. ఫర్నేసు తాపక నిరోధక ఇటుకల/కొలిమి ఇటుకలతో కట్టబడి వుండును. ఈ ఇటుకలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే గుణాన్నికల్గివుండును.

బర్నరు

మార్చు

వీటి ద్వారానే ఆయిల్ లేదా గ్యాసు ఫర్నేసులోకి పంపబడి మండించడం జరుగును.ఇవి ఆటోమాటిక్ విధానంలో పనిచేయును.

ఫోర్సుడ్ డ్రాఫ్ట్ బ్లోవరు

మార్చు

దీని ద్వారా ఇంధనం మండుటకు అవసరమైన గాలిని అందించేదరు.

నిర్మాణం

మార్చు

తాపక నిరోధక ఇటుకలతో నిర్మితమైన ఫర్నేసు/కొలిమి పైభాగాన వెలుపల స్టీము డ్రమ్ము క్షితిజసమాంతరంగా, ఫర్నేసు మధ్యలో వుండును. స్టీము డ్రమ్ము పై సగభాగంలో స్టీము జమఅవును.కింది సగభాగంలో బాయిలరు వేడినీరు వుండి వాటరు డ్రమ్ముకు ప్రసరణ అవుచుండును. బాయిలరు డ్రమ్ముల నుండి ట్యూబులకు నీరు సహజ ప్రసరణ ద్వారా ప్రసరిస్తుంది. వాటరు డ్రమ్ము ఫర్నేసు మధ్యలో కింది భాగాన వాటరు ద్రమ్ము స్టీము డ్రమ్ముకు సమాంతరంగా వుండును. స్టీము డ్రమ్ము రెండుపక్కల నుండి వాటరు డ్రమ్ము రెండు పక్కలకు వాటరు ట్యూబులు ఇంగ్లిష్ అక్షరం O ఆకృతిలో ఆతుకబడి వుండును.కొన్ని బాయిలరులలో అదనంగా వాటరు వాల్ ట్యూబులు కూడా వుండును. స్టీము డ్రమ్ములో వాటరు వుండు భాగానికి పక్కభాగం నుండి వాటరు డ్రమ్ము పై పక్కభాగాలకు ట్యూబులు అతుకబడి వుండును.ఈ O ఆకారం మధ్య భాగంలో ఇంధనం మండి ట్యూబులకు ఉష్ణం వ్యాపించేలా బర్నరులను అమర్చేదరు. ఫర్నేసు లోపలి మంటను గమనించుటకు మూడు నాలుగు వ్యూ హోల్సు వుండును .స్టీము డ్రమ్ము స్తూపాకారపై ఉపరితలంపై మైయిన్ స్టీము వాల్వు, సేఫ్టి వాల్వులు, ఎయిర్ వెంట్ వాల్వు, ప్రెసరు గేజ్, వాటరు గేజి బిగించబడి వుండును.అంతే కాకుండా ఫీడ్ వాటరుపంపును ఆటోమాటిక్ గా ఆఫ్, ఆన్ చేసే మోబ్రే కూడా వుండును.[2]

బాయిలరులో వాడు ఇంధనాలు

మార్చు

సహజ వాయువు, ఇతర వ్యర్ధ్య వాయువులు, ఆయిల్స్[3]

బాయిలరుకు అదనంగా అమర్చబడి వుండు ఉపకరణాలు

మార్చు

ఫీడ్ వాటరు పంపు

మార్చు
 
హరిజోటల్ మల్టి స్టెజి వాటరు పంపు

ఇది బాయిలరుకు కావాల్సిన వాటరును బాయిలరుకు పంపింగు చెయ్యును. బాయిలరు వాతావరణ వత్తిడికి కన్న ఎక్కువ వత్తిడిలో ( 9-10Kg/cm2) స్టీము ఉత్పత్తి చేయ్యును.కావున ఫీడ్ పంపు బాయిలరు వర్కింగు ప్రెసరు కన్న ఒకటిన్నర రెట్లు ఎక్కువ వత్తిడిలో వాటరును తోడు పంపును బాయిలరుకు అమర్చెదరు. అంతేకాదు బాయిలరు గంటకు స్టీముగా మార్చు నీటి పరిమాణం కన్నరెండితలు ఎక్కువ నీటినితోడు కెపాసిటి కల్గి వుండును. హరిజంటల్ మల్టి స్టెజి సెంట్రిఫ్యుగల్ పంపులను వాడుచున్నారు.కొత్తగా వెట్రికల్ మల్టి స్టేజి పంపులు వాడుకలోకి వచ్చాయి.

బాయిలరులో ఎప్పుడు ఫైరుట్యూబుల మట్టం దాటి నీరు వుండాలి. అప్పుడే ఎటు వంటి ప్రమాదం లేకుండా నీరు స్టీముగా ఏర్పడును. బాయిలరులో ఇంధనం వలన ఏర్పడు వేడి వాయువుల ఉష్ణోగ్రత 1000 °C డిగ్రీలు దాటి వుండును.ట్యూబుల మట్టానికి దిగువన వాటరు ఉన్నచో, ఇంతటి ఉష్ణోగ్రత ఉన్న ఫ్లూగ్యాసెస్ ఫైరుట్యూబుల ద్వారా వెళ్ళునపుడు ఉష్ణ వినిమయం జరుగనందున ట్యూబుల ఉష్ణోగ్రత పెరిగి బాయిలరు ట్యూబులు పేలి పోవును.అందువలన బాయిలరు షెల్ లో నీటి మట్టం ట్యూబు బండిల్ కన్నఎక్కువ మట్టం వరకు ఉండటం అత్యంత ఆవశ్యకం.బాయిలరు షెల్ లో వాటరు ఎంత ఎత్తులో నీరు వున్నది ఈ వాటరు గేజ్ వలన తెలుస్తుంది.

ఈ పరికరం బాయిలరులో ఉత్పత్తి అయ్యే స్టీము ప్రెసరును చూపిస్తుంది.

 
స్ప్రింగు లోడేడ్ సెప్టి వాల్వు

బాయిలరు షెల్ లో వర్కింగు ప్రెసరు కన్న ఎక్కువ స్టీము తయారై, ఏర్పడిన స్టీమును అదే ప్రమాణంలో వాడనప్పుడు, బాయిలరులో స్టీము పరిమాణంపెరిగి, అధిక వత్తిడి ఏర్పడి బాయిలరు షెల్ ప్రేలి పోయే ప్రమాదం ఉంది. ఈ సేఫ్టివాల్వు, బాయిలరులో పరిమితి మించి ఎక్కువ ప్రెసరులో ఏర్పడిన స్టీమును బాయిలరు బయటకు విడుదల చెయ్యును. సేఫ్టి వాల్వులు పలు రకాలున్నవి. అందులో స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వుఒక రకం

స్టీము స్టాప్ వాల్వు

మార్చు

ఇది బాయిలరులో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపుకు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.

ఈ వ్యాసాలు కూడా చదవండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "O-Type Watertube Boiler". englishboiler.com. Archived from the original on 2019-07-08. Retrieved 2018-02-08.
  2. Milton, J. H. (2013) [1953]. "Chapter 4: Water Tube Boilers.(4th ed.). London: Newnes. pp. 150–153.
  3. "O" TYPE WATERTUBE STEAM BOILERS". indeck.com. Archived from the original on 2009-04-07. Retrieved 2018-02-08.