ఓంప్రకాశ్ నారాయణ్ వడ్డి

ఓనావ పేరుతో తెలుగులో వ్యంగ్యచిత్రాలను గీస్తున్న వడ్డి ఓంప్రకాశ్ నారాయణ వృత్తిరీత్యా ఫిలిం జర్నలిస్టు. [1]

ఓంప్రకాశ్ నారాయణ్ వడ్డి
Omprakash Narayan Vaddi.jpg
జననంఓంప్రకాశ్ నారాయణ్ వడ్డి
సెప్టెంబరు 8 1966
మచిలీపట్నం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుఓనావ , చంద్రం
వృత్తిజర్నలిస్ట్
ప్రసిద్ధితెలుగు కథా రచయిత, కార్టూనిస్టు, జర్నలిస్టు
పిల్లలుకార్తికేయ
తండ్రిచంద్రశేఖరరావు
తల్లిఅరుణ సత్యవతి
సంతకంOnavasign.jpg
వెబ్‌సైటు
http://omprakashraatalugeetalu.blogspot.com

జీవిత విశేషాలుసవరించు

ఆయన హైదరాబాదుకు చెందిన జర్నలిస్టు, తెలుగు రచయిత. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాకు చెందిన మచిలీపట్నం. ఆయన సెప్టెంబరు 8 1966 న జన్మించారు. విజయవాడలో ఎకనామిక్స్ ప్రధానంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ. చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండీ ఎం.సి.జె. పట్టా పొందారు. కళాశాలలో చదువుతున్న సమయంలోనే కవితలు రాయడం, కార్టూన్లు గీయడం, కథలు రాయడం ప్రారంభించారు. ఇంతవరకూ సుమారు 1000 కార్టూన్లు తెలుగు దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. సుమారు 60 కథలు వివిధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆయన రెండు దశాబ్దాలుగా సుమారు 600 సినిమాలకు సమీక్షలను "జాగృతి" వార పత్రికలో వ్రాశారు.[2] ఆయన వ్రాసిన కథానికలను తనతో పాటు నలుగురు రచయితలతో కలసి "4 ఇంటు 5" పేరుతో వెలువరించారు. ఆయన తన స్వంత కథల సంపుటిని "మనసు తడి ఆరనీకు" (2013) పేరుతో ప్రచురించారు.[3][4] 1989వ సంవత్సరంలో జర్నలిస్టుగా జాగృతి వార పత్రికలో కెరీర్ ను ప్రారంభించిన ఓంప్రకాశ్ ఆ తరువాత ముంబై లోని క్యాపిటల్ మార్కెట్ (తెలుగు) పక్షపత్రికలో పనిచేశారు. `సూపర్ హిట్` సినిమా వార పత్రికలో ఓ యేడాది పాటు ఫిల్మ్ రిపోర్టర్ గా పనిచేసిన అనంతరం వార్త దిన పత్రికలో చేరారు. ఆంధ్రజ్యోతి దిన పత్రికలలోనూ ఫిల్మ్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన సాక్షి టెలివిజన్ కు సినిమా కరెస్పాండెంట్ గా సేవలనందించారు[5]. ప్రస్తుతం ఎ.బి.యన్. ఆంధ్రజ్యోతి ఛానెల్ లో సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. పలు కార్టూన్ల పోటీలో బహుమతులు గెలుచుకున్న ఓనావ... 2018లో 'ఓనావ కార్టూన్లు' పేరుతో ఓ కార్టూన్ సంకలనాన్ని వెలువరించారు. దీనిని సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇటీవల ఫిల్మ్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణతో కలిసి వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ 'వెండి చందమామలు' పుస్తకాన్ని వెలువరించారు. [1]

మూలాలుసవరించు

  1. "Omprakash Narayan Vaddi Profili". Archived from the original on 2016-03-06. Retrieved 2019-12-19.
  2. "Omprakash Narayan Vaddi biography". Archived from the original on 2016-03-05. Retrieved 2019-12-19.
  3. Books from Author: Omprakash Narayan Vaddisubscribe కినిగె లో పుస్తక వివరాలు
  4. మనసు తడి ఆరనీకు పుస్తక ఆవిష్కరణ
  5. ప్రెస్ క్లబ్ లో ఆయన చిరునామా వివరాలు

ఇతర లింకులుసవరించు