ఓం ప్రకాష్‌ ముంజల్‌ (1928 ఆగస్టు 26 – 2015 ఆగస్టు 13) భారతీయ పారిశ్రామికవేత్త, రచయిత, లోకోపకారి. ఆయన హీరో సైకిల్స్‌ పరిశ్రమను స్థాపించి, భారత సైకిల్‌ పరిశ్రమకు పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ తయారీ సంస్థకు ప్రస్తుత చైర్మన్, వ్యవస్థాపకులు. హీరో మోటార్స్, భారతీయ ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీదారులు, లగ్జరీ హోటల్స్, చతుష్చక్ర వాహనాల విడిభాగాల తయారీ సంస్థలలో ఆయన కృషి అనుపమానం. ఆయన అనెక పాఠశాలను, వైద్యశాలలు స్థాపించి అనేక లోకోపకారమైన సేవలనందించారు[1]

ఓం ప్రకాష్‌ ముంజల్‌
జననం(1928-08-26) 1928 ఆగస్టు 26
కమాలియా,పంజాబ్,బ్రిటిష్ ఇండియా
మరణం2015 ఆగస్టు 13 (2015-08-13)(వయసు 86)
లూథియానా,పంజాబ్,ఇండియా
జాతీయతభారతీయుడు
వృత్తిహీరో సైకిల్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు,చైర్మన్
క్రియాశీలక సంవత్సరాలు1944–2015
శీర్షిక"హీరో" సైకిల్ కంపెనీ వ్యవస్థాపకుడు
జీవిత భాగస్వామిసుదర్శన్ ముంజల్

జీవిత విశేషాలుసవరించు

ఆయన కమాలియాలో బహదూర్ చంద్ ముంజల్, ఠాకూర్ దేవి దంపతులకు జన్మించారు.1944లో సోదరులతో కలిసి తొలుత అమృత్‌సర్‌లో సైకిల్ స్పేర్ పార్ట్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1956లో లుథియానాలో హీరో సైకిల్స్ పేరుతో ఫ్యాక్టరీని స్థాపించారు. తొలుత రోజుకు 25 సైకిళ్ల తయారుతో మొదలైన ప్రస్థానం నేడు 19 వేల సైకిళ్ళకు చేరింది. ప్రపంచంలో అది పెద్ద సైకిల్ తయారీ సంస్థగా పేరుగాంచిన హీరో సైకిల్స్ 1986లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కింది. దేశీయ సైకిల్ మార్కెట్‌లో 48 శాతం వాటా హీరో సైకిల్స్‌దే. సంస్థను ఇంతగా అభివృద్ధి చేసిన ముంజెల్ భారతీయ సైకిల్ పితామహుడిగాను గుర్తింపు పొందారు.భారతదేశంలో మొదటి హీరో సైకిల్ తయారీ సంస్థ యొక్క యూనిట్ మొదటి యేడాది 639 సైకిళ్ళను తయారుచేసింది.

వ్యక్తిగత జీవితంసవరించు

ఆయన సుదర్శన్ ముంజల్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు - నీరు ఖన్నా, నీతా సేథ్, పూనం సోనీ, ప్రియాంకా మల్హోత్రా, పంకజ్ ముంజల్.

ఆయన పారిశ్రామిక రంగంలోనే కాక కవిగా కూడా ప్రసిద్దుడు. అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.[2] ఆయన రచించిన షేర్స్, ముషారాస్ అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఆయన ఉర్దూ భాషాభివృద్ధికి కృషిచేసారు.[1]

అవార్డులు,గౌరవాలుసవరించు

ఆయన భారతదేశ పూర్వపు రాష్ట్రపతులైన సర్వేపల్లి రాథాకృష్ణన్, వి.వి.గిరి, జైల్‌సింగ్, ఎ.పి.జె.అబ్దుల్ కలాంల వద్ద నుండి గుర్తింపు, గౌరవాలను పొందారు. అయన పంజాబ్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి చేసిన కృషికి గానూ "అమరీందర్ సింగ్" నుండి "ఉద్యోగరత్న అవార్డు" అందుకున్నారు. ఆయన రాష్ట్రప్రభుత్వ ఖజానాకు చేసిన సేవలకు గానూ "సమ్మాన్ పాత్ర" అవార్డును పొందారు. సాంఘిక సేవలకు గుర్తింపుగా ఇందిరా గాంధీ నేషనల్ యూనిటీ అవార్డును తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చేసిన కృషికిగానూ ఆయనకు పంజాబ్ రత్న అవార్డు వచ్చింది.[1]

మరణంసవరించు

ఓం ప్రకాష్ ముంజల్ పంజాబ్‌లోని లుథియానాలో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన 87 ఏళ్ల ముంజల్‌ కొన్ని రోజులపాటు లుథియానాలోని సంస్థకు చెందిన హీరో హార్ట్ ఇష్టిస్ట్యూట్ ఆఫ్ దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2015 ఆగస్టు 13 న తుదిశ్వాస విడిచారు.[3][4]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Chairman's Profile". Heromotors.com. 1928-08-26. Retrieved 2015-08-13.
  2. "The Tribune, Chandigarh, India - Ludhiana Stories". Tribuneindia.com. Retrieved 2015-08-13.
  3. హీరో సైకిల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ఒ.పి.ముంజల్ కన్నుమూత (13-Aug-2015)
  4. "Hero Cycles founder O P Munjal passes away | Business Standard News". Business-standard.com. Retrieved 2015-08-13.

ఇతర లింకులుసవరించు