ఓడపై సమయాన్ని సూచించేందుకు వాడే గంట ఓడ గంట. ఈ గంట ద్వారానే నావికులకు తమ విధుల వేళలు తెలిసేవి. ఓడ గంటను ఇత్తడి లేదా కంచుతో తయారు చేస్తారు. దీనిపై ఓడ పేరు చెక్కబడి ఉంటుంది.

Ship bell Titanic.

విధుల గంటలు మార్చు

మామూలు గడియారాల్లాగా కాకుండా ఓడ గంటలు ఎంత సమయామైందో అన్ని గంటలు కొట్టవు. ఆ గంటల వ్యవస్థ కింది విధంగా ఉంటుంది. దీన్ని క్లాసికల్ పద్ధతి అంటారు:[1]

గంటల పద్ధతి గంటల సంఖ్య వాచ్
మిడిల్ మార్నింగ్ ఫోర్‌నూన్ ఆఫ్టర్‌నూన్ డాగ్ ఫస్ట్
ఫస్ట్ లాస్ట్
ఒక గంట 1 0:30 4:30 8:30 12:30 16:30 18:30[lower-alpha 1] 20:30
రెండు గంటలు 2 1:00 5:00 9:00 13:00 17:00 19:00[lower-alpha 1] 21:00
మూడు గంటలు 2 1 1:30 5:30 9:30 13:30 17:30 19:30[lower-alpha 1] 21:30
నాలుగు గంటలు 2 2 2:00 6:00 10:00 14:00 18:00 22:00
ఐదు గంటలు 2 2 1 2:30 6:30 10:30 14:30 18:30 22:30
ఆరు గంటలు 2 2 2 3:00 7:00 11:00 15:00 19:00 23:00
ఏడు గంటలు 2 2 2 1 3:30 7:30 11:30 15:30 19:30 23:30
ఎనిమిది గంటలు 2 2 2 2 4:00 8:00 12:00[lower-alpha 2] 16:00 20:00 0:00

ఇతర ఉపయోగాలు మార్చు

  • పొగమంచు కప్పినపుడు ఈ గంటలు భద్రత కోసం వాడుతారు. ఆధునిక కాలంలో ఇదే ముఖ్యమైన ఉపయోగం.[3]
  • నౌకాదళ నౌకల్లో, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు నౌక మీదికి వచ్చేటపుడు వేళ్ళేటపుడూ ఈ గంటలను మోగిస్తారు.
  • కొత్త సంవత్సరం మొదలయ్యే క్షణాల్లో 16 సార్లు ఈ గంట కొడతారు - ముగుస్తున్న సంవత్సరానికి 8, కొత్త సంవత్సరానికి 8.
  • నావికులు చనిపోయినపుడు అతడు/ఆమె గౌరవార్థం 8 సార్లు ఈ గంట మోగిస్తారు. దీనర్థం అతడి విధులు ముగిసాయని. నౌకాయాన పరిభాషలో "ఎయిట్ బెల్స్" ను సంస్మరణ సందర్భంలో వాడుతారు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. United States Naval Institute (1996) [1902]. The Bluejackets' Manual (24th. Annapolis, MD. p. 370. ISBN 978-1591141532.
  2. Tony Gray. "Workshop Hints: Ship's Bells". The British Horological Institute. Archived from the original on 12 జూన్ 2011. Retrieved 25 మే 2012.
  3. "Ship's Bell". National Maritime Museum. Archived from the original on 9 December 2008. Retrieved 2008-04-07.

బాహ్య లింకులు మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓడ_గంట&oldid=3583854" నుండి వెలికితీశారు