కంచు
కంచు (Bronze) ఒక మిశ్రమ లోహము. వివిధ రకాల రాగి యొక్క మిశ్రమ లోహాలను కంచు అంటారు. కాని దీనిలో ముఖ్యంగా రాగి, తగరము ఉంటాయి. అయితే కొన్ని సార్లు కంచులో తగరానికి బదులు భాస్వరము, అల్యూమినియం, సిలికాన్ మొదలైన రసాయన మూలకాలు కూడా ఉంటాయి. పురాతన కాలములో కంచు యొక్క ప్రాధాన్యత విశేషముగా ఉండేది. కంచు యుగానికి ఈ మిశ్రలోహము వల్లే ఆ పేరు వచ్చింది. కంచుకు ఆంగ్ల పదమైన బ్రాంజ్ పర్షియన్ పదమైన "బిరింజ్" నుండి ఉద్భవించింది. పార్శీలో బిరింజ్ అంటే రాగి అని అర్థం [1]
చరిత్ర సవరించు
కంచును ఉపయోగించిన అన్ని నాగరికతలలోనూ కంచు ప్రధానస్థానాన్ని ఆక్రమించింది. మానవజాతి యొక్క సృష్టించిన అత్యంత విన్నూతనాత్మక మిశ్రమలోహాల్లో కంచు ఒకటి. కంచుతో తయారుచేసిన పనిముట్లు, ఆయుధాలు, కవచాలు, అలంకారానికి ఉపయోగించిన తాపడాలు వంటి ఇతర నిర్మాణ సామగ్రి, వాటికంటే ముందు చాల్కోలిథిక్ యుగంలో రాతితో, రాగితో చేసిన వస్తువుల కంటే దృఢంగా ఉండి, మరింత ఎక్కువ కాలం మన్నేవి.
ఉపయోగాలు సవరించు
మూలాలు సవరించు
- ↑ Online Etymological Dictionary http://www.etymonline.com/index.php?term=bronze