ఓరుగంటి నీలకంఠశాస్త్రి
ఓరుగంటి నీలకంఠశాస్త్రి ఒక ప్రసిద్ధి చెందిన పండితుడు, ఉభయభాషా పారంగతుడు.
విశేషాలు
మార్చుఇతడు జూలై 19 వ తేదీన విజయనగరంలో జన్మించాడు. ఇతడు విజయనగర మహారాజా సంస్కృత కళాశాలలో విద్యను కొనసాగించాడు. సంస్కృత అలంకార, వ్యాకరణశాస్త్రాలు, పూర్వోత్తర మీమాంసలు, తర్కశాస్త్రము, ప్రస్థాన త్రయము సమగ్రంగా అభ్యసించినాడు. ఇతడు 1971 వరకు గుంటూరు హిందూ కళాశాలలోను, 1971-72లో కె.వి.కె సంస్కృత కళాశాలలోను సంస్కృత అధ్యాపకుడిగా పనిచేశాడు. తరువాత గుంటూరు పి.జి.కాలేజీలో తెలుగు శాఖలో యు.జి.సి.గౌరవాచార్యునిగా పనిచేశాడు.[1]
రచనలు
మార్చుఇతని రచనలు అనేకం భారతి వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతని రచనలలో కొన్ని:
- తల్లి విన్కి (లలితా సహస్రనామ వివృతి)
- తిక్కయజ్వ హరిహరనాథతత్త్వము
- శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
- సూతసంహిత
- అక్షర సమామ్నాయము
- లోచనము
- కళ్యాణలీల మొదలైనవి.
బిరుదములు
మార్చు- వ్యాకరణ విద్యా ప్రవీణ
- ఉభయ భాషా ప్రవీణ
- వేదాంత పారీణ మొదలైనవి.
మూలాలు
మార్చు- ↑ కె. సుధాకరరావు (12 June 1981). "శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 70. Retrieved 12 February 2018.[permanent dead link]