ఓర్నేట్ లోరికీట్
ఓర్నేట్ లోరికీట్, (ట్రైకోగ్లోస్సస్ ఓర్నేటస్) అనేది సిట్టాసిడే కుటుంబములోని ప్రత్యేకమైన చిలుక. ఇది ఇండోనేషియా లోని సులవేసి దీవి, దాని చుట్టు పక్కల దీవులకు ప్రత్యేకమైన చిలుక. [2] ఇది అడవులలోనూ, చెట్లతోపుల్లోనూ, మడ అడవుల లోనూ, తోటలలోనూ సాధారణంగా కనిపిస్తుంది.[2]
ఓర్నేట్ లోరికీట్ | |
---|---|
At Nashville Zoo, USA | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Superfamily: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | T. ornatus
|
Binomial name | |
Trichoglossus ornatus (Linnaeus, 1758)
|
వర్ణన
మార్చుఓర్నేట్ లోరికీట్ అనేది 25 సెం.మీ. పొడవు గల ఆకుపచ్చని చిలుక. తలలో కళ్ళ పైభాగం ముదురు నీలం రంగులో, కింద భాగం ఎర్రగా ఉంటుంది. తల వెనుక భాగం ఎర్రగా ఉండి కళ్ళ వెనుక పసుపు రంగులో ఉంటుంది. మెడ వెనుక రైన్బౌ లోరికీట్కి ఉన్నట్టు పట్టీ ఉండదు. గడ్డం కింది నుండి ఛాతీ వరకు పసుపు కలగలిసిన ఎరుపు, నీలం అడ్డ గీతలు ఉంటాయి. ముక్కు నారింజ ఎరుపు రంగులో ఉంటుంది. కంటి పాపలు ముదురు నారింజ రంగులో ఉంటాయి. కంటి చుట్టూ ఉండే వలయం ముదురు బూడిద రంగులో ఉంటుంది. కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి.[3]
మూలాలు
మార్చు- ↑ BirdLife International (2013). "Trichoglossus ornatus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.
- ↑ 2.0 2.1 Coates, B. J., & K. D. Bishop (1997). A Guide to the Birds of Wallacea. Dove Publications Pty. Ltd. ISBN 0-9590257-3-1
- ↑ Forshaw (2006). plate 13.
- BirdLife International (2008). Trichoglossus ornatus. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 15 April 2009.
చూపగలిగిన పాఠాలు
మార్చు- Forshaw, Joseph M. (2006). Parrots of the World; an Identification Guide. Illustrated by Frank Knight. Princeton University Press. ISBN 0691092516.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.