నారింజ లేదా నారింజ పండు సిట్రస్ జాతికి చెందిన ఫలం. దీనిని ఉష్ణ దేశాల్లోనూ, సమశీతోష్ణ ప్రాంతాల పండిస్తున్నారు. మన తెలుగు దేశంలో నంద్యాల, కోడూరు, వడ్లమూడి మొదలగు ప్రాంతాలలో బాగా పండిస్తున్నారు. నారింజపండ్లు కాలం గడుస్తున్న కొద్దీ ప్రకృతిరీత్యా మార్పులు చెందుతూ వస్తున్నాయి. నిమ్మ, బత్తాయి, నారింజ ఒకే జాతికి చెందిన ఫలాలు. వీని గుణాలు దాదాపు సమానంగానే ఉంటాయి. దీన్ని నిమ్మకన్నా కాస్త ఉత్తమం అంటారు. నిమ్మలోని గుణాలతో పాటుగా, తీపి అనే అదనపు గుణం కూడా నారింజ కుంటుంది.

నారింజ పండు
నారింజ

నారింజ రకాలు

మార్చు

నారింజలో రెండు రకాలున్నాయి - పుల్ల నారింజ, తీపి నారింజ. పుల్ల నారింజ కాయలలో నీరు అధికంగా ఉంటుంది, లవణాలు తక్కువగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కాస్తుంటాయి. తీపి నారింజలు వేసవిలో కాస్తాయి. వీటిలో నీటి భాగం తక్కువ. లవణాలు ఎక్కువ. ఇది దేహానికి మేలు మేస్తాయి. కాబట్టి వేసవి కాలంలో కాచే నారింజ పండ్లను తినటం ఎక్కువ శ్రేయస్కరం.

నారింజ లోపలి భాగంలో క్రాస్ కట్టింగ్ స్కాన్

ఆరోగ్యానికి నారింజ

మార్చు

చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం. ఆరెంజ్రంగులు చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు. “ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌” అనే శాస్త్రీయ నామం కలిగిన నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌, సంస్కృతంలో “నారంగ-ఐరావతి”, హిందీలో “నారంగీ, సంతరా”, బంగ్లాలో “కమలా రేఖ” అనే పేర్లతో పిలుస్తుంటారు. నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులో ఊరబెట్టి, ఎండబెట్టి, కారం, మెంతిపొడి కలుపుకున్నట్లయితే… ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు… నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు ఉంది. నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అన్ని కాలాల్లోనూ ఇప్పుడు హైబ్రీడ్ కమలాలు దొరుకుతున్నా.. ఎక్కువగా చలికాలం నుండి వేసవి కాలందాకా ఎక్కువగా కమలాపండ్లు దొరుకుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. ఆస్తమా, ట్యూబర్‌క్యూలోసిస్‌తో ఇబ్బంది పడేవారికి కమలాపండు అతిముఖ్యమైన ఆహారం. ఈ పండు రసం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు. కమలాపండులో అధికంగా ఉండే పోలిక్ యాసిడ్ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది. మజిల్స్, అజీర్ణం, జ్వరం వంటి జబ్బులను నయం చేయడంలో కమలా రసం పాత్ర చెప్పుకోతగ్గది. యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. తరచూ జలుబు చేసేవారిలో రోగనిరోధక శక్తి పెంచగలదు. Updates : ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 50శాతానికి పైగా... అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మరి ఆ ముప్పును తప్పించుకోవాలంటే? రోజుకు రెండుగ్లాసుల కమలా రసం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఫ్రెంచ్‌ వైద్యనిపుణులు. కమలాల్లో ఉండే హెస్పెరిడిన్‌ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుందని చెబుతున్నారు వారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆరెంజ్‌ా జ్యూస్‌ తాగితే నెలరోజుల్లోపే వారి సిస్టోలిక్‌ రక్తపోటులో ఏడుశాతం, డయాస్టోలిక్‌ రక్తపోటులో 4.5 శాతం తరుగుదల కనిపిస్తుందని వారి పరిశోధనల్లో తేలింది. రక్తపోటుతో పాటు మధుమేహం కూడా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించకుండా కమలారసం తాగొద్దని హెచ్చరిస్తున్నారు. నారింజ రసం క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మూత్రపిండాల వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా సహాయపడుతుంది.

పేర్లు

మార్చు

దీనిని సంస్కృతంలో "నారంగ-ఐరావతి:" అంటారు. హిందీలో "నారంగీ, సంతరా" అంటారు. బంగ్లాలో "కమలా రేఖ" అంటారు. ఇంగ్లీషులో "ఆరెంజ్‌ క్లాటస్‌ ఆరంటమ్‌" అన్న సాంకేతిక నామం దీనికుంది.

పోషక విలువలు

మార్చు

నారింజలో విటమిన్లు, లవణాలు, ఎక్కువగా ఉండటం వల్ల, దీనికి ప్రపంచంలో ఎంతో గిరాకీ ఉంది. విటమిన్ ‌- ఏ, బి స్వల్పంగా, విటమిన్‌ - సి ఎక్కువగా ఉంటాయి. ఆరు ఔన్సుల నారింజ రసం త్రాగితే చాలు, మనిషికి ఆ రోజుకు కావలసిన 'సి' విటమిన్‌ లభిస్తుంది. కోయకుండా అలాగే తినటం మంచిది, లేదా రసం తీసి త్రాగటం మంచిది. కాల్షియం ఈ పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని కాల్షియం దేహ ధాతువుల్లో సులభంగా కలసిపోతుంది. నారింజ తొనల చర్మంలో కాల్షియం ఎక్కువ. తీపి నారింజలో చక్కెర ఎక్కువ. కాబట్టి అది కాస్త ఎక్కువ శక్తిని ఇస్తుంది. సూర్యరశ్మిలో పండినప్పుడు, నారింజలోని పిండిపదార్ధాలు చక్కెరగా మారుతాయి కాబట్టి, నారింజ సులభంగా జీర్ణ అవుతుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాలలో, జీర్ణశక్తి తగ్గినప్పుడు, నారింజను వాడితే, దేహానికి కావలసిన రీతిగా అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది. ఆహారనాళ్ళలో విషక్రిములు చేరకుండా, నారింజ వాటిని చంపివేస్తూ ఉంటుంది.

నారింజ పండులోని పోషక విలువలు
  • తేమ - 87.8%
  • సున్నము - 0.5% మై.గ్రా
  • మాంసకృత్తులు - 0.9%
  • పిండి పదార్ధలు - 10.6%
  • భాస్వరము - 0.2% మై.గ్రా
  • క్రొవ్వు - 0.3%
  • ఇనుము - 01% మై.గ్రా
  • సేంద్రియ లవణాలు - 0.4%
  • విటమిన్‌ - ఏ - 350 I.U.
  • విటమిన్‌ - బి1 - 120 I.U.
  • విటమిన్‌ - సి - 68 I.U.
  • నారింజపండు ఇచ్చే శక్తి - 49 కేలరీలు

గృహ వైద్యంలో నారింజ

మార్చు

మలబద్ధకం, చాలా రోగాలకు దారి తీస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు నారింజ పండ్లను, ఉదయం స్నానానంతరం రెండు పండ్లను తింటే మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది. మలబద్దకం పోతుంది. కేవలం తీపి నారింజ ద్వారా ఉబ్బసాన్ని, శ్వాసనాళ వ్యాధులను వైద్యులు తగ్గిస్తూ ఉంటారు. జీర్ణం కాని కఠిన తిను పదార్ధలను, వేళాపాళా లేకుండా అతిగా తినటం వల్ల, ఈ రోగాలు సంక్రమిస్తుంటాయి. వారికి తేలికగా జీర్ణమయ్యే రోగ నిరోధక శక్తి గల నారింజ పండ్లను ఇస్తే, ఆ రోగాలు ఉపశమిస్తాయి. 'పయోరియా' వంటి దంతవ్యాధులు నారింజ రసాన్ని సేవిస్తే తగ్గిపోతాయి. నారింజ పండు కఫ, వాత, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులోఊరించి, ఎండించి, కారం, మెంతి చేరిస్తే, ఊరగాయలా నిల్వ ఉంటుంది. రుచిగా ఉండటమే కాక, ఆరోగ్యాన్ని కూడా వృద్ది పరుస్తుంది. నారింజ పళ్ల తొక్కలను నీడలో ఎండ బెట్టి మెత్తగా పొడి చేసి దానిని పెరుగులో కలిపి ముఖానికి లేపనంగా రాసుకొ పది నిముషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖం మీద ఏర్పడిన మృత కణాలు పోయి ముఖం కాంతివంతంగా వుంటుంది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నారింజ&oldid=4222243" నుండి వెలికితీశారు