ఓల్డ్ బాయ్ (కొరియా చిత్రం)

Oldboy (Hangul: 올드보이; RROldeuboi; MROldŭboi) 2003 లో వచ్చిన దక్షిణకొరియా చిత్రం. ఈ చిత్రానికి పార్క్ చాన్-వుక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జపనీస్ "మంగ" అని పిలువబడే బొమ్మల కథ నుండి గ్రహించారు. ఈ బొమ్మల కథను జపనీస్ లో నొబువాకి మినేగిషి, గారోన్ సుషియా సృష్టికర్తలు. పార్ చాన్-వుక్ దర్శకత్వం వహించిన వెంజెంస్ ట్రయాలజీలో ఈ చిత్రం రెండవది. మొదటి చిత్రం సింపతి ఫర్ మిస్టర్ వెంజెంస్. చివరి చిత్రం సింపతి ఫర్ లేడి వెన్ జెంస్.

Oldboy
Oldboykoreanposter.jpg
Theatrical release poster
దర్శకత్వంపార్క్ చాన్-వుక్
రచనHwang Jo-yoon
Im Joon-hyeong
Park Chan-wook
నిర్మాతIm Seung-yong
Kim Dong-joo
తారాగణంChoi Min-sik
Yoo Ji-tae
Kang Hye-jung
ఛాయాగ్రహణంChung Chung-hoon
కూర్పుKim Sang-bum
సంగీతంJo Yeong-wook
నిర్మాణ
సంస్థలు
Show East
Egg Films
పంపిణీదార్లుShow East (KR)
Tartan Films (US/UK)
విడుదల తేదీs
21 నవంబరు 2003 (2003-11-21)(South Korea)
15 మే 2004 (Cannes Film Festival)
సినిమా నిడివి
120 minutes
దేశంSouth Korea
భాషKorean
బడ్జెట్US$3 million
బాక్సాఫీసు$15 million[1]

ఈ చిత్రం 2004లో కేన్స్ చలన చిత్ర ఉత్సవాలలో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. అక్కడ జ్యూరీ సభ్యుడైన ప్రముఖ దర్శకుడు"క్వెంటిన్ టారంటినో"నుండి ఈ చిత్రానికి ప్రశంసలందాయి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సినీ విమర్శకుడు రోజర్ ఎబెర్ట్  ఈ చిత్రాన్ని గురించి వ్రాస్తూ"Oldboy is a "powerful film not because of what it depicts, but because of the depths of the human heart which it strips bare". 2008లో సి.ఎన్.ఎన్ ఈ చిత్రాన్ని ఆసియాకు చెందిన ఉత్తమ పది చిత్రల్లో ఒకటిగా పేర్కొంది.

1988లో ఒడేసు అనే వ్యాపారవేత్త తన కూతురి పుట్టిన రోజున ఇంటికి మద్యం సేవించి వెళ్తుండగా పోలిసులు అరెస్టు చేస్తారు. అతని మిత్రుడు జూ-వాన్ వచ్చి విడిపిస్తాడు. ఇద్దరు కలిసి ఒడేసు వాళ్ళ ఇంటికివెళ్తు మధ్యలో జూవాన్ ఒడేసు భార్యతో టెలిఫోన్ బూత్ నుండి మాట్లాడుతుండగా ఎవరో వచ్చి ఒడేసుని కిడ్నాప్ చేస్తారు. ఒడేసుని ఒక హోటల్ రూంలో బంధించి ఆహారాన్ని అందిస్తుంటారు. తనను ఎందుకు బంధించారో, తనను ఎవరు బంధించారో అతను ఎన్ని సార్లు అడిగినా చెప్పారు. హోటల్ రూంలో ఉన్న టీవీలో తన భార్య హత్యకు గురియైందని పోలిసులు ఆ హత్య చేసింది ఒడేసునని అనుమానిస్తారు. ఒడేసు బంధింపబడి ఉన రోజులలో డైరీ వ్రాస్తూ, షాడో బాక్సింగ్ చేస్తూ, తనని కిడ్నాప్ చేసిన వారిపై పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూంటాడు. హోటల్ రూంలోనుంచి సొరంగం తవ్వైనా సరే బయట పడాలనుకుంటాడు. ఒక సారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కాని అతనిని బంధించినవారు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటారు. చివరికి 15 సంవత్సరాల తరువాత 2003లో ఒక అపార్ట్మెంటు పైన ఒక సూట్కేసులో పెట్టి వదిలేస్తారు. అతనికి ఒక బిచ్చగాడి ద్వారా ఒక పర్సులో డబ్బును, ఒక మొబైల్ ఫోనును అందిస్తారు. ఒడేసుని బంధించిన అతను ఫొన్ చేస్తాడు. తనను ఎందుకు బంధించింది చెప్పడానికి నిరాకరిస్తాడు. చివరికి ఒడేసు ఒక సుషీ రెస్టారెంటులో స్పృహతప్పి పడిపోతాడు. అక్కడ పనిచేస్తున్న మిడో అనే యువతి అతనిని తన అపార్ట్మెంటుకు తీసుకు వెళూతుంది. అతను వ్రాసుకున్న డైరీ చదివి అతనిపై జాలిపడుతుంది. ఒడేసు తన కూతురి ఆచూకి కనుక్కోవాలని ప్రయత్నిస్తాడు. తనకూతురిని స్వీడన్ కు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారని తెలుసుకుంటాడు. ఆమెను కలుసుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకుని తనను బంధించినవారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. తనను బంధించివున్న రోజులలో తనకు అందించిన ఆహారాన్ని ఏ రెస్టారెంటు నుంచి తెప్పించేవారో కనుక్కోని వారిద్వారా తనను బంధించి వుంచింది ఒక ప్రయివేటు చెరసాల అని కొందరు వ్యక్తులు తమకు పగ వున్న వారిపై  ఇక్కడ డబ్బులు ఇచ్చి బంధింపజేస్తారని తెలుసుకుంటాడు. అక్కడ వార్డెన్గా పనిచేసే మిస్టర్ పార్క్ ను ఒడేసు చిత్రహింసకు గురిచేసి తనను బంధించడానికి కారణాలను ప్రశ్నించగా  తనను కిడ్నాప్ చేయించింది ఎవరో తనకు తెలియదని తనను కిడ్నాప్ చేయించడానికి కారణం మాత్రం “తను ఎక్కువగా వాగడమే” నని తనకు తెలుసునంటాడు మిస్టర్ పార్క్. అక్కడ వున్న రౌడీలతో జరిగిన సన్నివేశంలో తీవ్రంగా గాయపడతాడు.

చివరికి ఒక సందర్భంలో తనను కిడ్నాప్ చేయించిన వ్యక్తి లీ వూ-జిన్ అనే ధనవంతుడని తెలుసుకుంటాడు. లీ వూ-జిన్, ఒడేసూకి ఫోన్ చేసి తనని బంధించడానికి గల కారణాలను 5రోజులలో కనుగొంటే తను ఆత్మహత్య చేసుకుంటానని ఒకవేళ కనుక్కోలేకపోతే నీతోవున్న మిడోను కూడా చంపివేస్తానని చెబుతాడు. ఒడేసు తన భార్యని, కూతురిని కోల్పోయానని ఇప్పుడు మిడోని కోల్పోవద్దని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒడేసుతో శారీరకంగా దగ్గరవుతాడు. ఒడేసు చిన్ననాటి సేహితుడు జూ-వాన్ ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటాడు. వూ-జిన్ యొక్క అక్క తమతో పాటే చదువుకుందని, ఆమెను గురించిన విషయాలు మాట్లాడుతుండగా  జూ-వాన్న్ను, వూ –జిన్ వచ్చి చంపేస్తాడు. ఒడేసు తను చదువుకున్న పాఠశాలకు వెళ్ళి తను చదువుకున్నప్పుడు జరిగిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.  వూ-జిన్ వాళ్ళ అక్క లీ సూ-హాతో పాఠశాలలో ఒక గదిలో కామిస్తూ వుండగా ఒడేసు కిటికీ లోనుంచి చూస్తాడు. ఆ విషయాన్ని తన మిత్రుడు జూ-వాన్ తో చెప్తాడు. ఆ విషయం పాఠశాల మొత్తం తెలిసిపోతుంది. చివరికి అది లీ సూ-హా తన తమ్ముడితో గర్భం దాల్చిందని పుకార్లు వస్తాయి. ఈ అవమానాన్ని తట్టుకోలేని లీ సూ-హా బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటి నుంచి వూ-జిన్ ఒడేసుపై పగ పెంచుకుంటాడు.  

ఈ విషయాన్ని వు-జిన్ తో చెప్పటానికి ఒడేసు వు-జిన్ స్థావరానికి వెళతాడు. అప్పుడు మిడోను మిస్టర్ పార్క్ వచ్చి తీసుకువెళతాడు. ఒడేసు లీ సూ-హాకు జరిగినదానికి క్షమాపణలు కోరతాడు. అప్పుడు వూ-జిన్ అసలు విషయాన్ని బయటపెడతాడు. మిడో ఎవరో కాదు నీ కూతురేనని ఒడేసుతో చెబుతాడు. మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడేలాగా హిప్నాటిజం ద్వారా చేయించానని. ఎందుకంటే నేను అనుభవించిన బాధ నువ్వు కూడా అనుభవించాలని అందుకే ఇలా చేసానని చెబుతాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మిడోతో కూడా తెలుపుతానని చెబుతాడు. హతాశుడైన ఒడేసు ఈ విషయం మిడోకు ఎట్టి పరిస్థితులలో తెలియకూడదని వూ-జిన్ ను బ్రతిమాలుతాడు.  తన నోటి నుండి ఈ భయంకరమైన విషయం బయటపడకూడదని తన నాలుకను కోసుకుంటాడు. అప్పుడు వూ-జిన్ మిస్టర్ పార్క్ కు మిడోతో ఈ విషయం చెప్పవద్దని చెబుతాడు. కొంతసేపటి తరువాత వూ-జిన్ తన అక్కను కాపాడుకోలేకపోయాననే బాధతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన వద్దనున్న పిస్టొలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఒడేసు ఒక హిప్నాటిస్టు వద్ద తన జీవితంలో జరిగిన పరిణామాలను ఒక లేఖ ద్వారా పంచుకుని పాత జ్ఞాపకాలను తన మెదడునుంచి చెరిపి వేయవలసిందిగా కోరతాడు.  హిప్నాటిస్టు ఒడేసు కోరుకున్న విధంగా పాత జ్ఞాపకాలను చెరిపి వేస్తుంది. కాని ఒక సారి వచ్చి కౌగిలించుకోగానే అతడి పెదవులపై చిరునవ్వు వస్తుంది.  ఇంతకీ అతడికీ అతడికి హిప్నాటిజం పనిచేసిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మిగులుతుంది.

నటీనటులు

మార్చు
  • Choi Min-sik as Oh Dae-su; he has been imprisoned for about 15 years. Choi Min-sik lost and gained weight for his role depending on the filming schedule, trained for six weeks and did most of his stunt work.
  • Yoo Ji-tae as Lee Woo-jin: The man behind Oh Dae-su's imprisonment. Park Chan-wook's ideal choice for Woo-jin had been actor Han Suk-kyu, who previously played a rival to Choi Min-sik in Shiri and No. 3. Choi then suggested Yoo Ji-tae for the role, despite Park's reservation about his youthful age.
  • Kang Hye-jung as Mi-do: Dae-su's love interest.
  • Ji Dae-han as No Joo-hwan: Dae-su's friend and the owner of an internet café.
  • Kim Byeong-ok as Mr. Han: Bodyguard of Woo-jin.
  • Oh Tae-kyung as young Dae-su
  • Ahn Yeon-seok as young Woo-jin
  • Woo Il-han as young Joo-hwan
  • Yoon Jin-seo as Lee Soo-ah, Woo-jin's sister.
  • Oh Dal-su as Park Cheol-woong, the private prison's manager.

బయట లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  1. Oldboy (2003 film)#cite note
  2. Oldboy (2003 film)#cite note-ebert

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mojo అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు