ఓవర్ ది కౌంటర్ మందులు

ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా వినియోగదారునికి అమ్మే మందులు

ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుండి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే నేరుగా వినియోగదారునికి అమ్మే మందులను ఓవర్ ది కౌంటర్ (OTC) మందులు అంటారు. అలా కాకుండా ప్రిస్క్రిప్షన్ మందులను డాక్టరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే అమ్ముతారు. అనేక దేశాల్లో, వైద్యుల సంరక్షణ లేకుండా ఉపయోగించినప్పుడు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉండే పదార్థాలు కలిగి ఉన్న OTC ఔషధాలను రెగ్యులేటరీ ఏజెన్సీ ద్వారా ఎంపిక చేస్తారు. OTC మందులలో ఉండే క్రియాశీల ఔషధ పదార్ధం (API), ఆయా మందుల బలాలను బట్టి వాటిని నియంత్రిస్తారు.[1]

పిల్లలు తెరవలేణి ప్యాకేజింగ్ (టోపీ) తో చెడగొట్టలేని కార్టన్‌లో లోపల సీల్‌తో కూడిన OTC బేయర్ మందులు

ఓవర్-ది-కౌంటర్ (OTC ) అనే పదం మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయగల మందులను సూచిస్తుంది.[2] ప్రిస్క్రిప్షన్ మందులను డాక్టరు గానీ ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులు గానీ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే ఉపయోగించాలి.[3] కొన్ని ఔషధాలను చట్టబద్ధంగా ఓవర్-ది-కౌంటర్‌గా వర్గీకరించవచ్చు. కానీ రోగి అవసరాలను అంచనా వేసిన తర్వాత లేదా వాటిని వాడే విధానాన్ని, వాటి ప్రభావాలనూ రోగికి వివరించిన తర్వాత మాత్రమే ఫార్మసిస్టు వాటిని అమ్మవచ్చు. ఔషధాలను ఏయే దుకాణాల్లో విక్రయించవచ్చు, వాటిని పంపిణీ చేయడానికి ఎవరికి అధికారం ఉంది, ప్రిస్క్రిప్షన్ అవసరమా లేదా అనే వివరాలు, నిబంధనలూ వివిధ దేశాల్లో వివిధాలుగా ఉంటాయి.

వాడుక

మార్చు

2016 నవంబరులో భారతదేశపు డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ, ప్రిస్క్రిప్షన్ లేకుండా పంపిణీ చేయగల ఔషధాల నిర్వచించనున్నట్లు ప్రకటించింది. అయితే, 2024 నాటికి, ప్రిస్క్రిప్షన్ పరిధి లోకి రాని ఏ ఔషధాన్నైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయవచ్చు.[4]


సాధారణ నియమం ప్రకారం, వైద్యుని ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేని చికిత్స లోను, సురక్షితమైనవని, బాగా తట్టుకోగలవనీ సహేతుకంగా నిరూపితమైన మందులనూ ఓవర్-ది-కౌంటర్‌గా అమ్మవచ్చు.[5] OTC మందులు సాధారణంగా దుర్వినియోగ సంభావ్యత బాగా తక్కువగా ఉండాలి లేదా అసలే ఉండకూడదు. అయితే కొన్ని ప్రాంతాలలో కొడీన్ వంటి మందులు అందుబాటులో ఉంటాయి (ఖచ్చితమైన, పరిమితమైన ఫార్ములేషన్లలో ఉంటాయి. లేదా కొనుగోలు సమయంలో ఏదో ఒక గుర్తింపును సమర్పించడం అవసరం).[6]

కాలక్రమంలో (3-6 సంవత్సరాలలో) ప్రిస్క్రిప్షన్ మందులు సురక్షితమైనవని నిరూపితమైనపుడు వాటిని OTC గా మార్చవచ్చు. ఉదాహరణకు, బెనాడ్రిల్ ఒకప్పుడు ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందు. ఇప్పుడు దాదాపు ప్రతిచోటా ఇది OTC గా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Over-the-Counter Medicines: What's Right for You?". FDA. Retrieved 19 May 2024.
  2. "Understanding Over-the-Counter Medicines". Center for Drug Evaluation and Research (in ఇంగ్లీష్). U.S. Food and Drug Administration. 2019-08-14. Retrieved 2019-08-26.
  3. "Prescription Drugs and Over-the-Counter (OTC) Drugs: Questions and Answers". Center for Drug Evaluation and Research (in ఇంగ్లీష్). U.S. Food and Drug Administration. 2019-04-25.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. (May 2021). "Consumption of over-the-Counter Drugs: Prevalence and Type of Drugs".
  6. (May 2021). "Consumption of over-the-Counter Drugs: Prevalence and Type of Drugs".