జనరిక్ మందులు
Generic Medical
Available inఆంగ్లంలో
Headquarters
Commercialఅవును, తక్కువ ధరకు[1]

జనరిక్ మందులు అంటే

మార్చు

జనరిక్ మందులు బ్రాండెడ్ మందులు పేరు మాత్రమే వేరు తయారీ ఒకటే ఫార్ములా ఒకటే. జనరిక్ మందులు తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి అవి సరిగా పని చేస్తాయో చేయవో అని ప్రజలు భయపడుతున్నారు. జనరిక్ పైన డాక్టర్ల కూడా శ్రద్ద చూపడంలేదనే వాదన ఉంది. అయితే కొందరు డాక్టర్లు మాత్రం జనరిక్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. రెండు మూడు రోజుల్లో వాడే మందులు బ్రాండెడ్ కొన్నా పర్లేదు కాని నెలల తరబడి మందులు వాడే వారు మాత్రం జనరిక్ కొనడమే ఉత్తమం అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మందులకి అయ్యే ఖర్చు నెలకి వేయికి పైనే ఉంటుంది..జనరిక్ మందులపై దృష్టి పెడితే మందుల కోసం చేసే ఖర్చు చాలా వరకు తగ్గనుంది.[2]

తక్కువ ధరలో జనరిక్ మందులు

మార్చు

తక్కువ ధరలో లభిస్తున్న జనరిక్ మందులు..మనదేశంలో ప్రతి ఏటా వేల కోట్ల మెడికల్ బిజినెస్ జరుగుతోంది. రూపాయి డ్రగ్‌ని పది రూపాయలుకు విక్రయిస్తున్నా ప్రశ్నించలేని పరిస్ధితి. మెడికల్ మాఫియా ఆటకట్టించడానికి జనరిక్ మెడిసన్ వచ్చినా సరైన ఆదరణలేదు. జనరిక్ వచ్చి 20 ఏళ్లు అవుతున్నా 20% మంది ప్రజలు కూడా జనరిక్ మెడికల్ షాపులకి వెళ్లడం లేదంటే జనరిక్ మెడిసన్ పట్ల ప్రజలకి అవహగానలోపం ఎంతలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

బ్రాండెడ్ మందులు

మార్చు

ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు, పరీక్షలు చేసి మందును మా‌ర్కెట్ లోకి తీసుకొస్తాయి.

అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీ పై ఆ కంపెనీకి కొంత కాలం పాటు (20 సం.లు) పేటెంట్ హక్కులు ఉంటాయి..

అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అంటారు.[3]

ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినా ఏ ఫార్మా కంపెనీ అయినా సరే, దానిని పేటెంట్ ఉన్న కాలంలో పెటెంట్ పొందిన కంపెనీ అనుమతి లేకుండా ఆ మందు తయారు చేయకూడదు.

అలా పేటెంట్ లో ఉన్న మందులను ఇతరులు ఎవరైనా తయారు చేసి అమ్మితే వారు శిక్షార్హులౌతారు. అంటే ఆ మందుపై, మొట్ట మొదట తయారు చేసిన కంపెనీకే 20 సంవత్సరాల పాటు గుత్తాది పత్యం ఉంటుంది.

నిజానికి ఆ మందును తయారు చేయడానికి అయ్యే ఖర్చుకూ, ఆ మందుపై కంపెనీ వసూలు చేసే అమ్మకపు ధరకు ఏ మాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే మందు యొక్క అమ్మకపు ధర అనేక రెట్లు అధికంగా ఉంటుంది.[3]

ఎందుకింత తేడా

మార్చు

ఎందుకంటే ఆ మందు తయారీ కోసం "పరిశోధనలు మరియూ క్షేత్ర స్థాయి పరీక్షల" నిమిత్తం మాకు చాలా డబ్బు ఖర్చైందని సదరు కంపెనీ వాదిస్తుంది.. కాబట్టి ఓ 20 సంవత్సరాల పాటు ఆ మందుపై దానిని తయారు చేసిన కంపెనీకి పేటెంట్ హక్కులు కల్పించి, పెట్టుబడి సొమ్మును రాబట్టుకోడానికి, ఆ మందును మొట్టమొదట తయారు చేసిన కంపెనీకి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.

జనరిక్ మందులు అంటే వివరణ

మార్చు

మందు పై #మొట్టమొదటి తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత, అవే కెమికల్స్ ను ఉపయోగించి, అదే ఫార్ములాతో, అదే మందును ఏ కంపనీ అయినా తయారు చేసి, మార్కెట్ లోకి విడుదల చేయొచ్చు.. అలా తయారు చేసిన మందులను " జనరిక్_డ్రగ్స్" అంటారు.[4]

జనరిక్ మందులు - బ్రాండెడ్ మందులు ఒకటే

మార్చు

జనరిక్ డ్రగ్స్ తయారు చేయటానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కాని క్లినికల్ ట్రయల్స్ గాని జరపవలసిన అవసరం లేదు. అందువలన జనరిక్ డ్రగ్స్ ధరలు, బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30 నుండి 80 శాతం తక్కువ ధరలలో లభిస్తాయి. వీటిపై ముద్రించబడే యం.ఆర్.పీ కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు.[5]

తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులు అని, సరిగా పని చేస్తాయో చేయవో అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ జనరిక్ మందుల తయారీలోను పాటిస్తారు. బ్రాండెడ్ మందులెలా పనిచేస్తాయో, జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి.

👉 కాని ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకూ, ఫార్మా ఏజెన్సీలకూ, మందుల షాపులకూ, అందరికీ నష్టమే కదా.

అందుకనే జనరిక్ మందులపై, అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకార్లు లేవదీస్తున్నారు.. అది నిజం కాదు జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పని చేస్తాయి.

బ్రాండెడ్ మందులు తయారు చేసే ఫార్మా కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ బ్రాండెడ్ ఔషధాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాటిని సూచించమని కోరుతుంటాయి. డాక్టర్ ఎంతమేర రాస్తే.. అంతమేర ప్రతిఫలాలను ముట్టజెబుతాయి. ఈ ఫలాలు ఉచిత విదేశీ పర్యటనలు, చెక్, బహుమతులు ఇలా పలు రూపాలుగా ఉంటాయి. అందుకే బ్రాండెడ్ ఔషధాలు చాలా ఖరీదుగా ఉంటాయి.[5]

కొంత మంది వైద్యులు జనరిక్ మందులను సూచిస్తుంటారు. అవి వారి ఆస్పత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి. వాటి ధర వాస్తవానికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి మీద మీద ముద్రించబడిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ అడిగితే ఒక 10 శాతం తగ్గిస్తారు. దాంతో కస్టమర్ సంతోషిస్తాడు. కాని ముద్రిత ధర కంటే 50 నుంచి 80 శాతం వరకు తక్కువ ధర ఉంటుంది.

ఉదాహరణకు జ్వరానికి సాధారణంగా డాక్టర్ వద్దకు వెల్లకుండానే చాలా మంది వాడే మందు "డోలో 650" (పారసెటమాల్ 650 మి గ్రా.) దీని ధర 15 టాబ్లెట్లకు 29 /- రూపాయలు. ఇదే టాబ్లెట్ ను సిప్లా కంపని "పారాసిప్ 650" పేరుతో తయారు చేసి అమ్ముతుంది , దాని ధర 10 టాబ్లెట్ లకు 18/- రూపాయలు. నిజానికి జనరిక్ మెడికల్ షాపులలో పారసెటమాల్ 650 మి గ్రా. రూ. 4.50 /- లకు పది టాబ్లెట్ లభిస్తాయి.[6]

నొప్పి నివారణకు వాడే డైక్లో ఫెనాక్ సోడియం ఎస్ఆర్ బ్రాండెడ్ (వోవిరాన్)10 మందుల ధర 51.91. కానీ ఇదే ఔషధం 10 మందుల జనరిక్ ధర జనఔషధి స్టోర్ లో Rs. 3.35 మాత్రమే. 100 ఎంఎల్ కాఫ్ సిరప్ బ్రాండెడ్ వి అయితే 33 రూపాయలు పైనే. జనరిక్ దగ్గు మందు జనఔషధి స్టోర్ లో 13 రూపాయలకే లభిస్తుంది. జ్వరం తగ్గడానికి వాడే ప్యారాసిటమాల్ 500 మి గ్రా. 10 మాత్రల ధర బ్రాండెడ్ అయితే 13 రూపాయలు. జనరిక్ అయితే 2.45రూపాయలే.

👉 సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే గానీ.. లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది.

జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు అనుమానాలున్నాయి. వాటిని గూర్చి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. ఇటీవల కాలంలో వీటిపట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది.

ప్రభుత్వం జనరిక్‌ దుకాణాల ఏర్పాటు

మార్చు

నరేంద్ర మోడి జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు. ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.ప్రధాని ఇకపై దేశంలోని వైద్యులందరు జనరిక్ మందులనే రాయాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా ఓ కేంద్ర మంత్రి కూడా మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వైద్యులు తమ చీటిపై జనరిక్ మందుల పేర్లనే ప్రస్ఫుటంగా పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అధికశాతం వైద్యులు ఈ పని చేయడం లేదు. ఈ మధ్యకాలంలో నాసిరకం మందులు రాజ్యమేలుతున్నట్లు వార్తలొచ్చాయి. మార్కెట్‌లో లభ్యమయ్యే ఔషధాలలో 16 శాతం నాసిరకమైనవని ఇటీవల ఓ సర్వే బాటిల్‌ ఆఫ్‌ లైస్‌: రాన్‌ బాక్సీ అండ్‌ ది డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మా తేల్చింది.[7]

మందులు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జనరిక్‌ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా.. అవి జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించలేదు. 20 ఫార్మా కంపెనీలు బ్రాండెడ్‌తో పాటు జనరిక్‌ మందులూ తయారు చేస్తున్నాయి. జనరిక్‌ కంపెనీలు ప్రమాణాలకు కట్టుబడి ముడి రసాయనాలతోనే మందులను తయారు చేస్తాయి. భారత ప్రభుత్వం ఆధీనంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్స్‌ అనుమతితోనే ఉత్పత్తి చేస్తాయి. మార్కెటింగ్‌ ఖర్చులు లేకపోవడం వల్ల వాటిని తక్కువ ధరకే విక్రయిస్తాయి. సుమారు 75 శాతం వ్యాధులకు 400లకు పైగా రకాల జనరిక్‌ మందులు ఉన్నా ప్రజలకు మాత్రం అవి చేరువ కావడంలేదు. 20 నుంచి 25 శాతం మాత్రమే జనరిక్‌ మందులు విక్రయాలు జరుగుతున్నాయి.అమెరికా లాంటి దేశాల్లో 40 నుండి 80 శాతం జనరిక్ మందులే వాడటానికి ప్రధాన కారణం అక్కడవున్న పటిష్ఠమైన నిఘా నియంత్రణ వ్యవస్థలు. ఎఫ్.డి.ఎ. అనుమతితో, పర్యవేక్షణలో ఏ మందైనా వాడటం వారి ప్రత్యేకత.జనరిక్‌ మందుల తయారీ సంస్థలన్నీ క్రమబద్దీకరణ చట్టాలు కఠినంగా ఉండే యూరోపియన్, అమెరికన్‌ మార్కెట్ల కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఔషధాలను తయారు చేస్తున్నాయి. ప్రపంచదేశాలకు భారత్ జనరిక్ మందులు సరఫరా చేస్తున్నది. అవి సరసమైన ధరలకు అందించటం హర్షించదగ్గ విషయం. అయితే, అత్యవసరమైన మందులు కేవలం 20 నుంచి 30 శాతం వరకే జనరిక్‌లో అందుబాటులో ఉన్నాయి.[8]

డోలో 650

మార్చు

డోలో 650 అనేది బెంగుళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్‌ అనే ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 650 ఎంజీ డోసుగల పారాసెట్మాల్‌ ఔషధం. పారాసెట్మాల్‌ 500 ఎంజీ డోసు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో జ్వరాన్ని అదుపు చేయటానికి ఆ డోసు సరిపోవటం లేదని, కొంత అధిక డోసు అయితే మేలు అని వైద్యుల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ తరుణంలో 650 ఎంజీ డోసుతో 1993లో డోలో పేరుతో 650 ఎంజీ డోసు పారాసెట్మాల్‌ ట్యాబ్లెట్‌ను మైక్రో ల్యాబ్స్‌ తీసుకొచ్చింది.[9]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  4. https://www.sakshi.com/news/guest-columns/karan-thapar-article-generic-medicine-1207662
  5. 5.0 5.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  6. https://www.andhrajyothy.com/artical?SID=580379[permanent dead link]
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-24. Retrieved 2019-12-24.
  9. "అందరి నోళ్లలో నానుతున్న డోలో 650". EENADU. Retrieved 2022-01-23.