ఓ2 2022లో విడుదలైన తెలుగు సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకు జీఎస్‌ విక్నేష్‌ దర్శకత్వం వహించాడు. నయన తార, రిత్విక్‌ జోతిరాజ్‌, భరత్ నీలకంఠన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 17న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]

ఓ2
దర్శకత్వంజీఎస్‌ విక్నేష్‌
రచనఎస్.ఆర్. ప్రకాష్ బాబు
ఎస్.ఆర్. ప్రభు
తారాగణంనయన తార
రిత్విక్‌ జోతిరాజ్‌
భరత్ నీలకంఠన్‌
ఛాయాగ్రహణంతమిళ ఎ అళగన్
కూర్పుసెల్వ ఆర్.కె
సంగీతంవిశాల్ చంద్రశేఖర్
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ వారియర్ పిక్చర్స్
పంపిణీదార్లుడిస్నీ+ హాట్‌స్టార్
విడుదల తేదీ
17 జూన్ 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

పార్వతి (నయనతార) కొడుకు వీర (రిత్విక్) ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటాడు. ఆపరేషన్ చేయించడం కోసం బస్సు ప్రయాణం కొచ్చిన్ కు బయలుదేరగా మధ్యలో వర్షం వల్ల కొండచరియలు విరిగిపడి వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఓ లోయలో పడడంతో మట్టిలో కూరుకుపోతుంది. ఆ బస్సులో ఒక ఎమ్మెల్యే, ఒక ప్రేమ జంట, ఇలా రకరకాల వారు ఉండగా గాలి ప్రవేశించడానికి కూడా గ్యాప్ లేకపోవడంతో అందరూ ఆక్సిజన్ (O2) కోసం ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిసస్థితి నుంచి పార్వతి తనను తాను కాపాడుకుంటూ కొడుకును ఎలా రక్షించుకుంది? వారు బయటపడ్డరా లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

 • నయనతార
 • రిత్విక్
 • భరత్ నీలకంఠన్
 • ఆడుకాలం మురుగ దాస్
 • ఆర్.ఎన్.ఆర్. మనోహర్
 • లేనా
 • షారా
 • రిషికాంత్
 • అర్జునన్
 • జఫ్ఫార్ ఇడుక్కి

మూలాలు మార్చు

 1. Sakshi (20 June 2022). "దేవుడిచ్చిన లోపాన్ని కూడా సరిచేసే తల్లి కథ.. 'O2' రివ్యూ". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 2. ABP Live (17 June 2022). "ఓ2 సినిమా రివ్యూ: పెళ్లి తర్వాత నయనతార మొదటి సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓ2&oldid=3704468" నుండి వెలికితీశారు