కాశీ వంగ
(ఔషధ వంగ నుండి దారిమార్పు చెందింది)
కాశీ వంగ లేదా ఔషధ వంగ ఒక విధమైన చిన్న మొక్క. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క కాయలలో స్టిరాయిడ్ లున్నందువలన ఎంతో ప్రసిద్ధిచెందిన ఔషధ మొక్కగా పేరొందినది. వీనికి నొప్పులు, వాపులను తగ్గించే శక్తితో పాటు సంతాన నిరోధక లక్షణాలున్నాయి. అందువలన ఈ స్టిరాయిడ్ లను ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఔషధాలలో ఉపయోగిస్తున్నారు.
కాశీ వంగ | |
---|---|
Closeup of flowers | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Subclass: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | సొ. వైరమ్
|
Binomial name | |
సొలానమ్ వైరమ్ | |
Synonyms | |
See text |
ఇది వంగ మొక్కలాగా ఉండి ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా ఉంటాయి. కాండం మీద కొక్కెం లాంటి ముల్లుంటాయి. తెల్లని పుష్పాలను పూస్తుంది. పండినప్పుడు పసుపురంగుకు మారతాయి. విత్తనాలు గోధుమ రంగులో ఉంటాయి.
ఈ మొక్కలను అస్సాం, మణిపూర్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఒడిషా, నీలగిరి ప్రాంతాలలో పెంచుతున్నారు.