కంచర్ల రామకృష్ణారెడ్డి

కంచర్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. తెలంగాణ ప్రజా సమితి తరపున 1971 నుండి 1977 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

కంచర్ల రామకృష్ణారెడ్డి
కంచర్ల రామకృష్ణారెడ్డి

కంచర్ల రామకృష్ణారెడ్డి


పదవీ కాలం
1971 - 1977
నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1918-03-16) 1918 మార్చి 16 (వయసు 106)
మునుగోడు, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజా సమితి
తల్లిదండ్రులు రామారెడ్డి
జీవిత భాగస్వామి ద్రౌపతి దేవి
సంతానం ఒక కుమారుడు
మతం హిందూ, భారతీయ

జననం, విద్య మార్చు

రామకృష్ణారెడ్డి 1918, మార్చి 16న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, మునుగోడులో జన్మించాడు. తండ్రిపేరు రామారెడ్డి. హైదరాబాద్ హైకోర్టు నుండి లీగల్ డిప్లొమా (1వ గ్రేడ్ ప్లీడర్‌షిప్) పొందాడు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

రామకృష్ణారెడ్డికి ద్రౌపతి దేవితో వివాహం జరిగింది. ఈ దంపతులు ఒక అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు.

రాజకీయ జీవితం మార్చు

కాంగ్రెస్ పార్టీతో అనుబంధమున్న రామకృష్ణారెడ్డి తరువాత తెలంగాణ ప్రజా సమితి పార్టీలో చేరాడు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టిపిఎస్ పార్టీ నుండి పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెదిరే నరసింహారెడ్డిపై 5,398 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4]

సామాజిక సేవ మార్చు

  • విద్య, సామాజిక సేవను ప్రోత్సహించడంకోసం మునుగోడు విద్యా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
  • భూదానోద్యమంకు 1/4వ వంతు ఆస్తిని విరాళంగా ఇచ్చాడు.
  • జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణలోని దేశ్‌ముఖగిరిని వదులుకున్న మొదటి దేశ్‌ముఖ్ గా నిలిచాడు.[5]

నిర్వహించిన పదవులు మార్చు

  • కార్యదర్శి, నల్గొండ తాలూకా కాంగ్రెస్ కమిటీ
  • అధ్యక్షుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ
  • కార్యనిర్వాహక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్
  • అధ్యక్షుడు, తెలంగాణ ప్రజాసమితి, నల్గొండ జిల్లా
  • అధ్యక్షుడు, మునుగోడు పంచాయతీ సమితి
  • అధ్యక్షుడు, నల్గొండ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ
  • చైర్మన్, నల్గొండ జిల్లా పరిషత్

మూలాలు మార్చు

  1. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-04. Retrieved 2021-11-17.
  2. Staff (2019-04-01). "లోక్‌సభ ఎన్నికలు 2019: నల్గొండ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి". www.telugu.oneindia.com. Archived from the original on 2021-11-12. Retrieved 2021-11-17.
  3. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2020-11-29. Retrieved 2021-11-17.
  4. "Nalgonda Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Archived from the original on 2021-11-12. Retrieved 2021-11-17.
  5. "Shri Kancherla Ramkrishna Reddy MP biodata Nalgonda | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-11-17. Retrieved 2021-11-17.