కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

పామర్రులో దివంగత తుర్లపాటి చినరామకృష్ణయ్య ఇంటివద్ద 1926వ సంవత్సరంలో వల్లూరిపల్లి లక్ష్మీదాస్, షావుకారు సుబ్బారెడ్డిల సహకారంతో వీధిబడిగా ప్రారంభమయిన ఈ బడి నుండి 1936లోనే మొదటి బ్యాచ్ ఎస్.ఎస్.ఎల్.సి. విద్యార్థులు పరీక్షకు వెళ్ళినారు. కాలక్రమంలో జిల్లా పరిషత్తు అధీనంలోనికి వెళ్ళిన 1998వ సంవత్సరం వరకు, ఈ పాఠశాలను, స్థానిక సబ్- కోర్టు ఆవరణలోనే కొనసాగించారు. ఆ సమయలో ఆ భవనాన్ని రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకొనడంతో, నూతన పాఠశాల భవన నిర్మాణానికై పూర్వ విద్యార్థి శ్రీ కంచర్ల రామారావు 50 లక్షల రూపాయలు వితరణ చేసారు. మరియొక పూర్వ విద్యార్థి శ్రీ గుజవర్తి రామకృష్ణ 3 లక్షల రూపాయలనందించారు. రాజ్యసభసభ్యులుగా పనిచేసిన శ్రీ లాల్ జాన్ బాషా తన ఎం.పి.కోటా నిధులు రు. 30 లక్షలు, శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు రు. 10 లక్షలు అందించారు. వీరుగాక మరికొందరు దాతలుగూడా వితరణ చేయుటతో, మొత్తం ఒకటిన్నర కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం పూర్తి అయినది. భవన నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేటందుకు విశ్రాంత సివిల్ ఇంజనీరు శ్రీ ఎం.వి.వి.మూర్తిని నియమించడం గమనార్హం.

పాఠశాలలో హంగులు మార్చు

ప్రస్తుతం 20 గదులున్న ఈ పాఠశాలలో, సమావేశాలు నిర్వహించడానికి రెండు హాళ్ళు, కుర్చీలతోసహా సమకూర్చారు. విద్యార్థులకు కంప్యూటరు కోర్సులో శిక్ష్హణ, 2 ప్రయోగశాలల ఏర్పాటు ఈ పాఠశాల ప్రత్యేకత. ఈ పాఠశాలకు అభివృద్ధి కమిటీ గూడా ఉంది. ఈ కమిటీకి ప్రస్తుతం కంచర్ల రామారావు కుమారులు కంచర్ల యుగంధర్, కేశవులు ఈ కమిటీలో ఉంటూ, పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు.

ముందంజ మార్చు

ఈ పాఠశాల విద్యార్థులు విద్యలోనూ క్రీడలలోనూ ముందంజలో ఉన్నారు. గత ఏడు సంచత్సరాలుగా 10వ తరగతి పరీక్షలలో 80% ఉత్తీర్ణత సాధించుచుండగా, ఈ సంవత్సరం 94.8% ఉత్తీర్ణత సాధించారు. కంచర్ల రామారావు గారి కుమారులు, ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులందించుచున్నారు. వీరు 1994-95 సంవత్సరంలో విద్యార్థులకు స్వచ్ఛమైన శుద్ధినీరందించుటకై, ఒక ఆర్.వో.ప్లాంటును వితరణ చేసారు. ఈ రకంగా ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెంది, సౌకర్యాల పరంగా నేడు జిల్లాలోనే రెండవ స్థానానికి చేరుకున్నది. ప్రభుత్వ పాఠశాలలో వసతులు కరువనే భావనను పటాపంచలు చేయుచూ, ఇక్కడ సకల వసతులతో నాణ్యమైన విద్యనందించడం ప్రశంసనీయం.

మూలాలు మార్చు

ఆధారం:- ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-29; 23వపేజీ.