పామర్రు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామం

పామర్రు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం.

పామర్రు
—  రెవిన్యూ గ్రామం  —
పామర్రు is located in Andhra Pradesh
పామర్రు
పామర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′23″N 80°57′40″E / 16.322985°N 80.961208°E / 16.322985; 80.961208
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 21,395
 - పురుషులు 10,947
 - స్త్రీలు 11,421
 - గృహాల సంఖ్య 5,736
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్ఝవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

పామఱ్ఱు (స్తూప )జయధ్వజ చరిత్ర ‘’[2]

పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది .. దానిమధ్యలో ఒక తామర కొలను దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ లింగం ఉండేవి. కొలనులో నీరు ఎప్పుడూ ‘’ఏనుగు లోతు’’ ఉండేది .శివలింగం కొలను నీటికి పైన దర్శనమిస్తూ ఉండేది .లింగం పాదం ఎంతలోతులో ఉందొ ఎవరికీ అంతు పట్టేదికాదు .ఈ శివ లింగాన్నిఎప్పుడో నాగులు ప్రతిస్టించాయనీ ,నిత్యాభి షేకానికి ఒకనదిని కూడా అక్కడ కల్పించాయని ,నాగులు తెచ్చిన నదికనుక ‘’నాగులేరు ‘’అనే పేరొచ్చిందని పూర్వులు చెప్పుకొనేవారు .ఆవరణం లేని ఆ శివలింగం మహా ప్రభావ సంపన్నంగా ఉండేది .దివ్యులు వచ్చి అర్చించి వెళ్ళేవారు .ఆశివ లింగం శిరసుపై ఒకపద్మం వికసించి దివ్య పరిమళాలను వెదజల్లేది.ఆ కొలను గట్టున అనేక శాఖలతో విస్తరించిన వట (మర్రి )వృక్షం ఉండేది .ఆ వటవృక్షం తొర్రలో మహా నాగం ఒకటి నివసించేది .అది రోజూ చెట్టుదిగి ఆమహా శివ లింగాన్ని చుట్టుకొని నాగాభరణంగా  భాసించేది

చాలా ఏళ్ళు గడిచాక ఆ చెరువు కొంత పూడిపోయి ,చిన్న గ్రామం ఏర్పడింది .తర్వాత కాలంలో లో మహమ్మదీయ ప్రభుత్వమేర్పడి ,హిందూ దేవాలయ ధ్వంసం చేసి ,విగ్రహాల పీఠభాగం నిక్షిప్తమై ఉన్న  ఉన్న అమూల్య సంపదను  దోచుకోవటం ప్రారంభమైంది .అలాంటి సంక్షోభ కాలం లో ఒకమహమ్మదీయ సైన్యం  ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి శివలింగ వైభవానికి ఆశ్చర్యపోయి ,ఆ శివలింగ మూలాన్ని ధ్వంసం చేస్తే అన్నతమైన ధన కనక వస్తురాసి లభిస్తుందని ఆశపడి ,తటాకం లోకి చేరి చాలాలోతుగా ఉన్న నీటిలో ఉన్న లింగాన్ని  పీకటానికి విశ్వ ప్రయత్నం చేశారు .మానవ సాధ్యం కాదని అర్ధమై ఒక ఏనుగును  దింపి ప్రయత్నించారు.అది తామర తూడు ఆశతో లింగం పైఉన్న తామర పువ్వును పెకలించింది .దాని  మూరెడు పొడవున్న తూడు బయటికి వచ్చింది .అప్పుడు శివలింగం శిరసుపై రంధ్రం ఏర్పడి రక్తం కారటం మొదలు పెట్టింది .కొలను నీరంతా రక్త ప్రవాహమైంది .ఈ హఠాత్సంఘటనకు  తురక సైన్యం భయపడి ,ప్రయత్నాన్ని వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించింది .ఇప్పటికీ ఆ శివలింగం శిరోభాగం లో మూరెడు లోతు గుంట కనిపిస్తుంది .ప్రతి రోజూ శివలింగ౦పై ఉన్న గుంటను   శుభ్రంగా  కడిగి, వస్త్రం జొనిపి ,తుడిచి శుభ్రం చేస్తారు .లేకపోతె రక్తపు వాసన వస్తుంది .

  గ్రామస్తులకు ఈ విశేష శివలింగం పై అశేషభక్తి ఏర్పడి  నిత్యపూజలుచేయటం ప్రారంభించారు .క్రమ౦గా కొలను పూడిపోయి గ్రామం వృద్ధి చెందింది .గ్రామస్తులు ఆ మహా మహిమాన్విత శివ లింగానికి ప్రాకారం ,ఆలయం కట్టించి ‘’సోమేశ్వర స్వామి ‘’గా అర్చిస్తూ నిత్యోత్సవాలు నిర్వహించారు .కొలను గట్టున ఉన్న వటవృక్షం అంటే మర్రి చెట్టు ఇప్పుడు లేదు .చాలాకాలం మర్రి చెట్టు, అందులో పాము ఉండటం  యదార్ధం కనుక ఆగ్రామానికి ‘’పాము మర్రి ‘’అనే పేరొచ్చింది .కొంతకాలానికి ‘’పామ్మర్రి ‘’గా మారి ,చివరికి’’ పామర్రు ‘’అయింది .

‘’పాము వసియించు మఱ్ఱికి  –గ్రామం కుఱగటనుగలుగ గా గాంచి,

జనస్తోమమ్ము ‘’పాము మఱ్ఱన’’-‘’బామఱ్ఱ’’ని యదియ పిదప వాడుక పడియెన్’’

  పామర్రు క్రమాభి వృద్ధి పొంది ,చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా మారి ,1910లో గుడివాడ , తాలూకాలో పామర్రు డివిజన్ అయింది .ఈ డివిజన్ లో 65 గ్రామాలు ఉండేవి .ఈ డివిజన్ డిప్యూటీ తాసిల్దార్ కార్యాలయం పామర్రులో ఉంది

పామర్రులో ‘’జయ స్తంభం ‘’నిర్మించారు .ఈ జయ స్తంభం  బందరు-హైదరాబాద్ రోడ్డులో ,పుల్లేరు కాలువ వంతెన ప్రక్కన నిర్మించారు .పద్నాలుగున్నర అడుగుల ఎత్తులో ,ఆరడుగుల లోతున ఏర్పాటు చేశారు .స్తంభం మధ్యలో నాలుగు పలకలు ,దానికి పైన కిందా ఎనిమిది పలకలుగా ఉండేట్లు నిర్మించారు. శివ- వేంకట కవులు అనే జంటకవులైన ‘’ప్రబంధ పంచానన ‘’బిరుదాంకితులు బ్రహ్మశ్రీ అడవి సాంబశివ రావు పంతులు ,మధ్వశ్రీ నందగిరి వేంకటప్పారావు పంతులు గార్లు రచించిన ‘’పామఱ్ఱు (స్తూప )జయధ్వజ చరిత్ర ‘’

గ్రామంలో జన్మించిన, చెందిన ప్రముఖులుసవరించు

 
ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రి

గ్రామ భౌగోళికంసవరించు

[5] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప పట్టణలుసవరించు

గుడివాడ,పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, పెదపారుపూడి, వుయ్యూరు, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

పామర్రు, వుయ్యూరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 44 కి.మీ

బ్యాంకులుసవరించు

 1. సిండికేట్ బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2015,మే-29వ తేదీనాడు ప్రారంభించారు.
 2. ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08674/253382.
 3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఫోన్ నం. 08674/255234. సెల్=7702113277.
 4. ఆంధ్రా బ్యాంక్.
 5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ.
 6. సప్తగిరి గ్రామీణ బ్యాంక్.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంసవరించు

ఈ కేంద్రానికి ఈ భవనం నిర్మాణం ఉంది.

గ్రామ పంచాయతీసవరించు

 1. కొరముక్కువానిపురం, చాట్లవానిపురం, కంచర్లవానిపురం,చెన్నువానిపురం గ్రామాలు, పామర్రు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాలు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, ఆలయ ప్రతిష్ఠా దినోత్సవం సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.

శ్రీ వల్మీకేశ్వరీ అమ్మవారి (పుట్లమ్మ తల్లి) ఆలయంసవరించు

ఈ ఆలయంలో అమ్మవారి ఏకాదశ వార్షిక మహోత్సవాలు నిర్వహించారు.

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయం స్థానిక వెలమపేటలో, శివాలయం రహదారిపై ఉంది.

శ్రీ కరుమారి అమ్మవారి ఆలయంసవరించు

స్థానిక విజయవాడ రహదారిలోని ఈ ఆలయంలో, శ్రావణపూర్ణిమ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, దేవీహోమం నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

ఈ గ్రామంలో కార్తీకమాసం, ఆదివారంనాడు, భజనలు చేయుచూ, కీర్తనలు పాడుకుంటూ, రాములవారి దీపస్తంభాన్ని గ్రామంలో ఊరేగిస్తారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

స్థానిక రాళ్ళబండివారి చెరువుకట్టపై స్థిరనివాసి అయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు.

శ్రీ రామాలయంసవరించు

ఇది స్థానిక బాపూజీపేటలోని గౌడ రామాలయం.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంసవరించు

స్థానిక గుడివాడ రహదారిలోని సాయినగరులోని ఈ ఆలయ 21వ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని, ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పంచామృతసహిత రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులచే సామూహికంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు.

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం స్థానిక గుడివాడ రహదారిలోని

ఈ వ్యాసమును వికిపుస్తకములకు తరలించాలని ప్రతిపాదించబడినది. వివరాలకు చర్చా పేజీ చూడండి.శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అమృతాభిషేకం, ఆకుపూజ నిర్వహించారు. అనంతరం హరేరామ సంకీర్తన గానంచేసారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా తయారుచేసిన గారెలు, బూరెలదండలతో అలంకరించారు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెఱుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం వివిధ వృత్తుల వ్యాపారస్థులు కలరు

గ్రామ విశేషాలుసవరించు

పామర్రు గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ప్రవాసాంధ్రులొకరు, గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [8]

మండల గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 58,827 - పురుషులు 29,080 - స్త్రీలు 29,747;అక్షరాస్యత (2001) - మొత్తం 73.48% - పురుషులు 78.25% - స్త్రీలు 68.85%

పామర్రు మండలంలోని గ్రామాలుసవరించు

జనాభాసవరించు

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[6]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడ్డాడ 330 1,288 606 682
2. ఐనంపూడి (పామర్రు) 207 817 436 381
3. బల్లిపర్రు 175 654 347 307
4. జుజ్ఝవరం 758 2,725 1,351 1,374
5. కనుమూరు 722 2,716 1,323 1,393
6. కాపవరం 244 918 456 462
7. కొమరవోలు 675 2,585 1,302 1,283
8. కొండిపర్రు 462 1,637 809 828
9. కురుమద్దాలి 956 3,694 1,772 1,922
10. మల్లవరం (పామర్రు మండలం) 81 268 137 131
11. నిమ్మకూరు 381 1,800 949 851
12. నిభానుపూడి 249 932 469 463
13. నిమ్మలూరు 342 1,145 586 559
14. పామర్రు 5,736 22,368 10,947 11,421
15. పసుమర్రు (పామర్రు మండలం) 568 2,093 1,042 1,051
16. పెదమద్దాలి 947 3,544 1,770 1,774
17. పోలవరం 119 427 205 222
18. ప్రాకర్ల 125 474 236 238
19. రాపర్ల(పామర్రు మండలం) 255 1,041 504 537
20. రిమ్మనపూడి 330 1,181 588 593
21. ఉండ్రపూడి 205 804 395 409
22. ఉరుటూరు 326 1,069 531 538
23. యెలకుర్రు 426 1,349 670 679
24. జమ్మిదగ్గ్గుమిల్ల్లి 136 481 235 246
25. జమిగొల్వేపల్లి 797 2,817 1,414 1,403

వనరులుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 2. "పామఱ్ఱు (స్తూప) జయధ్వజ చరిత్ర" (PDF).
 3. "Revolutionary Communist leader Kondapalli Koteswaramma passes away". The Times of India. Retrieved 20 September 2018.
 4. "తొలితరం కమ్యూనిస్ట్ నేత, కొండపల్లి సీతారామయ్య సతీమణి కన్నుమూత". telugu.samayam.com. Retrieved 17 September 2018.
 5. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Pamarru". Archived from the original on 19 మార్చి 2017. Retrieved 29 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
 6. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.
"https://te.wikipedia.org/w/index.php?title=పామర్రు&oldid=3292487" నుండి వెలికితీశారు