కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల
కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల (కందుల శ్రీనివాస రెడ్డి ఇంజనీరింగ్ మెమోరియల్ కళాశాల), భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైయస్ఆర్ జిల్లా లోని ఒక ఇంజనీరింగ్ కళాశాల.[1] ఇది కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని ఎర్రమాసుపల్లె వద్ద ఉంది. ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల - తిరుపతినకు అనుబంధ సంస్థ. మాజీ కడప పార్లమెంటు సభ్యుడు కందుల ఓబుల రెడ్డి కుమారుడు కందుల శ్రీనివాస రెడ్డి, న్యాయవిద్య చదువుతుండగా, కొత్త డిల్లీలోని ఒక స్కూటర్ ప్రమాదంలో మరణించిన సందర్బంగా ఈ కళాశాల వారి జ్ఞాపకార్థం1979 లో స్థాపించబడింది.[2]
వివరాలు
మార్చుఈ కళాశాల రాయలసీమ ప్రాంతంలోని ఫిబ్రవరి, 2007 సంవత్సరంలో [ఆధారం చూపాలి] నిర్మించబడిన మొట్ట మొదటి ఇంజనీరింగ్ కళాశాల. దీని నినాదం చీకటిలో వెలుగులుగా ఉంటుంది. వివిధ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, నిర్వహణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఈ కళాశాల జవహర్‌లాల్ నెహ్రు టెక్నాలజీ విశ్వవిద్యాలయం, అనంతపురంతో అనుబంధంగా ఉంది.
అందించబడే విద్యా కోర్సులు:
- బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
- బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
- బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
- బ్యాచిలర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
- బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్,
- బ్యాచిలర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్.
ఎం.టెక్‌లో
- సివిల్ ఇంజనీరింగ్ (జియోటెక్నికల్ ఇంజనీరింగ్),
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (పవర్ సిస్టమ్స్),
- ఈసిఈ (డిజిటల్ కమ్యూనికేషన్స్)
- ఎమ్‌ఈ (సిఏడి/సిఏఎం).
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ [ఆధారం చూపాలి]
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "KSRM students excel in sports contests". The Hindu. Retrieved 2016-12-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-18. Retrieved 2014-11-12.