కంప్యూటరు నిఘంటువు


2004 లో మొదలైన తెలుగు యూనీకోడ్ అంతర్జాల విప్లవం, అనేక మంది తెలుగు వారిని మరింత దగ్గరగా చేర్చి తెలుగు బ్లాగులు, వివిధ గుంపుల్లో పూర్తిగా తెలుగు లిపితో అంతర్జాల కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు కలిగించింది. ఈ వాతావరణంలో అనేక ఆంగ్ల సాంకేతిక పదాలకు తెలుగు పదాలు మరల ప్రాచుర్యం పొందే వేదికగా ఈ వాతావరణం దోహదం చేసింది. తెలుగు పదాలపై చర్చలు, పాత తెలుగు పదాలు మరింత వాడుకలోకి తీసుకురావడం, కొత్త తెలుగు పదాలు నిష్పాదించడం, లినక్స్,, ఇతర జాలగూళ్ళు తెలుగీకరించడం వంటి పలు కార్యక్రమాలు పురోగతి సాధించాయి. ఆ విధంగా వచ్చిన పదాలలో 1900వరకు ఏరికూర్చి, వివరము, ఆంగ్ల ఉదాహరణ, తెలుగు ఉదాహరణలతో పూర్తి యూనీకోడు ఖతులువాడి ముద్రించిన పుస్తకం ఈ కంప్యూటరు నిఘంటువు. దీనిలో ఖతి, అంతర్జాలం, వేగు ఇలా ప్రఖ్యాతి వహించిన అనేక తెలుగు సాంకేతిక పదాలు చోటుచేసుకున్నాయి.

కంప్యూటరు నిఘంటువు
కృతికర్త: ప్రవీణ్ యిళ్ళ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నిఘంటువు
ప్రచురణ: సురవర.కామ్
విడుదల: 2012
పేజీలు: 96

బయటి లంకెలు

మార్చు
  1. ప్రచురమకర్త జాల పుట http://suravara.com Archived 2013-01-02 at the Wayback Machine
  2. రచయిత బ్లాగు https://web.archive.org/web/20120924224440/http://telugulinux.blogspot.in/
  3. ఈ-పుస్తకం, ప్రింటు పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూషన్ https://web.archive.org/web/20190428112414/http://kinige.com/