కంప్యూటర్ గేమ్స్

కంప్యూటర్ లో ఆడే వీడియో గేమ్.

కంప్యూటర్ గేమ్స్ (Computer Games) అనగా పిల్లలు కంప్యూటర్లో ఆడుకోదగ్గ ఆటలు. గ్రామాల్లో పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన స్థలాలు ఉన్నట్లుగా కాంక్రీట్ జంగిల్స్ అని పిలువబడే మెట్రో నగరాల్లో ఉండవు, అవి ఒకవేళ ఉన్నా అందరికీ చేరువలో ఉండవు. కనుక నగరాల్లో ఉండే పిల్లలకు కంప్యూటర్ గేములే కాలక్షేపం. ఇటీవల మెట్రో నగరాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ షాపింగ్ మాల్స్ లలో పిల్లలకు ప్రత్యేకంగా కంప్యూటర్ గేమ్ ఫ్లోర్లు స్థాపించబడుచున్నాయి.

కంప్యూటర్ గేమింగ్ సెట్ అప్

గేముల్లో రకాలు మార్చు

కంప్యూటర్ గేములను చాలా రకాలుగా విభజించవచ్చు. అవి ఆన్ లైన్ గేమ్స్ (Online Games), మొబైల్ గేమ్స్ (Mobile Games), పి.సి గేమ్స్ (P.C Games), ప్లె స్టేషన్ (Play Station), ఎక్స్ బాక్స్ గేమ్స్ (X-box Games). ఈ గేములను ప్రపంచవ్యాప్తంగా చాలా గేమింగ్ కంపెనీలు తయారుచేస్తూవుంటాయి.

ఆన్ లైన్ గేమ్స్: ఆన్ లైన్ ఆటలను ప్రధానంగా ఫ్లాష్ అనే సాఫ్టువేర్ తో రూపొందిస్తారు. ఆన్ లైన్ ఆటలను ప్రధానంగా ఫ్లాష్ అనే సాఫ్టువేర్ తో రూపొందిస్తారు. అందువలన వీటిని ఫ్లాష్ గేమ్స్ అని కూడా అంటుంటారు. కొన్ని ఆన్ లైన్ గేముల్లో 3డి గేమ్స్ కూడా ఉంటాయి. ఈ గేమ్స్ ఆడుకోవాలంటే ఇంట్లో ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. వీటిలో యాక్షన్, పజిల్, రేసింగ్, కార్డ్స్, షూటింగ్, అడ్వెంచర్, ఆర్కేడ్, ఎడ్యుకేషనల్, ఫన్, వయోలెన్స్, రొమాన్స్, సెక్స్, న్యూడ్ వంటి విభాగాలు ఉంటాయి. ఆన్ లైన్ గేములను నేడు చాలా గేమింగ్ పొర్టల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ కు చెందిన 7సీస్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ వారు రూపొందించిన www.onlinerealgames.com అనే గేమింగ్ పోర్టల్ లో ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి.

1. పజిల్ గేమ్స్ అనగా ఏదైనా చిక్కుముడి విప్పడం లేదా ఒక సమస్యకు పరిషారం కనుక్కోవడం ధేయంగా సాగేవి. ఉదాహరణకు సుడోకు, మహ్ జాంగ్, చెస్, వర్డిల్ వంటివి

2. అడ్వెంచర్ గేమ్స్ అనగా ఒక కార్యాన్ని సాధించడం కోసం ఒక హీరో దిగ్విజయంగా లెవెల్స్ దాటుతూ గమ్యానికి చేరడమే ధ్యేయంగా సాగేవి.

3. రేసింగ్ గేమ్స్ అనగా ఒక వాహనం లేదా ఒక జంతువు మిగిలిన వాహనాన్ని లేదా జంతువులను దాటుకొని గమ్యాన్ని చేరడమే ధ్యేయంగా సాగేవి.

4. ఆర్కేడ్ గేమ్స్ అనగా సాధ్యమైనంత ఎక్కువ పాయింట్లు గెలుపొందడమే ధ్యేయంగా సాగేవి.

5. యాక్షన్ గేమ్స్ అనగా ఒక హీరో ప్రతి లెవెల్ లోనూ శత్రువులను ఓడించడమే ధ్యేయంగా సాగేవి.

6. షూటింగ్ గేమ్స్ అనగా తుపాకీతో గాని, బాణాలతో గాని, మరి ఏ ఇతర ఆయుధాలతో గాని ప్రతి లెవెల్ లోనూ గమ్యాన్ని షూట్ చేయడమే ధ్యేయంగా సాగేవి.

7. కార్డు గేమ్స్ పేక ముక్కలకు సంబంధిచినవి.

 
టొర్నమెంట్(శాలిటైర్)

8. ఎడ్యుకేషనల్ గేమ్స్ అనగా విద్యకు, విజ్ఞానమునకు చెందినవి.

9. సిట్యుయేషనల్ గేమ్స్ అనగా బయట ప్రపంచంలో జరిగే వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని సందర్భాన్ని బట్టి తయారుచేయబడిన గేమ్స్.

10. ఫెస్టివల్ గేమ్స్ అనగా జాతీయ/ప్రాంతీయ పండుగలను ఆధారంగా తీసుకొని తయారుచేయబడినవి.

వీటిలో సింగిల్ ప్లేయర్ / మల్టీ ప్లేయర్ / మల్టీలింగ్వల్ గేమ్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఎక్కువశాతం ఆన్ లై గేమ్స్ పోర్టల్స్ ఉచితంగా రిజిస్ట్రేషన్ ఆఫర్ చేస్తాయి. యూజర్స్ ఆ రిజిస్ట్రేషన్ ఫారములను పూర్తి చేసి పోర్టల్స్ లోకి ప్రవేశించి గేములను ఆడుకోవచ్చు. కొన్ని గేమింగ్ పోర్టల్స్ యూజర్లు ఉచితంగా గేములను డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. నేడు వందల కొలదీ గేమింగు సైట్లు అంతర్జాలంలో నెలకొనివున్నాయి.

పి.సి గేమ్స్: ఇవి ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా ఆడుకోదగ్గ గేమ్స్. ఆన్ లైన్ గేములవలే పి.సి గేముల్లో కూడా యాక్షన్, పజిల్, రేసింగ్, కార్డ్స్, షూటింగ్, అడ్వెంచర్, ఆర్కేడ్, ఎడ్యుకేషనల్, ఫన్, వయోలెన్స్, రొమాన్స్, సెక్స్, న్యూడ్ వంటి విభాగాలు ఉంటాయి. అయితే ఈ గేములు ఆడుకోవాలంటే కంప్యూటర్ చాలా మంచి కాంఫిగరేషన్ ఉన్నదైయుండాలి. గ్రాఫిక్ కార్డు, ఎ.యం.డి ప్రాసెసర్, విండొస్ ఆపరేటిన్ సిస్టం ఉండాలి. పి.సి గేములు సాధారణంగా నగరాల్లోని ప్రధాన మార్కెట్లలో సి.డి ల రూపంలో దొరుకుతాయి. కొన్ని పి.సి గేములు ఇంటర్నెట్ లో ఉచితంగానే లభ్యమవుతాయి.

మొబైల్ గేమ్స్: ఈ గేములు మొబైల్ లో ఆడుకునేవి. మొబైల్ గేములు ప్రధానంగా ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోదగినవి, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసుకొనదగినవిగా ఉంటాయి. ఉదాహరణకు 7సీస్ ఎంటర్టైన్మెంట్ వారి www.mobizill.com అను పోర్టల్ ఎన్నో ఉచిత మొబైల్ గేములను, క్రెడిట్ కార్డు ద్వారా కొనదగిన (ప్రీమియం) మొబైల్ గేములను ఆఫర్ చేస్తోంది. కొన్ని మోబైల్ కంపెనీ వారు తాము తయారు చేసిన మొబైల్స్ లోనే కొన్ని గేములను ఉచితంగా ఆఫర్ చేస్తారు. మొబైల్ గేములు సాధారణంగా పి.సి గేములతో పోలిస్తే అతి తక్కువ ధరలోనే లభిస్తాయి. వీటిలో కూడా యాక్షన్, పజిల్, రేసింగ్, కార్డ్స్, షూటింగ్, అడ్వెంచర్, ఆర్కేడ్, ఎడ్యుకేషనల్, ఫన్, వయోలెన్స్, రొమాన్స్, సెక్స్, న్యూడ్ వంటి విభాగాలు ఉంటాయి.

కంప్యూటర్ గేమ్స్ తయారీ విధానం మార్చు

ముందుగా గేమ్ రైటర్స్ ఒక కాన్సెప్ట్ ని తయారు చేస్తారు. ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా బొమ్మలు ఫొటోషాప్ (Photoshop) సాఫ్టు వేర్ (Software) లో డిజైన్ చేస్తారు, లేదా తెల్ల కాగితంపై బొమ్మలు గీస్తారు. వీటిని ఫ్లాష్ (Flash) అనే 2డి సాఫ్టు వేర్ లో ఇంపోర్ట్ చేసుకొని ఆ బొమ్మలను ట్రేస్ చేస్తారు, వాటికి యానిమేషన్ అప్లై చేస్తారు. వీటికి సంబంధించి గేమ్ కాన్సెప్ట్ బట్టి ప్రోగ్రామర్లు ఫ్లాష్ సాఫ్టువేర్ ఉపయోగించి యాక్షన్ స్క్రిప్ట్ వ్రాస్తారు. ఈ స్క్రిప్ట్ తో కీబొర్డు కీలను లేదా మౌజ్ ను బొమ్మల యానిమేషన్ తో అనుసంధానం చేస్తారు. మ్యూజిక్ డిపార్ట్మెంటు వారు మ్యూజిక్ సాఫ్టు వేర్లను ఉపయోగించి ఆ గేమ్ కి తగిన రీతిలో మ్యూజిక్ అందిస్తారు. ఇది పూర్తయిన తర్వాత గేము పనితీరును పరిక్షిస్తారు. ఆ తర్వాత గేమును డాట్ నెట్ (Dot Net లేదా PHP - వెబ్సైట్ ప్రోగ్రామర్లు) వారిచే పోర్టల్ లోకి అప్లోడ్ చేస్తారు. చిన్న చిన్న కంపెనీలు అంతర్జాలంలో కొన్ని ఉచిత గేములను వాటి మూల స్ర్క్రిప్టుల (Source Script) తో సహా డౌన్లోడ్ చేసుకొని, ఆ మూల స్క్రిప్టులకు కొద్దిపాటి మార్పులు చేసి క్రొత్త గేములను తయారు చేస్తాయి.

3డి పి.సి / ఎక్స్ బాక్స్ గేములను ప్రధానంగా మాయా సాఫ్టువేరును ఉపయోగించి రూపొందిస్తారు. మాయా సాఫ్టువేర్ లో మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్, యానిమేషన్, డైనమిక్స్, రెండరింగ్ అను విభాగలుంటాయి. ముందుగా గేమ్ రైటర్స్ ఒక కాన్సెప్ట్ ని తయారు చేస్తారు. మోడలింగ్ ఆర్టిస్టులు కథకు కావాల్సిన ప్రకారం తెల్ల కాగితాల పై బొమ్మలు వేసి వాటిని కంప్యూటర్లోకి స్కాన్ చేస్తారు. ఆ బొమ్మలను ఇంపోర్టు చేసుకొని వాటి ప్రకారం బొమ్మలను మోడల్ చేస్తారు. టెక్స్చరింగ్ ఆర్టిస్టులు ఆ మోడల్స్ కు ఫొటోషాప్ సాఫ్టువేరు ఉపయోగించి మాయా లో టెక్సరింగ్ (Texturing) అప్లై చేస్తారు. అలాగే బ్యాక్ గ్రౌండ్లు కూడా తయారు చేస్తారు. ఇవన్నీ మోడలింగ్ & టెక్సరింగ్ ఆర్టిస్టులు చేస్తారు. మోడలింగ్ & టెక్సరింగ్ (Modeling & Texturing) నిపుణులు తయారు చేసిన బొమ్మలకు రిగ్గింగ్ & యానిమేషన్ (Rigging & Animation) నిపుణులు బోన్ సెట్టింగ్ చేసి యానిమేషన్ అప్లై చేస్తారు. డైనమిక్స్ & రెండరింగ్ (Dynamics & Rendering) ఆర్టిస్టులు - చేసిన ఫైలుకు స్పెషల్ ఎఫెక్టులు కలుపుతారు. మ్యూజిక్ స్పెషలిస్టులు ఫ్రూటీ లూప్స్ (Frooty loops) వంటి సాఫ్టువేర్లను ఉపయోగించి మ్యూజిక్ కలుపుతారు. ఫ్యూజన్ (Fusion), ఆఫ్టర్ ఎఫెక్ట్స్ (After Effects) వంటి సాఫ్టువేర్ల సాయంతో విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు తయారుచేయబడిన యానిమేటెడ్ ఫైలుకు విజువల్ ఎఫెక్టులు అందిస్తారు.

గేమ్ రైటర్స్ డైలాగులతో కూడిన స్క్రీన్ ప్లే, మరియూ లిప్- సింక్ ఫోనిటిక్స్ (Lip-sync Phonetics) వ్రాస్తారు. డైలాగులను డబ్బింగ్ ఆర్టిస్టుల సాయంతో సౌండ్ డిపార్టుమెంటు వారు రికార్డు చేస్తారు. రికార్డు చేయబడిన మాటలను యానిమేషన్ ఫైలులోకి పంపిస్తారు. వ్రాయబడిన డైలాగ్ ఫోనిటిక్స్ బట్టి పెదవులకు యానిమేషన్ అప్లై చేస్తారు. అలా తయారుచేయబడిన ఫైలు గేమ్ ఇంజన్ ప్రోగ్రామర్ల (ఇంజనీర్లు) వద్దకు వెళ్తుంది. వారు ప్రోగ్రామింగుతో కీబోర్డు లేక మౌజ్ వంటి కంప్యూటర్ పరికరాలను పాత్రల యానిమేషన్ తో అనుసంధానం చేస్తారు. స్కోరు, బోనస్ పాయింట్లకు సంబంధించి కూడా ప్రోగ్రామింగ్ వ్రాసి ఆఫైలుకు అనుసంధానం చేస్తారు. తర్వాత గేమ్ రైటర్ యూజర్ హెల్ప్ టెక్స్టు (User help text) ఇస్తాడు. చివరిలో గేము టెస్టు కు వెళ్ళి, అన్నీ సరిగా ఉంటే మార్కెట్టులో విడుదల చేయబడుతుంది. కొద్దిపాటి సాంకేతిక మార్పులతో మొబైల్ గేముల తయారీ కూడా సుమారు ఇలాగే ఉంటుంది.

గేమింగ్ నిపుణులు మార్చు

ఒక గేమ్ రూపొందించడం అనేది ఏ ఒక్కరివల్లనో అయ్యేది కాదు. అది ఒక పెద్ద టీం వర్క్. గేమింగ్ కంపెనీలు ఈ క్రింది రకాలైన నిపుణులకు అవకాశం కల్పిస్తుంటారు.

• కంటెంట్ / స్క్రిప్ట్ రైటర్స్: వీరికి కంప్యూటర్ గేమ్స్ పై అవగాహన-ఆసక్తి ఉండి, ఆంగ్ల భాష లో మాస్టర్స్ డిగ్రీ ఉండి, కథలు, మాటలు, క్రియేటివ్ కంటెంట్ వ్రాసే సామర్ధ్యం కలిగియుండాలి.

• కాన్సెప్ట్ ఆర్టిస్టులు: వీరికి చిత్రకళలో మంచి పట్టు ఉండి, స్టొరీబోర్డింగ్, ఫొటోషాప్ సాఫ్టు వేర్ పై అవగాహన కలిగియుండాలి.

• మోడలర్స్: వీరికి ఫొటోషాప్ పై అవగాహన కలియుండి, మాయా సాఫ్టు వేర్ లో బొమ్మలను చక్కగా డిజైన్ చేయగలిగే సామర్ధ్యం ఉండాలి.

• టెక్స్చర్ ఆర్టిస్టులు: ఫొటోషాప్ పై అవగాహన కలియుండి, మోడలర్స్ తయారుచేసిన బొమ్మలకు మాయా సాఫ్టు వేర్ లో రంగులు అప్లై చేసే సామర్ధ్యం ఉండాలి.

• రిగ్గింగ్ & యానిమేషన్ ఆర్టిస్టులు: వీరికి మోడలర్స్ తయారుచేసిన బొమ్మలకు మాయా లో బోన్ సెటప్ చేసి, యానిమేషన్ అప్లై చేయగల సత్తా ఉండాలి.

• డైనమిక్స్ ఆర్టిస్టులు: వీరు భౌతిక శాస్త్రంలో డైనమిక్స్ పైన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పైన అవగాహన ఉండి, మాయాలో స్పెషల్ ఎఫెక్ట్స్ (అగ్ని, నీరు, దుమ్ము,వినాశనం, చెట్లు ఊగడం వంటివి ) సృష్టించగలగాలి.

• రెండరింగ్ ఆర్టిస్టులు: వీరు ప్రధానంగా ప్రతి ఫ్రేం లోను లైటింగ్ ఎరేంజ్ మెంట్ చెసి వాటన్నిటినీ జతచేయగలగాలి.

• విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్టులు: పైవారందరూ తయారు చేసిన ఫైలులోని విజువల్ ఎఫెక్ట్స్ లోని లోటుపాట్లను దిద్ది, చక్కటి ఔట్ పుట్ వచ్చేలా వీరు చేయగలగాలి.

• ఫ్లాష్ యాక్షన్ స్క్రిప్ట్ ప్రోగ్రామర్లు: వీరు జావా ప్రోగ్రామింగ్ పై అవగాహన ఉండి గేమ్ కాన్సెప్ట్ బట్టి ఫ్లాష్ సాఫ్టు వేర్ లో స్క్రిప్టు వ్రాసి కీబోర్డు, మౌజ్ తదితర కంప్యూటర్ పరకరాలను పాత్రల యానిమేషన్ తో అనుసంధానం చేయాగలిగేలా ఉండాలి.

• గేమ్ ఇంజన్ ప్రోగ్రామర్లు: వీరు సి++ ప్రోగ్రామింగ్ అవగాహన ఉండి, అన్ రియల్ డవలప్మెంట్ కిట్ (Unreal Development Kit), యూనిటీ 3డి (Unity 3D) వంటి గేమ్ ఇంజన్ సాఫ్టువేర్లను ఉపయోగించి గేమ్ కు సంబంధించిన లెవెల్స్, కంట్రోల్స్, స్కోర్స్ సిస్టం వగైరా తయారుచేయగలగాలి.

• మొబైల్ గేమ్ ప్రోగ్రామర్లు: వీరు యాండ్రాయిడ్, జె2యం.ఇ వంటి మొబైల్ గేమ్ ప్రోగ్రామింగ్ వ్రాయగలిగియుండాలి.

కంప్యూటర్ గేమ్స్ ఆడటం వలన ఉపయోగాలు మార్చు

పరిమితంగా కంప్యూటర్ గేమ్స్ ను ఆడటం వల్ల పిల్లల్లో మేధా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది, కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది.

గేమ్స్ విషయంలో పాటించవలసిన జాగ్రత్తలు మార్చు

అంతర్జాలం (Internet)లో కేవలం పిల్లలు మాత్రమే ఆడుకునే గేములే కాకుండా కొన్ని గేములు పెద్దలు మాత్రమే ఆడుకోదగినవిగా ఉంటాయి. వాటిలో వయోలెన్స్, సెక్స్, రొమాన్స్, ఎబ్యూజివ్, హార్రర్ వంటి విషయాలు ఉండవచ్చు. పిల్లలు వాటిజోలికి వెళితే అవి వారిని మానసికంగా చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి కనీసం 18 ఏళ్ళ వయసు వచ్చే వరకూ అటువంటి పోర్టల్స్ జోలికి వెళ్ళకుండా నిరోధించాలి. సున్నిత స్వభావం కలిగిన పిల్లలు గేమ్స్ ఆడి ఓడిపోతే వారు మానసికంగా దెబ్బతింటారు. పిల్లలు తెలిసీ తెలియక కొన్ని లింకులు క్లిక్ చేయడం వల్ల వైరస్ (Virus) అనే ప్రోగ్రాములు కంప్యూటర్ లోకి చేరతాయి ఫలితంగా కంప్యూటర్ పాడవుతుంది. పిల్లలు కంప్యూటర్ వద్ద గంటల కొద్దీ అదే పనిగా కూర్చున్నా జీవితంలో చాలా విలువైన సమయం పోవడమే కాక కంటిచూపు కూడా మందగిస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు తమ ఇంటి అడ్రసును, పోన్ నెంబర్లు వంటి సమాచారాన్ని గేమ్ పోర్టల్స్ కి ఇచ్చిన యొడల ఆ సమాచారము అపరిచితులకు, మోసగాళ్ళకు, హైటెక్ నేరగాళ్ళకు, తీవ్రవాదులకు చేరే అవకాశం ఉన్నది. వైద్యపరంగా మూర్చ వ్యాధి (Epilepsy) లక్షణాలు ఉన్నవారు కంప్యూటర్ గేమ్స్ ఆడటం మంచిది కాదు.

ఇతర విషయాలు మార్చు

గేమింగ్ ఫీల్డులో కొద్దిపాటి సైన్స్ డిగ్రీ, క్రియేటివిటీ ఉండి, ఫొటోషాప్, మాయా, ఫ్లాష్, స్పెషల్ ఎఫెక్ట్ సాఫ్టువేర్స్, మ్యూజిక్ సాఫ్టువేర్స్, గేమ్ ఇంజన్ (Game Engine) ప్రోగ్రామింగ్ నేర్చుకున్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఈ సాఫ్టువేర్లలో శిక్షణ ఇచ్చే సంస్థలు ప్రధానంగా మెట్రోపొలిటాన్ నగరాల్లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లో అమీర్ పేట అత్యధిక సాఫ్టువేర్ ట్రైనింగు సెంటర్లు ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధికెక్కినది. రైటర్స్ కు ఇండిపెండెంట్ గేమింగ్ కంపెనీల్లో తప్ప ఔట్సోర్సింగ్ గేమ్ కంపెనీల్లో అంతగా అవకాశం ఉండదు. ఐటి ఉద్యోగస్తుల తర్వాత అధిక జీతాలు పొందేవారు యానిమేషన్ అండ్ గేమింగ్ ఫీల్డువారే. కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు మెట్రోపొలిటాన్ నగరాల్లో గేమింగ్ డవలప్మెంట్ బిజినెస్ ఎంతో మేలు చేస్తుంది, వేలాదిమందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. భారత దేశంలో స్వతంత్ర గేమింగ్ డవలప్మెంట్ కంపెనీలు ఇంకా అభివృద్ధిచెందాల్సివుంది. సినిమా రంగం వలే గేమింగ్ రంగం కూడా వినోద రంగానికి చెందినదే. కనుక భారత ప్రభుత్వం సినిమా రంగానికి నిధులు కేటాయించినట్టే గేమింగు రంగానికి కూడా నిధులు కేటాయించాల్సివున్నది.

కొన్ని గేమింగ్ పోర్టల్స్ మార్చు