కగుర సుజు అనేవి కగుర నృత్యంలో వాడే పన్నెండు గంటలతో కూడిన పరికరం.[1][2] దీనిలో, ఈ గంటలు మూడు ఆంతరాలలో ఇత్తడి తీగతో ఒక చేతి కర్రకు మధ్యగా, రెండు గంటలు పై అంతరంలో, నాలుగు మధ్య అంతరంలో, మిగతా ఆరు క్రింది అంతరంలో వేలాడేలా చుట్టి ఉంటాయి. గంటల ఆకారం ఒగాటమా చెట్టు (మిచెలియా కంప్రెసా) పండ్ల ప్రేరణ తో రూపొందించినట్టుగా ఉంటాయి.

17th century Suzu from Miwa, Nara Prefecture, Japan, at the Metropolitan Museum of Art
17వ శతాబ్దపు కగురా సుజు మివా, నారా ప్రిఫెక్చర్, జపాన్, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఉంది.
తన కుడి చేతిలో సుజు గంటలతో షింటో పూజారిణి
కగుర సుజు ప్రదర్శిస్తున్న ఇద్దరు మికో లు.

సుజు అనే పదం సాధారణంగా చిన్న గంటలను సూచిస్తుంది.కానీ, అది జపాన్ కి చెందిన షింటో సాంప్రదాయపు రెండు పరికరాలను సూచిస్తుంది:[3]

  1. ఒక పెద్ద క్రోటల్ బెల్ ఆకారంలో మువ్వ (స్లిఘ్ బెల్) లాగా, ఒక వైపు చీలిక ఉంటుంది.
  2. చేతిలో పట్టుకునే కర్రకి మూడు స్థాయిలలో ఇత్తడి తీగతో చుట్టిన మువ్వల పరికరం.

పెద్ద మువ్వ గంటని షింటో మందిరం ముందు ఉన్న దూలానికి కట్టి, దానికి మోగించటానికి వీలుగా ఒక రిబ్బన్ లాంటి వస్త్రం ఆరాధకుడికి అందుబాటులోఉండేలా కడతారు. ఇక చిన్న సుజు ఒక చేతి కర్రపై కట్టిన మువ్వాలతో ఉంతుంది. కగురా నృత్యాల ప్రదర్శనల సమయంలో సాంప్రదాయ వస్త్రాలు, తెల్లటి పొడి పూసిన ముఖాలు హీయాన్-కాలపు అలంకారపు తలకట్టుతో (కోఫియర్‌) ఉన్న మందిర పరిచారికలు (మికో ) లు చేతిలో పట్టుకుంటారు.

కగుర (神楽, "దైవ వినోదం ") అనేది షింటోకి చెందిన వాయిద్య సంగీతం, గీతాలు, నృత్యలతో కూడిన వినోదం. ఇది దైవ మందిరాల్లోనూ, రాజ దర్బారుల్లోనూ ప్రదర్శిస్తుంటారు. ఇది సాంప్రదాయిక ప్రదర్శనగా, 773 నాటికే రాజ దర్బారు ప్రదర్శనల జాబితాలోకి చేరింది. ఈ చిన్న గంటలు, పురాతన ఆచార ఉపకరణాలుగా, జనపదాలలో, ఉత్సవ ప్రదర్శనలలో గుది గుచ్చిన గుత్తులుగా వాడుకలో ఉన్నాయి.

ప్రస్తావనలు మార్చు

  1. 1988, 国語大辞典(新装版) (Kokugo Dai Jiten, Revised Edition) (in Japanese), Tōkyō: Shogakukan
  2. 2006, 大辞林 (Daijirin), Third Edition (in Japanese), Tōkyō: Sanseidō, ISBN 4-385-13905-9
  3. "Suzu". The Metropolitan Museum of Art. Retrieved 19 February 2016.

మూస:Traditional Japanese musical instrumentsమూస:Shinto shrine