షింటో సంప్రదాయంలో, మికో ఒక పుణ్య క్షేత్ర కన్య [1] [2] లేదా అనుబంధ పూజారిణి. [3] మికోలను ఒకప్పుడు మంత్రగత్తెలు(shamans)గా [4] చూసేవారు.కానీ, నేడు ఆధునిక జపనీస్ సంస్కృతిలోని పుణ్యక్షేత్రాల రోజువారీ నిర్వహణలో వారు సంస్థాగత మైన [5] పాత్ర పోషిస్తున్నారు. పవిత్ర ప్రక్షాళన [4] చేయడం నుంచి పవిత్రమైన కగుర నృత్యం చేయడం వరకు వారు శిక్షణ పొందుతున్నారు. [6]

మికో కామో నది దగ్గర షింటో వేడుకను నిర్వహిస్తుంది

స్వరూపం

మార్చు
 
మికో లు తెల్లటి కోసోడ్(kosode),ఎరుపు హకమ(hakama) వేషధారణతోనూ, జుట్టుకి తెలుపు, ఎరుపు రంగు రిబ్బన్‌ కట్టి, వేలాడే జడ తోనూ కనిపిస్తారు.

మికోల సంప్రదాయ వస్త్రధారణలో ఒక జత ఎరుపు హకమ(విభజించింన మడతల ప్యాంటు), ఒక తెల్ల కోసోడ్ (పొడవుగా ఉండే కిమోనో కంటే ముందే వాడుకలో ఉంది), ఇంకా జుట్టు కి కొన్ని తెలుపు లేదా ఎరుపు రిబ్బన్లు ధరిస్తారు. షింటోలో తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది. కగుర నృత్యం చేసే సమయంలో వారు ఛిహయ(chihaya) అనే వస్త్రాన్ని కోసోడ్ పైన ధరిస్తారు.

సాంప్రదాయగా మికో లు కొన్ని సాధనాలు ఉపయోగిస్తారు. వాటిలో అజుస యుమి(కటల్పా బాణం) [7] తమగుషి(సకాకి చెట్టు కొమ్మలు ),[8]గెహోబాకో (అతీత శక్తుల పెట్టె. దాంట్లో బొమ్మలు, జంతువులు , మనిషి పుర్రె, షింటో జప మాల [9]ఉంటాయి.)అనేవి ఉంటాయి

మికో లు గంటలు, కొవ్వోత్తులు,గొహాయ్ (gohei), బియ్యపు పాత్రలు లాంటివి కూడా పవిత్ర ప్రక్షాళనా ఉత్సవాలలో వాడతారు.

నిర్వచనం

మార్చు

'మికో' , 'ఫుజో' ("మంత్రగత్తె ","పుణ్యక్షేత్ర కన్య"), [10] లాంటి జపనీస్ పదాలను సాధారణంగా "巫女" [10] '巫' కంజీ ("షమన్"), '女' ("స్త్రీ") అన్న పదాల సంయుక్తంగా వ్రాస్తారు. [10] 'మికో' ని పూర్వం '神子' (అక్షరాలా "కమీ", లేదా "దేవుని " + "బిడ్డ") [10] , '巫子' ("షమన్ బిడ్డ ").[10]అన్న అర్థంలోనే వ్రాసే వారు.

ఈ మికో కి ఉన్న నానార్థ పదాలతో అయోమయం చెందాల్సిన అవసరం లేదు. ఆ ఇతర పదాలలో కొన్ని "యువరాజు", "యువరాణి" లేదా "డ్యూక్". అలాగే, "ఆగస్టు చైల్డ్" ('御子'), "ఇంపీరియల్ చైల్డ్"('皇子'), హిమేమికో అని కూడా ఉచ్ఛరించే "ఇంపీరియల్ డాటర్" ('皇女') అనేవి కూడా ఉన్నాయి. "యువరాజు"( '親王') "రాజు", "యువరాజు" లేదా "డ్యూక్"( '王') అనే ఈ మికో పదాలను సాధారణంగా పూర్వ జాపనీస్ ప్రముఖులైన ప్రిన్స్ కుసకబే వంటి వారికి (నో మికో, నో ఓజి ) (草壁皇子 Kusakabe no Miko లేదా Kusakabe no Ōji ) బిరుద నామాలుగా ఉపయోగించారు.

మికో లు ఒక్కప్పుడు ఆత్మలను ఆధీనం లోకి తీసుకోవటం లేదా టక్యూసెన్(ఆత్మ కు ''మాధ్యమం"(యోరిమషి)గా మారి ఆ కామి లేదా ఆత్మ ల దైవ సంకల్పాన్ని లేదా సందేశాన్ని అందించటం; అలాగే వీరిలో కొందరికి ఆత్మలు కలలో కనిపించి "స్వప్న సందేశాన్ని"(ముకోకు) ఇస్తాయి.[11] ఇలా వృత్తి పరమైన పనులతో తమకు చెందిన పుణ్య క్షేత్రాలకు సేవలందిచే వారు. క్రమేనా వారు ఆ క్షేత్రాలను వదిలి, తమ స్వంతంగా లౌకిక ప్రపంచానికి ఈ సేవలను అందించడం మొదలుపెట్టారు. ఇప్పడు ఈ మికో లు క్షేత్రాలలో నామ మాత్రంగా రిసెప్షనిస్టులుగా ఉంటూ, కగుర నృత్యాలకు పరిమితమై పోయారు. మాధ్యమం గా మారటం లేదా మికో ( లేదా గెకి, మంత్రగాడు) గానే కాకుండా, అప్పుడప్పుడు టక్యూసెన్ కార్యాలలో పాల్గొని సయనివా[12] సేవలను, అంటే ఆత్మ ఆవహించిన వ్యక్తి మాటల అర్థాన్ని అక్కడ ఉన్న ప్రజకు అర్థమయ్యేలా వివరించడం చేస్తారు. కొన్ని సార్లు ఆత్మల సందేశాన్ని అందించే కమిగకారి, టక్యూసెన్[11] లు స్తబ్ధుగా ఉండి పోతే, వారి ఆత్మలను ప్రేరేపిం చటం ద్వారా చేతన్యం తెచ్చి ఆ సందేశాలను రాబట్టుకుంటారు.[11]

మికో లు ఎన్నోపేర్లతో ప్రాచూర్యంలో ఉన్నారు. "పుణ్య క్షేత్రాలకు అనుబంధమున్న మికో" [13] లకు 26 పదాలతోనూ, "పుణ్య క్షేత్రాలతో సంబంధం లేని మికో" [14]లకు 43 పదాలతోనూ, ఫెయిర్ చైల్డ్ జాబితా రూపొందించాడు. ఇవి కాక ఇతరంగా ఇచికో (ichiko (巫子), షమన్ చైల్డ్ ("shaman child"), మార్కెట్/టౌన్ చైల్డ్("market/town child") (巫子)అని, ( అటేజీ (ateji) ( అరువు తెచ్చుకున్న )అర్థాలున్న రెండు పదాలు, "మహిళా మాధ్యమం; అదృష్టవంతుడు",[10] రేబాయ్ (霊媒, అంటే "మధ్యలో వెళ్ళే ఆత్మ, మాధ్యమం")[10] అనే పేర్లు కూడా ప్రాచూర్యంలో ఉన్నాయి.

ఆంగ్లంలో, మికో పదాన్ని సాధారణంగా "పుణ్యక్షేత్రం కన్య " అని అనువదిస్తారు. అయితే తరచుగా మాటల్లో "ఫిమేల్ షమన్" ( షమంకా ) అనే పదబంధాన్నీ,లేదా, "దైవజ్ఞురాలు"("Divineress"లాఫ్కాడియో హెర్న్)అని [15] ఉపయోగిస్తారు.

కొందరు పండితులు  జపనీస్ మికోయిజంకు విరుద్ధంగా లిప్యంతరీకరణ తో ఆడ షమన్లకు ఇతర ఆసియా పదాలను వాడటానికి ఇష్టపడతారు.    ఫెయిర్‌చైల్డ్ వివరించినట్లు:

మంచూరియా, చైనా, కొరియా, జపాన్ నుండి [ర్యుక్యూ దీవులు] వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఈ మహిళలు ముఖ్యమైన పాత్ర పోషించారు. జపాన్‌లో వీరు పూజారిణులుగా, సోది చెప్పేవారిగా, ఇంద్రజాలికులుగా, ప్రవక్తలు, షమన్‌లుగా జానపద మతంలోనూ, అలాగే వ్యవస్థీకృత షింటోయిజంలోనూ ప్రధాన ప్రదర్శకులుగా ప్రముఖంగా నిలిచారు. ఈ స్త్రీలను మికో అని పిలిచేవారు. అందుకే తగిన ఆంగ్ల పదం లేకపోవడంతో దీనిని రచయిత సంక్లిష్టమైన "మికోయిజం"(Mikoism) గా పేర్కొన్నారు. [16]

మికోయిజం

మార్చు

చరిత్ర

మార్చు

మికో సాంప్రదాయాలు జపాన్ లో చరిత్ర పూర్వ జోమోన్ కాలం[1] లోనే ఉండేవి. అప్పుడు ఈ మంత్ర గత్తెలు "సమ్మోహక స్థితి లోకి వెళ్ళి దైవాత్మ సందేశాన్ని" (కామి) వినిపించే వారు , ఈ చర్య పురాతన గ్రీస్ లోని "పైథియా లేదా సిబిల్" ను పోలి ఉంది. [17]

పూర్వపు రికార్డుల్లో మికో పదాన్ని పోలి ఉండే పదం, చైనా పదం హిమికో ఒక్కటే కనిపిస్తుంది. ఇది జపాన్‌కు చెందిన అత్యంత ప్రాచీనమైన చారిత్రక (పురాణం కాదు) ప్రస్తావనగా కనిపిస్తుంది. అయితే, హిమికో అంటే మికో నేనా, అసలు ఆ రోజుల్లోనే మికో ఉందా అనేది పూర్తిగా తెలియదు.

పూర్వం మికో లు ప్రముఖమైన సామాజిక వ్యక్తులు. "పాలక వర్గంతో సంబంధం కలిగి ఉండేవారు". " ఆచారంగా సాగే ఆమె పారవశ్యమైన సమ్మోహన ప్రదర్శనలతో పాటు, ఆమె ఎన్నో ఇతర మతపరమైన విధులను, రాజకీయ విధులను నిర్వహించింది" [18] అని కులీ రాస్తూ, మికో లకు చెందిన ఒక సాంప్రదాయ సిద్ధాంత వాదులు కొందరు, "మికో ఉజు మే దేవత అవతారం" [19]గా భావిస్తారని పేర్కొన్నాడు.

నారా కాలం (710–794) , హీయాన్ కాలం (794–1185)లో ప్రభుత్వ అధికారులు మికో ల పద్ధతులను నియంత్రించడానికి ప్రయత్నించారు. ఫెయిర్‌చైల్డ్ పేర్కొన్నట్లుగా:

780 సా.శ. లోనూ, 807సా.శ. లోనూ పుణ్యక్షేత్రాల అధికార పరిధి కి వెలుపల పారవశ్య ప్రదర్శనలకు వ్యతిరేకంగా అధికారిక ఆంక్షలు ప్రకటించారు. అధికారులు ఈ పారవశ్య ప్రదర్శనలనే కాకుండా, ఇంద్రజాలికులు, పూజారులు, మంత్రగాళ్ళు మొదలైనవారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇది పూర్తి నియంత్రణను పొందేందుకే కాకుండా, దుర్వినియోగాలను కూడా నిర్మూలించడం లక్ష్యంగా, ఆంక్షలు విధించారు. [20]

భూస్వామ్య కామకురా కాలంలో (1185–1333) పోరాడుతున్న షోగున్ రాష్ట్రాల(shōgun) నియంత్రణలో జపాన్‌ ఉన్నప్పుడు:

మికోకు జీవనోపాధిని అందించే పుణ్యక్షేత్రాలు,దేవాలయాలు ఆదాయం లేక దివాళా తీయడంతో ఆమె పేదరికంలోకి జారుకుంది. మతపరమైన కార్యక్రమాలకు దూరమయ్యింది. అలా ఆమె మత ప్రదర్శనలకు మరింత దూరంగా బ్రతుకు తెరువుకు ప్రయాణం సాగించింది. దేశ దిమ్మరిగా మారిన మికోను, అరుకి మికో అని పిలిచే వారు. క్రమంగా ఆమె వ్యభిచార కూపంలోకి జారి పోయింది. అలా ఉచ్ఛ స్థాయిలో ఉన్న మికో స్థానం పితృస్వామ్య, సైనిక సమాజంలో పూర్తిగా దిగజారిపోయింది.[21]

ఎడో కాలంలో (1603–1868), "తూర్పు జపాన్‌లో మహిళా షమన్ ల సంస్థాగత నిర్మాణం, వారు అభ్యసించే కళలు గణనీయమైన మార్పులకు లోనయ్యాయి" అని గ్రోమర్ పేర్కొన్నాడు.[22] ఇక మీజీ కాలంలో (1868-1912) అనేక షమన్ సంప్రదాయ పద్ధతులు నిషేదానికి గురయ్యాయి:

1867 తరువాత రాష్ట్ర షింటో వ్యవస్థకి నిర్దుష్ట రూపం ఇవ్వాలని మీజీ ప్రభుత్వం కోరుకుంది. దానికి జాతీయ స్థాయిలో షమన్-ఇన్-చీఫ్ గా చక్రవర్తి నేతృత్వం వహించాలని భావించింది. అంటే, ఇక బౌద్ధ, జానపద మత సంబంధ విశ్వాసాల నుండి షింటో వేరు కావలసి ఉంటుంది. దాని ఫలితంగా, అధికారిక ప్రసంగాలు మికోల పైనా, ఆ వ్యవస్థ పైనా పదే, పదే ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. [23]

1873లో మతపరమైన వ్యవహారాల శాఖ[24] మికో ల ద్వారా జరిగే అన్నీ ఆధ్యాత్మిక అభ్యాసాలను నిషేధిస్తూ విడుదల చేసిన మికో కిండనేరీ(Miko Kindanrei) అనే శాసనాన్ని, ఇంపీరియల్ సేనలకు విధేయులైన భద్రతా దళాలు అమలు చేశాయి. [24]

షింటో సాంప్రదాయంలో కగుర(kagura) ఒక ఆచార పరమైన నృత్య వేడుక, ఇది "దైవ సందేశాలను తెలియజేసే నృత్యం"గా ప్రారంభమై,  తరువాత 20వ శతాబ్ధి నాటికి మికో-మెయ్(Miko-mai) లేదా మికో-కగుర ( Miko-kagura) అనే ప్రసిద్ధ ఉత్సవ నృత్యంగా రూపాంతరం చెందింది.  . 

సాంప్రదాయ శిక్షణ

మార్చు
 
టోక్యోలోని మీజీ పుణ్యక్షేత్రంలో మికో

షమన్ పదవి ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా దక్కుతుంది. ఒకవేళ అలాంటి అవకాశం లేని పక్షంలో వేరెవరైనా స్వచ్ఛందంగా శిక్షణకు వెళతారు, లేదా గ్రామ పెద్దలు నియమిస్తారు. అయితే అలాంటి వ్యక్తికి కొంత సామర్థ్యం ఉండాలి. ఇలా షమానిజం వైపు ఆకర్షితులయ్యే వారికి సాధారణంగా ఉండే కొన్ని లక్షణాలను వారి సామర్ధ్యంగా పరగణలోకి తీసుకుంటారు. అవి: స్వల్పమైన మానసిక రుగ్మత,భ్రాంతులు, అసాధారణ ప్రవర్తన, మూర్ఛ. ఈ రుగ్మతలను ఇప్పటికీ షమనిజపు ప్రత్యేక అనారోగ్య సూచనలుగా భావిస్తూనే ఉన్నారు. 

షమన్‌గా మారే అమ్మాయి( సాధారణంగా రుతుక్రమం ప్రారంభం అయిన చిన్న వయస్సులో) కుచియోసే మికో(kuchiyose miko)దగ్గర చాలా తీవ్రమైన శిక్షణ పొందవలసి ఉంటుంది. అలా శిక్షణ ఇవ్వటానికి గుర్తింపు పొందిన వ్యక్తి సాధారణంగా కుటుంబ సభ్యురాలు (అత్త వంటిది), లేదా తెగకు చెందిన వ్యక్తి కావచ్చు. వారు తమ శిక్షణలో ఆ అమ్మాయికి, తన మైమరపు స్థితిని అదుపులో ఉంచుకునే మెళకువలను నేర్పిస్తారు. చల్లటి నీటితో కడగడం, క్రమం తప్పని శుద్ధి , సంయమనం,ఉపవాసం ద్వారానూ, మరణం, అనారోగ్యం, రక్తం వంటి సాధారణ నిషేధ ఆచారాలను గమనించడం ద్వారానూ వీటిని నేర్పుతారు. అంతే కాక, ఆమె చనిపోయిన వారి ఆత్మలను ఆవహింప చేసుకుని తాను మాధ్యమంగా ఉండి, ఆత్మలతో ఎలా సంభాషించవచ్చో తెలుసు కుంటుంది. మంత్రాలను పఠించడం, నృత్యం చేయడం ద్వారా ఇది సాధ్యపడ్తుంది. కాబట్టి ఆమెకి, పాటలు, ప్రార్థనలు, మాయ మర్మాలను ఉపయోగించటమే కాక, వాటికి అవసరమైన శబ్దాలను, శ్రావ్యమైన పదాలను నేర్పిస్తారు. వీటికి డోలు, గిలక్కాయల వంటివి తోడవుతాయి.

ఈ ఆచారాలలో అద్దాలు (కామి ని ఆకర్షించడానికి), కత్తులు( కటాన ) కూడా ఉపయోగిస్తారు. కామి కి సంబధించి, స్థానికంగా ఉన్న అనేక పేర్లతో పాటు, వాటి పనితీరు గురించి కూడా ఆమెకు జ్ఞానం అవసరం. చివరగా ఆమె అంతరంగీకులకు(తెగకి చెందిన ఇతర షమన్లు) కు మాత్రమే తెలిసిన రహస్య భాషను నేర్చుకుంటుంది. అదృష్టాన్ని తెలిపే సోది మెలకువలని, మాంత్రిక సూత్రాల రహస్యాలను తెలుసుకుంటుంది. 

ఇలా మూడు నుంచి ఏడు సంవత్సరాల శిక్షణ తర్వాత, ఆ అమ్మాయికి నిజమైన షమన్‌గా మారడానికి ఆచార దీక్షను పొందే అర్హత లభిస్తుంది. ఆమె గురువు, ఇతర పెద్దలు, తోటి షమన్ల సమక్షంలో ఈ ఆధ్యాత్మిక వేడుక జరుగుతుంది. ఆ అమ్మాయి తన మునుపటి జీవితపు ముగింపుకు చిహ్నంగా శవాలపై కప్పే తెల్లటి బట్ట( shroud)ను మసుగేసుకుంటుంది. పెద్దలు జప మంత్రాలను మొదలుపెట్టిన కాసేపటికి ఆ అమ్మాయి లో వణుకుతో పూనకం మొదలవుతుంది. తర్వాత, ఆమె గురువు ఆ అమ్మాయిని ఏ కమి ఆవహించిందో తెలుసు కుంటుంది. ఇక పై తనను పూనిన ఆ కమి కే తన సేవలను అందించాలి. ఆమె సమాధానం చెప్పిన వెంటనే, గురువు ఆమె ముఖంపైకి బియ్యంతో చేసిన కేక్ విసిరి, ఆమెను మూర్ఛపోయేలా చేస్తుంది. [25] పెద్దలు ఆమెను వెచ్చటి మంచం పైకి చేర్చి, నిద్రలేచే వరకు వెచ్చగా ఉంచుతారు. ఈ కఠినపరీక్ష మొత్తం ముగిసి ఆమె మేల్కొన్నప్పుడు, రంగుల వివాహపు దుస్తులను ధరించడానికి, వివాహ సంబంధిత సంప్రదాయపు టోస్ట్ చేయడానికి అనుమతి అభిస్తుంది.  

వివాహ తంతును పోలి ఉండే ఈ వేడుకలో ఇప్పటికీ ఆమె కన్యగానే ఉన్నదని సూచిస్తూ, ఇక ఆమెను తాను సేవ చేయ వలసిన కమికి (తమయోరి హైమ్ అని పిలుస్తారు) వధువును చేస్తారు. ఆమె సమ్మోహక స్థితిలో ఉండగా, కమి ఆమెను తన మందిరానికి రమ్మని అభ్యర్థించాడని చెపుతారు. జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆమె బియ్యం నిండిన కుండను( meshibitsu ), ఒక పాత్రను తనతో తీసుకువెళ్తుంది. కాల దోషం పట్టిన ఒక సాంప్రదాయంలో, కమి కి ప్రాతినిధ్యం వహించే కన్నుషి(kannushi) తో రతిజరిపి , తద్వారా బిడ్డ పుడితే, ఆ బిడ్డను కమి బిడ్డ గా (మికోగమి) పరిగణించేవారు.

కొందరు అమ్మాయిలు లేదా స్త్రీలు, రాత్రి వేళ తిరుగాడే ఆత్మ (travelling spirit) తమ దగ్గరికి వచ్చిందని, ఈ కలియిక వల్ల తమను కమి పూనిందనీ ప్రకటించి, వారు దానికి గుర్తుగా తమ ఇంటి పైకప్పుపై తెల్లటి రెక్కల బాణాన్ని ఉంచుతారు.

సమకాలీన మికో

మార్చు
 
ఇకుటా పుణ్యక్షేత్రంలో మికో

సమకాలీన మికోలు తరచుగా షింటో పుణ్యక్షేత్రాలలో కనిపిస్తారు, అక్కడ వారు పుణ్యక్షేత్ర విధుల్లో సహాయం చేస్తూనో, ఉత్సవ నృత్యాలు చేస్తూనో, లేదా ఒమికుజి(omikuji )లతో అదృష్టాన్ని చెపుతూ, సావనీర్‌లను అమ్ముతూ, ప్రధాన షింటో పూజారి (kannushi)కి సహాయం చేస్తూ కనిపిస్తారు. ఈ సమకాలీన మికో గురించి చెప్తూ, కులీ "పూర్వపు షమానిక్ సోదరీ మణులకు దూరపు చుట్టంలా కనిపించే ఆమె, బహుశా ఒక విశ్వవిద్యాలయ విద్యార్ధిని కావచ్చు. ఎంతో కొంత వేతనంతో తాత్కాలిక సేవలందిస్తుండవచ్చు." అని పేర్కొన్నాడు. [26]

మొట్టమొదట జపనీస్ మహిళా షమన్లను అధ్యయనం చేసిన మానవ జాతి శాస్త్రవేత్త కునియో యనగీతా (1875–1962), వారిని జింజ మికో (jinja miko) షమన్లు, అంటే పుణ్య క్షేత్రాలలో గంటలతో నృత్యం చేస్తూ వేడి నీటి(యుడేట్) ఆచారాలలో పాల్గొనే వారిగా, కుచియోసే మికో, అంటే చని పోయిన వారి ఆత్మలకు మాధ్యమంగా ఉండే షమన్ లుగా, ఇంకా మత ఆరాధన,ప్రార్థనలలో నిమగ్నమై ఉండే (ఉదాహరణకు,టెన్రిక్యో వ్యవస్థాపకుడు నకాయమా మికీ ) [27] కమీ ఉబ (గాడ్ వుమెన్ )లు గా విభజించాడు.

ఇంకొందరు పరిశోధకులు సమకాలీన మీకోలను, వారు పాటించే విభిన్న సంప్రదాయాలు, అభ్యాసాల పరంగా మరింత వర్గీకరించారు. వీరు ఉత్తర, తూర్పు జపాన్ లో కేంద్రీకృతమై ఉన్న అంధ ఇటాకో (blind itako), ఉత్తర, తూర్పు జపాన్ లోని తీవ్ర అంధత్వపు ఒకమిన్(ukambin), ఈశాన్య జపాన్ లోని అంధ వాక లేదా ఒవాక (blind waka or owaka) , ఉత్తర, తూర్పు టోక్యోలోని మోరికో (moriko), కేంద్ర జపాన్ లోని నోనో(nono), వాయువ్య జపాన్ లోని అంధ జటోకక (zatokaka) , ముఖాన్ని వెదురు గడ్డి(bamboo grass) తో తడుతుండే ఈశాన్య టోక్యో లోని సస హటకి (sasa Pataki), ఇంకా కుటుంబ, గ్రామ సంస్థలుగా మికోలని వర్గీకరించారు. [28] మరికొందరు, మికో లేదా ఫుజో లను అంధత్వం ఆధారంగా, ఆత్మలను ఆహ్వానించటంలో నిపుణురాలైన ఒగామియా(ogamiya) లేదా ఆత్మలను రప్పించి వాటికి మాధ్యమంగా ఉండే ఒగామిసమా(ogamisama) గానూ, భవిష్యవాణి చెప్తూ, ప్రార్థనలు చేసే మికో లేదా కమిసమాలుగానూ, వర్గీకరిచారు. [29]

పరిశీలనాత్మక షుగెండో మతంలో, పారవశ్యాన్ని పాటించే మగ పూజారులు తరచుగా మికోలను వివాహం చేసుకుంటారు. [30] పరిశోధకులు అనేక మంది ఈ షమానిక్ మికో ల లక్షణాలు షిన్ శూక్యో(Shinshūkyō)("న్యూ రెలిజియన్స్") కు చెందిన సుక్యో మహికరి, ఓమోటో, షిన్మెయ్ఐషింకెయ్ (Sukyo Mahikari,Ōmoto, Shinmeiaishinkai) లలో గుర్తించారు.[31] [32] [33]

ఇది కూడ చూడు

మార్చు
  • బాబయిలాన్, ఫిలిపినో యానిమిజంలో ఆడ షమన్లు
  • భిక్షుణి
  • బోబోహిజాన్, కడజాన్-డుసున్‌లో ఆడ షమన్లు
    • ఒనారిగమి లో కమించు(Kaminchu)
    • ర్యుక్యుఅన్(Ryukyuan)మతంలో కమించు
    • నోరో (పూజారి)
  • కన్నుషి (Kannushi)
  • కల్పిత మికో జాబితా
  • సన్యాసిని
  • షింటో

గమనికలు

మార్చు

 

ప్రస్తావనలు

మార్చు
  • ఆస్టన్, విలియం జార్జ్. షింటో: దేవతల మార్గం . లాంగ్‌మాన్స్, గ్రీన్ అండ్ Archived 2021-09-22 at the Wayback Machine కో. (1905)
  • బ్లాక్కర్, కార్మెన్. ది కాటల్పా బో: జపాన్‌లో షమానిస్టిక్ అభ్యాసాల అధ్యయనం . లండన్: జార్జ్ అలెన్ & అన్విన్. (1975)
  • ఫెయిర్‌చైల్డ్, విలియం P. "షమానిజం ఇన్ జపాన్" Archived 2021-07-31 at the Wayback Machine, ఫోక్‌లోర్ స్టడీస్ 21:1–122. (1962)
  • ఫోక్‌లోర్ సొసైటీ, ది. ఫోక్లోర్, వాల్యూమ్ 10. గ్రేట్ బ్రిటన్. (1899)
  • గ్రోమర్, గెరాల్డ్. "ఎడో పీరియడ్‌లో తూర్పు జపాన్‌లో ఫిమేల్ షామన్లు" Archived 2021-09-22 at the Wayback Machine, ఎసియన్ ఫోక్‌లోర్ స్టడీస్ 66:27–53. (2007)
  • హార్డాక్రే, హెలెన్. "షిన్మీయాషింకై అండ్ ది స్టడీ ఆఫ్ షమానిజం ఇన్ కాంటెంపరరీ జపనీస్ లైఫ్," ఇన్ రిలిజియన్ ఇన్ జపాన్, ed. PF కోర్నికీ, IJ మెక్‌ముల్లెన్ ద్వారా, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, pp.198–219. (1996)
  • హియర్న్, లఫ్కాడియో. తెలియని జపాన్ యొక్క సంగ్రహావలోకనాలు వాల్యూమ్ 1.(Glimpses of unfamiliar Japan: Volume 1.) : హౌటన్, మిఫ్ఫ్లిన్ అండ్ Archived 2021-09-22 at the Wayback Machine కంపెనీ. (1894)
  • హోరి, ఇచిరో. జపాన్‌లో జానపద మతం: కొనసాగింపు,మార్పు.(Folk Religion in Japan: Continuity and Change.)చికాగో: యూనివర్సిటీ. చికాగో ప్రెస్. (1968)  .
  • కవముర కునిమిత్సు. "ఎ ఫిమేల్ షమన్స్ మైండ్ అండ్ బాడీ, అండ్ పొసెషన్" Archived 2021-09-22 at the Wayback Machine, ఆసియన్ ఫోక్లోర్ స్టడీస్ 62.2:257–289. (2003)
  • కులీ, లిసా. " లొకేటింగ్ ట్రాన్స్‌సెండెన్స్ ఇన్ జపనీస్ మిన్జోకు గీనో: యమబుషి , మికో కగురా ," ఎథ్నోలజీస్ 25.1:191–208. (2003)
  • నార్త్-చైనా హెరాల్డ్ , సుప్రీం కోర్ట్ & కాన్సులర్ గెజిట్, ది: వాల్యూమ్ 79 - నార్త్-చైనా హెరాల్డ్. (1906)
  • రిక్కీ, డానియెల్ జపనీస్ షమానిజం: ట్రాన్స్ ,స్వాధీనం . వాల్యూమ్ ఎడిజియోని (కిండ్ల్ ఎడిషన్, 2012).
  • పికెన్, స్టువర్ట్ DB. షింటో యొక్క A నుండి Z. స్కేర్‌క్రో ప్రెస్. (2006)
  • వాలీ, ఆర్థర్. జపాన్ యొక్క నోహ్ ప్లేస్ . (1921)

బాహ్య లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Groemer, 28.
  2. Aston, 101
  3. North-China herald, 571
  4. 4.0 4.1 Picken, 140.
  5. Groemer, 29.
  6. Hearn, 246
  7. Fairchild, 76
  8. Fairchild, 77.
  9. Fairchild, 78
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 Kokugo Dai Jiten Dictionary, Revised edition, Shogakukan, 1988.
  11. 11.0 11.1 11.2 "Archived copy". Archived from the original on 2011-10-30. Retrieved 2013-06-02.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  12. "Archived copy". Archived from the original on 2015-05-10. Retrieved 2013-06-02.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  13. Fairchild, 119
  14. Fairchild, 120.
  15. Hearn, 202
  16. Fairchild, 57.
  17. Blacker, 104.
  18. Kuly, 199.
  19. Kuly, 198.
  20. Fairchild, 53
  21. Kuly, 199.
  22. Groemer, 46.
  23. Groemer, 44.
  24. 24.0 24.1 "『*%5B%BF%C0%C6%BB %D6%E0%BD%F7%5D』の検索結果 - 耀姫の日記". d.hatena.ne.jp. Archived from the original on 24 April 2018. Retrieved 24 April 2018.
  25. Hori, Ichiro (1968). Folk religion in Japan : continuity and change. Chicago: Univ. of Chicago Press. p. 204. ISBN 0226353346.
  26. Kuly, 21.
  27. Kawamura, 258-259.
  28. Fairchild, 62–85.
  29. Kawamura, 263–264.
  30. Fairchild 1962:55.
  31. Blacker, 140.
  32. Hardacre.
  33. Kuly, 25.
"https://te.wikipedia.org/w/index.php?title=మికో&oldid=3851668" నుండి వెలికితీశారు