ఒక వస్తువులోని బిందువు వద్ద నుండి వెలువడే కాంతికిరణాలు ఉపసరణించే సంబంధిత బిందువు. దీనినే చిత్రబిందువు అని కూడా అంటారు. సిద్ధాంతపరంగా నాభి ఒక బిందువే అయిననూ భౌతికంగా ఇది ఒక ప్రదేశము. దీనినే గందరగోళ వృత్తం (Circle of Confusion) లేదా కళంక వృత్తం (Blur Circle) అని అంటారు. ప్రతిబింబాన్ని ఏర్పరచే కటకాలలోని భ్రాంతుల వలన అసాధారాణ నాభి ఏర్పడుతుంది. భ్రాంతులు లేని ఎడల ఆప్టికల్ వ్యవస్థలో ఉండే సూక్ష్మరంధ్రం యొక్క వివర్తన వలన మాత్రమే ఏర్పడే అతి చిన్న గందరగోళ వృత్తాన్ని Airy disc అని అంటారు. సూక్ష్మరంధ్రపు వ్యాసం పెరిగే కొలదీ భ్రాంతి కూడా పెరుగుతుంది. Airy disc తగ్గుతుంది.

నేత్రం యొక్క దృష్టి సాధారణంగా ఒక వస్తువు లోని బిందువు వద్ద నుండి వెలువడే కిరణాలను రెటీనా పై సంబంధిత బిందువుగా ఏర్పడుతుంది.
పార్శ్వనాభిలో గల ఒక చిత్రము. ఈ చిత్రంలో చాలా భాగము వివిధ స్థాయిలలో నాభి లో లేదు.

ఒక ప్రతిబింబం, లేదా ప్రతిబింబం లోని ఒక బిందువు లేదా ప్రదేశం దృష్టి లో ఉన్నచో వస్తువు నుండి వెలువడుతున్న కాంతి ప్రతిబింబంలో దాదాపుగా ఉపసరణ చెందినది అని చెప్పవచ్చును. ఉపసరణ చెందని కాంతి వలన అది దృష్టి వెలుపల ఉంటుంది. ఈ రెంటి మధ్య భేదం కొన్ని సందర్భాలలో గందరగోళ వృత్తం తో విశ్లేషించటం జరుగుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=కటక_నాభి&oldid=3163713" నుండి వెలికితీశారు