కేంద్రీకరణ, వికేంద్రీకరణ కాంతి కిరణములు

కాంతి ఏ ఋజు మార్గంలో ప్రయాణిస్తుందో ఆ ఋజుమార్గాన్ని చూపే సరళరేఖను కాంతి కిరణము అంటారు. కాబట్టి కాంతి కిరణాన్ని బాణపు గుర్తు కలిగిన సరళ రేఖతో సూచించవచ్చు.అనేక కిరణములు సముహాన్ని కాంతి కిరణ పుంజం అంటారు. ఈ కిరణపుంజం మూడు రకాలుగా ఉంటుంది.

  • సమాంతర కిరణాల సముదాయం
  • కేంద్రీకరణ కిరణాల సముదాయం
  • వికేంద్రీకరణ కిరణాల సముదాయం

సమాంతర కిరణాల సముదాయంసవరించు

కాంతి జనకం నుండి వెలువడు కిరణాలు సమాంతరంగా పోతుంటే వాటిని సమాంతర కిరణ పుంజం అంటారు.

కేంద్రీకరణ కిరణాల సముదాయంసవరించు

కాంతి కిరణాలు ఒక బిందువు వద్దకు కేంద్రీకరింపబడితే వాటిని కేంద్రీకరణ కిరణాల సముదాయం అంటారు. కుంభాకర కటకం నుండి పోయిన సమాంతర కాంతి కిరణాలు ఒక బిందువువద్దకు కేంద్రీకృతమవుతాయి.

వికేంద్రీకరణ కిరణాల సముదాయంసవరించు

కాంతి కిరణాలు ఒక బిందువు నుండి అన్ని దిశల లోనికి ప్రయాణిస్తుంటే వాటిని వికేంద్రీకరణ కిరణాల సముదాయం అంటారు.

చిత్రములుసవరించు

 
కుంభాకార కటకంలో కాంతి కిరణాల కేంద్రీకరణము అయ్యె విధము
 
పుటాకార కటకంలో కాంతి కిరణాల వికేంద్రీకరణం అయ్యే విధము

యివి కూడా చూడండిసవరించు