కడప ప్రభాకర్ రెడ్డి

కలిచెర్ల ప్రభాకర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

కడప ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 - 1994
1999 - 2009
ముందు అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి
తరువాత అనిపిరెడ్డి వెంకటలక్ష్మి దేవమ్మ
నియోజకవర్గం తంబళ్ళపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1945
కలిచెర్ల, పెద్దమండ్యం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2022 జనవరి 24
బెంగళూరు
జాతీయత  భారతదేశం
జీవిత భాగస్వామి ఇందరమ్మ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి 1989లో రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి 1999, 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తంబళ్ళపల్లె నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మరణం మార్చు

కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని సెయింట్‌ జాన్స్‌ ఆస్పత్రిలో చికిత్య పొందుతూ 2022 జనవరి 24న మరణించాడు.[1][2] ఆయన స్వగ్రామం కలిచెర్లలో 26న అంత్యక్రియలు నిర్వహించారు.[3][4]

మూలాలు మార్చు

  1. ETV Bharat News (24 January 2022). "తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి మృతి". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  2. The Hans India (25 January 2022). "Ex-MLA Kalicherla Prabhakar Reddy passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  3. Andhra Jyothy (26 January 2022). "కలిచెర్లకు కన్నీటి వీడ్కోలు". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  4. Andhra Jyothy (26 January 2022). "కలిచెర్లకు నేతల ఘన నివాళి". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.