చిత్తూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా

చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఒక జిల్లా. జిల్లాకేంద్రం చిత్తూరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలలో కలిపారు.

చిత్తూరు జిల్లా
కాణిపాకం దేవాలయం
కాణిపాకం దేవాలయం
Chittoor in Andhra Pradesh (India).svg
నిర్దేశాంకాలు: 13°12′N 79°07′E / 13.2°N 79.12°E / 13.2; 79.12Coordinates: 13°12′N 79°07′E / 13.2°N 79.12°E / 13.2; 79.12
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంరాయలసీమ
ప్రధాన కార్యాలయంచిత్తూరు
విస్తీర్ణం
 • మొత్తం6,855 km2 (2,647 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం18,73,000
 • సాంద్రత270/km2 (710/sq mi)
భాషలు
 • ఆధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
జాలస్థలిchittoor.ap.gov.in/te

కాణిపాకం దేవాలయానికి ప్రసిద్ధి ఈ జిల్లా ధాన్యములు, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు, బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి. Map

చరిత్రసవరించు

చిత్తూరు జిల్లా 1911 ఏప్రిల్ 1 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలీ 1782 డిసెంబరు 6 లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలలో కలిపారు.[1]

భౌగోళిక స్వరూపంసవరించు

ఇది 12°-44’-42″ మరియు 13°-39’-21″ ఉత్తర అక్షాంశాల మధ్య మరియు తూర్పు రేఖాంశాలు 78°-2’-2″ మరియు 79°-41’52″ మధ్య ఉంది. ఇది తూర్పున తిరుపతి జిల్లా, తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన అన్నమయ్య జిల్లా, కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

జిల్లా ప్రధానంగా మైదాన ప్రాంత మండలాలతో కూడి వుంది. చిత్తూరు పట్టణం చుట్టుపక్కల మామిడి తోటలు, చింత తోపులు విస్తారముగా ఉన్నాయి.

నదులుసవరించు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నదులు:

జనాభా లెక్కలుసవరించు

2011 జనగణన ప్రకారం, జిల్లా జనాభా: 18,73,000. జిల్లా జన సాంద్రత 270/చ.కి.మీ (710/చ. మై.) [1]


రవాణా వ్వవస్థసవరించు

పాలనా విభాగాలుసవరించు

భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 4 రెవిన్యూ డివిజన్లుగా, 31 రెవిన్యూ మండలాలుగా విభజించారు.[1] పునర్వ్యవస్థీకరణ తరువాత వెదురుకుప్పం శ్రీరంగరాజపురం మండలాలను నగరి రెవిన్యూ డివిజన్ నుండి చిత్తూరు రెవిన్యూ డివిజన్ కు మార్చారు. [2]

మండలాలుసవరించు

చిత్తూరు జిల్లా మండలాల పటం (Overpass-turbo)


నగరాలు, పట్టణాలుసవరించు

నియోజక వర్గాలుసవరించు

లోక్‌సభ స్థానాలు
 1. చిత్తూరు (పాక్షికం), దీనిలో భాగమైన చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం తిరుపతి జిల్లాలో వుంది.
 2. రాజంపేట (పాక్షికం), దీనిలోని పుంగనూరు శాసనసభ నియోజకవర్గం మాత్రమే చిత్తూరు జిల్లాలో వుంది. మిగతా భాగం అన్నమయ్య జిల్లాలో వుంది.
శాసనసభ స్థానాలు (7)
 1. కుప్పం
 2. గంగాధరనెల్లూరు (SC)
 3. చిత్తూరు
 4. నగరి
 5. పలమనేరు
 6. పుంగనూరు
 7. పూతలపట్టు (SC)

విద్యాసంస్థలుసవరించు

విశ్వనిద్యాలయాలు: ద్రవిడ

ఆర్ధిక స్థితిగతులుసవరించు

వ్యవసాయంసవరించు

వేరుశనగ, మామిడి, చెఱకు పంటలు విశేషంగా పండుతాయి.

పరిశ్రమలుసవరించు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, పాల ఉత్పత్తుల పరిశ్రమలున్నాయి. చిత్తూరు జిల్లాలో 101 కంపనీలు, 21148 కుటీర పరిశ్రమలున్నాయి. అమరరాజా బ్యాటరీ కంపనీ, న్యూట్రిన్ చాక్ లెట్ కంపనీ, లాంకో ఇండస్ట్రీ, స్పాంజ్ ఐరన్, జైన్ ఇరిగేషన్, శ్రీనివాస డిస్టిల్లరీస్ ఈ జిల్లాలోగల ప్రధాన పరిశ్రమలలో కొన్ని. ఇవేకాక, నాలుగు సహకార చక్కెర మిల్లులు, రెండు యాజమాన్య చక్కెర మిల్లులు ఉన్నాయి. బంగారుపాళ్యం మండలం మొగిలిలో భారీ ఆహార పదార్ధాల పార్క్ (మెగా ఫుడ్ ఫార్క్) ఏర్పాటుచేశారు.[3]

సంస్కృతిసవరించు

సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే పశువుల పండుగ జల్లి కట్టు అంటారు.

చారిత్రిక/పర్యాటక ప్రదేశాలుసవరించు

చిత్తూరు జిల్లా ప్రముఖులుసవరించు

ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు.

సాహితీ కారులు
సినీ రంగ ప్రముఖులు
 • చిత్తూరు నాగయ్య- గుంటూరు జిల్లాలో జన్మించాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా పేరొందాడు.
 • రమాప్రభ హాస్యనటి - 1400 దక్షిణభారతదేశ చిత్రాలలో నటించిన 16 17 నటీమణి.
 • దేవిక - అందాల తారగా వెలుగొందిన నటీమణి.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
 2. AP Government (2022-06-29), CHITTOOR DISTRICT - TRANSFER OF SRIRANGARAJAPURAM AND VEDURUKUPPAM MANDALS FROM NAGARI REVENUE DIVISION TO CHITTOOR REVENUE DIVISION - FINAL NOTIFICATION. [G.O.Ms.No.488, Revenue (Lands-IV), 29th June, 2022.]
 3. "Industry Guide". Srini food park. Retrieved 2022-06-24.

బయటి లింకులుసవరించు