కడియాల రామమోహనరాయ్
కడియాల రామమోహనరాయ్ సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, రచయిత.
కడియాల రామమోహనరాయ్ | |
---|---|
జననం | కడియాల రామమోహనరాయ్ 1944 ఏప్రిల్ 11 సిరిపురం, గుంటూరు జిల్లా |
వృత్తి | అధ్యాపకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | విమర్శకుడు, పరిశోధకుడు, రచయిత |
జీవిత భాగస్వామి | రాజ్యలక్ష్మి |
పిల్లలు | భారవి, శ్రీనాథ్ |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1944, ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కడియాల భద్రయ్య, తల్లి కమల. ఇతని చిన్నతనంలోనే తల్లి మరణించింది. ఇతడు తండ్రి, నాయనమ్మ, సోదరిల సంరక్షణలో పెరిగాడు. ఇతని తండ్రి నాస్తికుడు, హేతువాది, సాహిత్యాభిలాషి, కమ్యూనిస్టు పార్టీ అభిమాని. తన తండ్రి ప్రభావం ఇతనిపై పడి హేతువాదం, నాస్తికత్వం, మార్క్సిజం ఇతనికి వొంటబడ్డాయి. ఇతడు గుంటూరు హిందూకళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఎ.(తెలుగు భాషాసాహిత్యాలు) చదివాడు.[1]
రచనలు
మార్చుఇతడు తన 16యేట నుండి రచనలు చేయడం ప్రారంభించాడు. ఇతని విమర్శలు, పుస్తకసమీక్షలు, ఇతర రచనలు ప్రజామత, రాజమార్గం, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి.[1]
ముద్రిత గ్రంథాలు
మార్చు- తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం (సిద్ధాంత గ్రంథం)
- మన తెలుగు నవలలు - నూరు నవలల విశ్లేషణ
- విప్లవవాదం
- 20వ శతాబ్ది తెలుగుకవిత్వం
- గుంటూరు శేషేంద్ర శర్మ
- తెలుగు కవితావికాసం
- ఉత్తరాంధ్ర నవలా వికాసం
- సహృదయ (సాహిత్య వ్యాస సంపుటి)
- కృష్ణశాస్త్రి కవితావైభవం
- పదమూడు ఉత్తమకథలు
- శ్రీశ్రీపై ముఖాముఖీ
- శ్రీశ్రీ రచనల ప్రభావం
- తెలుగు సాహిత్యంలో రైతు జీవితం
- ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్య వికాసం
- వెయ్యేళ్ల తెలుగు పద్య వికాసం - సమగ్ర పరిశోధన
- మన తెలుగు నాటకాలు - నాటికలు
- 2001 - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం
- 2002 - జి.వి.యస్.కళాపీఠం వారి ఉత్తమ విమర్శ పురస్కారం
- 2007 - తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వారి ఉత్తమ విమర్శక పురస్కారం
- 2017 - నవ్యాంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి భాషా పురస్కారం
- 2018 - అద్దేపల్లి రామమోహనరావు కవిత్వ విమర్శ పురస్కారం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 వొరప్రసాద్ (1 April 2018). "నా ప్రాపంచిక, సాహిత్య దృక్పథం - కడియాల రామమోహనరాయ్ (ఇంటర్వ్యూ)" (PDF). సాహిత్య ప్రస్థానం. 17 (4): 18–20. Retrieved 23 January 2020.