కణం 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించాడు. నాగ శౌర్య, సాయిపల్లవి, వెరానికా అరోరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏప్రిల్ 27న విడుదలైంది.[2]

కణం
దర్శకత్వంఎ. ఎల్. విజయ్[1]
రచనఎ. ఎల్. విజయ్
అజయన్ బాల
సత్య (తెలుగు)
నిర్మాతఅల్లిరాజా సుభాస్కరన్
తారాగణంనాగ శౌర్య
సాయిపల్లవి
వెరానికా అరోరా
ఛాయాగ్రహణంనిరవ్ షా
కూర్పుఆంథోనీ
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లునవీన్
విడుదల తేదీ
27 ఏప్రిల్ 2018 (2018-04-27)
సినిమా నిడివి
97 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుతమిళ్
తెలుగు

తులసి (సాయిపల్లవి), కృష్ణ (నాగశౌర్య) ప్రేమికులు. వారి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించి ఐదేళ్ల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తారు. కృష్ణ తులసిల వివాహం అనంతరం కృష్ణ తండ్రి, తులసి తల్లి, మావయ్యలు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. వారి మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఆ మరణాలకు కృష్ణ తులసిలకు ఉన్న సంబంధం ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (26 April 2018). "I love to portray human emotions: A L Vijay" (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
  2. Zee Cinemalu (2018). "రేపే 'కణం' గ్రాండ్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
  3. Zee News Telugu (28 April 2018). ""కణం" సినిమా రివ్యూ". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
  4. Zee News Telugu (25 April 2018). "సినీ నటి సాయి పల్లవితో ఇంటర్వ్యూ". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
  5. Sakshi (23 April 2018). "ఆ రోజు సినిమాలు మానేస్తా". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.

బయటి లింకులు

మార్చు