సాయిపల్లవి
సాయిపల్లవి ఒక సినీ నటి.[5][4] తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది
సాయిపల్లవి | |
---|---|
![]() | |
జననం | [1][2][3] కోటగిరి, తమిళనాడు[4] | 1992 మే 9
విద్య | వైద్య విద్య |
విద్యాసంస్థ | టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియా |
వృత్తి | నటి |
తల్లిదండ్రులు |
|
బంధువులు | పూజ (కవల సోదరి) |
నేపథ్యంసవరించు
సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది.
ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.
సినిమాసవరించు
వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది.[6]
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2015 | ప్రేమమ్ | మలర్ | మలయాళం | తొలి చిత్రం |
2016 | కాళి | అంజలి | మలయాళం | తెలుగులో హేయ్ పిల్లగాడ పేరుతో అనువాదమైంది |
2017 | ఫిదా | భానుమతి | తెలుగు | తొలి తెలుగు చిత్రం
ఆ పేరుతోనే మళయాళంలోకి అనువాదమైంది |
మిడిల్ క్లాస్ అబ్బాయి | పల్లవి / చిన్ని | తెలుగు | ||
2018 | దియా | తమిళం | ద్విభాషాచిత్రం ,తొలి తమిళ చిత్రం | |
కణం | తెలుగు | |||
మారి 2 | తమిళం/తెలుగు | |||
సూర్యా 36 | తమిళం | |||
పడి పడి లేచే మనసు | తెలుగు | |||
2019 | అథిరన్ | నిత్యా | మలయాళం | |
ఎన్ జీ కె | గీతా కుమారి | తమిళం
తెలుగు |
ద్విభాషా చిత్రం | |
2021 | లవ్ స్టోరీ[7] | తెలుగు | ||
విరాట పర్వం | తెలుగు | |||
2021 | శ్యామ్ సింగరాయ్ [8] | రోజి | తెలుగు |
అవార్డులు మరియు నామినేషన్లుసవరించు
సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | Ref. | |
---|---|---|---|---|---|---|
2015 | ఆసియావిజన్ అవార్డులు | నటనలో కొత్త సంచలనం - స్త్రీ | ప్రేమమ్ | విజేత | ||
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | ప్రత్యేక జ్యూరీ అవార్డు | విజేత | ||||
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం | విజేత | ||||
5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం | విజేత | ||||
వనిత ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నూతన నటి - నటి | విజేత | ||||
2017 | ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ | అత్యంత ప్రజాదరణ పొందిన నటి | కలి | విజేత | ||
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి - మలయాళం | నామినేట్ | ||||
6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నటి - మలయాళం | నామినేట్ | ||||
CPC సినీ అవార్డులు | ఉత్తమ నటి | విజేత | ||||
2018 | 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి - తెలుగు | ఫిదా | విజేత | ||
7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నటి - తెలుగు | మూస:Nominated | ||||
2019 | 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి - తమిళం | మారి 2 | మూస:Nominated | ||
2021 | 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | సహాయ పాత్రలో ఉత్తమ నటి | పావ కదైగల్ | నామినేట్ |
మూలాలుసవరించు
- ↑ "Sai Pallavi (Actress)". starsunfolded.com. Retrieved 2 January 2018.
- ↑ "Sai Pallavi From Dancer to Actress". wikibiopic.com. Retrieved 6 September 2019.
- ↑ "Sai Pallavi South Actress". wikifolder.com. Retrieved 2 March 2020.
- ↑ 4.0 4.1 తలారి, విజయ్ కుమార్ (25 March 2018). "నా కోసం అందులో వెతక్కండి". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 26 March 2018. Retrieved 26 March 2018.
- ↑ "మొటిమలుంటే ఏంటంట?". eenadu.net. ఈనాడు. Archived from the original on 31 December 2017. Retrieved 1 January 2018.
- ↑ ఎస్. ఆర్, షాజిని. "MCA Box Office Collections: Nani-Sai Pallavi starrer joins $ 1 M club". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 2 January 2018.
- ↑ "Love Story movie is not just a Usual Drama: Shekhar Kammula". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-23. Retrieved 2021-09-25.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Andhrajyothy (9 May 2021). "శ్యామ్ సింగరాయ్ నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)