కనిపించే సృష్టి అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుల కలయికతో ఏర్పడినదే అని యిప్పటి ఆధునిక శాస్త్రవేత్తల నుంచి సామాన్య మానవుడి వరకు అందరికీ తెలిసినదే. అయితే ఈ పరమాణు రహస్యాన్ని మొట్టమొదటగా క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో వైశేషిక తత్వచింతన ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ప్రాచీన భారతీయ అణు సిద్ధాంత కర్త కణాదుడు.[1] పాశ్చాత్యుడైన్ దెమోక్రటీస్ 2400 సంవత్సరాల క్రితం ఈ పరమాణువునే "ఆటమ్"గా పేర్కొన్నాడు. "ఆటోమస్" (విభజింప వీలుకానిది) అనే గ్రీకు పదం నుండి ఈ ఆటం పుట్టినది. అయితే డెమోక్రటీస్కు నాలుగు శతాబ్దాలకు ముందే ప్రకృతి లోని ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయం అని ప్రతిపాదించాడు కణాదుడు.

కణాదుడు

జీవిత విశేషాలు

మార్చు

కణాద మహర్షికి ఔలూక్య, కాశ్యప అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈయన క్రీ.పూ 6 వ శతాబ్దంలో జీవించాడు. కశ్యప ప్రజాపతి వంశంలో ఉలూక మహర్షికి పుత్రునిగా జన్మించాడు కణాదుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ జిల్లాలో ఉన్న ప్రభాస గ్రామం స్వస్థలం. వీధుల్లో పడి ఉన్న బియ్యం గింజలను ఏరుకుని, అవి తింటూ బాల్య జీవితం గడిపాడు. చిన్న చిన్న రేణువుల (కణాల) మీద ఆధారపడి జీవించాడు కాబట్టి యితనికి "కణాదుడు" అన్న పేరు స్థిరపడిపోయింది. ఈయనకు "కణ" (కణ భూకర్, కణభక్ష) పేర్లు కూడా వచ్చాయని కొంతమంది పండితులు పేర్కొన్నారు.

ఈయన సోమశర్మ శిష్యులు, ప్రపంచ దేశాలలో "అణువు" భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలలో తొలి శాస్త్రవేత్త. అంతే కాదు. "కార్య కారణ సంబంధం" (కారణం/హేతువుకు పరిణామం/ప్రభావమునకు నడుమనున్న సంబంధాన్ని తెలుసుకోవడమనేది మానవుని ఆలోచనలలో అతి గొప్ప ఆవిష్కరణ) అనే సిద్ధాంతాన్ని తొలిసారిగా ఆవిస్కరించింది ఈయనే. రచయితగా "వైశ్లేషిక సూత్రాలు"ను వెలువరించారు. ఇది పది గ్రంథముల సంపుటం. ప్రతి గ్రంథంలో రెండేసి అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అసంఖ్యాక సూత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో సగటున 370 సూత్రాలను పొందుపరిచాదు.

అణు భావన

మార్చు

విశ్వంలో అణువు అనేది ఒకతి ఉంటుందన్న భావనను ప్రతిపాదించింది, ఆలోచనలు రేకెత్తించిన తొలి శాస్త్రవేత్త కణాదుడు. "కారణం - ప్రభావం" కార్యకారణ సంబంధం వల్లనే సర్వం సంభవమవుతుందని సిద్ధాంతీకరించాడు. ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతమైన   ప్రతిపాదనకు మూలాలు కణాదుడి సిద్ధాంతంలో ఉన్నాయి.

ఈ ప్రపంచం అంతా పరమాణువులతో నిర్మితమైంది. వివిధ శైలీ విన్యాసాలతో పరమాణువులు సమ్మిళితమై సృష్టిలోని సమస్త ఆకారాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో కనబడుతున్నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు మొదలైనవాటి నుండి మానవుని వరకూ, చీమ నుండి డైనోసార్ అరకు అన్నీ... అన్నీ అణువుల కలయిక వలనే ఏర్పడుచున్నవి. ఇవన్నీ ఒకదానితో ఒకటి పోలిక లేనివి. విభిన్న ఆకృతులు కలిగినవి. వాటి, వాటి వ్యవహార సరళి కూడా ఒకదానితో ఒకదానికి పోలిక లేని వైవిధ్యం కలిగి యున్నాయి. అన్నీ అణువుల సముదాయమే అయినప్పుడు ఈ వైవిధ్యం ఎలా సాధ్యపడింది?

కణాదుని సిద్ధాంతం

మార్చు

కణాదుడు సిద్ధాంతం ప్రకారం "పదార్థమంతా అణువుల సంయోగం చేత సృష్టించబడుతూ ఉంటుంది. ఆయా అణువుల గుణాలు, ధర్మాలు, సంయోగాన్ని అనుసరించి పదార్థం యొక్క భౌతిక రుపం, స్వభావాలు మారుతూ ఉంటాయి. పదార్థాన్ని ఇంకా విభజించడానికి వీల్లేని భాగమే అణువు. అణువులే ప్రపంచానికి మూలాధారం. మూలకారణం. దార్యం లేకుండా కారణం జరగదు "అణువు"కు నాశనం లేదు. అణువులు నాలుగు గుణాలతో నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకే గుణం, ఒకేరకంగా ఉండే ఏకథర్మ అణువులు సంయోగం వలననే ఆయా వస్తువుల నిర్మాణం జరుగుతుంది. ఈ కలయిక మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది. 1) అణువుల్లో అంతర్గతంగా ఉండే సహజ భౌతిక శక్తి 2) అణువులకు బహిర్గతంగా ఉండే మానవాతీతశక్తి.

మరింత వివరంగా చెప్పుకోవాలంటే వివిధ వస్తువుల స్వభావ ధర్మాన్ని బట్టి, ఆయా వస్తువులు తమలోఉన్న కణ సంయోగాన్ని బట్టి రూపం ఏర్పరచుకుంటాయి. ఏక స్వభావం కలిగిన కణాలు అనేకం ఒకదానితో ఒకటి కలిసి వస్తురూపం పొందుతాయి. కణంలో ఉండే స్వభావం వస్తువులలోనూ కనిపిస్తుంది.

ఉదాః అగ్నితత్వం గలిగిన అనేక అగ్నికణాలు (అణువులు) సంయోగం చెంది, సూర్యగోళం యేర్పడింది. అగ్నికణాలలో ఉండే అగ్నితత్వమె భౌతిక వస్తురూపం దాల్చిన సూర్యగోళం నుండి వేడిమిని వెదజల్లుతుంది.

జాల సూర్య మరీచి స్థం
యత్ సూక్ష్మ్యం దృశ్యతే రజః
ప్రధమం తత్ పరిమాణానాం
త్రస రేణు రితి స్మృతిః

కిటికీల ద్వారా ప్రసరించు సూర్యరస్మి కంటికి కనబడునట్టి అత్యంత సూక్ష్మమైన ధూళికణాల పరిమాణంలో త్రసరేణం అంటే ఆరు పరమాణువుల పరిమాణం అని చెప్పబడింది. సూర్యరశ్మిలో కానవచ్చు అతిసూక్ష్మ కణము అంగుళములో ఒకటిలో 349525 వభాగం. దానిలో ఆరింట ఒక వంతు మాత్రమే పరమాణు పరిమాణం.అంటే ఘనపు అంగుళంలో అతి సూక్ష్మభావం అని కణాదుడి ప్రతిపాదన. ఈ పరమాణువులు క్రియాపూర్ణములై రేఖాగణితమందలి బిందు పరిమాణం కలపరిధిలో ఉంది.సృష్టిలో ఇట్టి పరమాణువులు సంయోగముతో ద్వ్యుణుక మూడు ద్వ్యుణుకలతో త్రణుక (త్రసరేణు) నాల్గు త్వ్యణుకల సంయోగంతో చతురణుక వ్యుత్పత్తి అగుచున్నది. పరమాణు సిద్ధాంత ప్రవక్తలతో మొదటి వాడైన కణాదుడు వస్తువుయొక్క మూలభాతఘటక (పరమాణువులు) ల నుండి సంయుక్త పదార్ధ నిర్మాణమైనదని వివరించాడు.ఈ కణాద సిద్ధాంతాన్నే జైనులు, బౌద్ధులు అనుసరించారు. సా.శ. 50నాటి ఉమాసాతి పరమాణువుల సంయోగము లేదా పరస్పర ఆకర్షణ కారణంగా అణు రచన జరిగిందన్నాడు. జైన సిద్ధాంతం ప్రకారం కొన్ని వస్తువులు చేరి ఒక పదార్దమవుతుంది.ఒక పదార్దం పెక్కు భాగాలు కానవచ్చును. ఈ పదార్ధముయొక్క అతి సూక్ష్మ్యభాగాలే పరమాణువులు 'వుద్గల' అను ద్రవ్యము పరమాణు రచితమే. ప్రతి పరమాణువు ఆకాశములో ఒక బిందువంతటి స్థలాన్ని ఆక్రమించును.ఇట్టి పరమాణువులు అనంతంగా ఉన్నాయి. రెండు లేదా అంతకుమించిన పరమాణువులు సంయోగమై 'స్కంధ' అను సంయుక్తములైను నిరూపిస్తున్నది.వాటి సంయోగము వలన నానా విధమూలైన పదార్ధములు లభిస్తున్నాయి.పరమానువులను మూల వస్తువుల సంయోగానికి కారణమైన శక్తియే రాసాయనిక సంయుక్త శక్తికీ కారణమని వారు భావించిరి.

అణువైశేషిక సిద్ధాంతం

మార్చు

ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం 'అంతా శూన్యం - ఏదీ స్థిరం కాదు" అనే శూన్య వాదం ఆధారంగానే భౌతిక శాస్త్ర అభివృద్ధి జరిగింది. కణాదుడు, కపిలుడు మొదలైన శాస్త్రవేత్తలు పదార్థం అణు సంఘటనం వల్ల ఏర్పడిందని శాతాబ్దాల క్రితమే గ్రహించారు. భారతీయ షడ్దర్శనాలలో "వైశేషికమ్" ఒకటి దీని భావం "అణ్విక విశిష్టత" దీని ఆధారంగానే "అణువైశేషిక సిద్ధాంతం" కణాదుడు ప్రతిపాదించాడు.

కణాదుడు తన "అణువైశేషిక సిద్ధాంతం"లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించాడు.

  1. అయస్కాంతం సూదులను ఆకర్షించడం
  2. మొక్కలలో జలప్రసరణ
  3. జడ పదార్థం అయిన అయస్కాంతం సూక్ష్మ శక్తుల్ని ప్రసారం చెయ్యడానికి అధారం కావడం.
  4. అన్ని రకాల వేడిమికీ సూర్యగోళంలో ఉండె అగ్ని మాత్రమే కారణం.
  5. అణువు పరిమాణానికి కూడా ఈ సూర్యగోళవేడిమే కారణం.
  6. భూమి అణువుల్లో ఉండే ఆకర్షించే గుణమె భూమి చూపించే గురుత్వాకర్షణ శక్తికి కారణం.
  7. వస్తువుల చలన స్వభావనికి మూలకారనం "శక్తివ్యయం" లేదా "పునఃచలన ప్రసారం"
  8. అణువిఘటన/అణువిచ్ఛేదన జరిగితే విశ్వప్రళయం.
  9. కాంతి కిరణాలు, ఉష్ణ కిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసారం చెందడం.వల్ల ఆ కిరణాలు అన్ని వైపులకూ అత్యంత వేగంతో దూసుకు పోగలుగుతాయి.
  10. దేశకాలాల సాపేక్షత

విశ్వం - ఆరు స్థితులు

మార్చు

కణాదుడు సిద్ధాంతం ప్రకారం విశ్వం మొత్తం ఆరు స్థితులలో ఏర్పడి యుంది. అవి

  1. ద్రవ్య పదార్థం
  2. గుణస్వభావం లేదా గుణధర్మం
  3. కర్మ
  4. సామాన్య ధర్మం
  5. విశేషధర్మం
  6. సమయవ పదార్థాలు

ఈ సమయవ పదార్థాలను తిరిగి 9 సహజ లక్షణాలుగా విభజించాడు.

  1. భూమి
  2. జలం
  3. అగ్ని
  4. వాయువు
  5. ఆకాశం
  6. కాలం
  7. అంతరిక్షం
  8. మనస్సు
  9. ఆత్మ

ప్రపంచ భౌతిక శాస్త్ర దృక్పధాన్ని సమూలంగా మార్చివేయగలిగిన ప్రభావవంతమైన అణు సిద్ధాంతాన్ని క్రీస్తు శతాబ్దాలకు పూర్వమే ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిని కణాదుడు నిరీశ్వరవాది. ఈయన సిద్ధాంతం ప్రకారం మనస్సు, ఆత్మ రెండు ద్రవ్యాలే. భగవంతుని ఉనికిని ఏ మాత్రం అంగీకరించని నాస్తికవాదిగా జీవనం చరమాంకం వరకూ భౌతిక అణు పదార్థాల శైలీ విన్యాసాల మీద అనేక పరిశోధనలు చేసిన కణాదుడు ఆస్తికులకూ నాస్తికులకూ కూడా అరాధ్యనీయుడు.

సూచికలు

మార్చు
  1. రోహిణీ ప్రసాద్, కొడవటిగంటి (2012). అణువుల శక్తి. హైదరాబాదు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. pp. XIV.

యితర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కణాదుడు&oldid=3704565" నుండి వెలికితీశారు