కథకళి (సినిమా)
కథకళి 2016లో తెలుగులో విడుదలైన లవ్ & యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. ఈ సినిమా తమిళంలో అదే పేరుతో జనవరి 14 జనవరి 2016న విడుదలై, తెలుగులో డబ్బింగ్ చేసి 18 మార్చ్ 2016న విడుదల చేశారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను విశాల్, పాండిరాజ్ నిర్మించగా పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. విశాల్, కేథరిన్ థ్రెసా, కరుణాస్, శ్రీజిత్ రవి, మధుసూదన్ రావు, మైమ్ గోపి, జయప్రకాష్ , ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, పవన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథకళి | |
---|---|
దర్శకత్వం | పాండిరాజ్ |
రచన | పాండిరాజ్ ఆముదవేల్ |
నిర్మాత |
|
నటవర్గం | |
ఛాయాగ్రహణం | బాలసుబ్రమణియం |
కూర్పు | ప్రదీప్ ఈ. రాఘవ్ |
సంగీతం | హిప్ హాప్ తమిళ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీలు | 2016 మార్చి 18 |
నిడివి | 125 నిమిషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే కమల్ (విశాల్), ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (క్యాథరిన్)ని పెళ్ళి చేసుకోవడం కోసం వచ్చి అనుకోకుండా, సాంబ (మధుసూదన్) అనే వ్యక్తి హత్య కేసులో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు ? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది ? ఈ హత్య కేసు నుంచి కమల్ ఎలా బయటపడతాడు ? అనేది మిగతా సినిమా కథ.[1]
నటీనటులుసవరించు
- విశాల్
- కేథరిన్ థ్రెసా
- కరుణాస్
- శ్రీజిత్ రవి
- మధుసూదన్ రావు
- మైమ్ గోపి
- జయప్రకాష్
- ఇమ్మన్ అన్నాచి
- గ్రేస్ కరుణాస్
- పవన్
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
- నిర్మాత: విశాల్, పాండిరాజ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాండిరాజ్ [2]
- సంగీతం: హిప్ హాప్ తమిళ
- సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియం
మూలాలుసవరించు
- ↑ The Times of India (14 January 2016). "Kathakali Movie Review {3/5}: Critic Review of Kathakali by Times of India". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
- ↑ Sakshi (15 March 2016). "ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు". Archived from the original on 30 ఆగస్టు 2021. Retrieved 30 August 2021.