కేథ‌రిన్ థ్రెసా

భారతీయ నటి

కేథరీన్ థెరీసా (జననం : సెప్టెంబరు 10 1996) దక్షిణ భారత నటి. ఈమె మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది.

కేథ‌రిన్ థ్రెసా
జననం
కేథరీన్ థెరీసా అలెగ్జాండర్

(1996-09-10) 1996 సెప్టెంబరు 10 (వయసు 28)
దుబాయి
ఇతర పేర్లుకేథరీన్
వృత్తినటి,
మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011 నుండి ఇప్పటివరకు

సినీ జీవితం

మార్చు

కన్నడంలో ప్రముఖ నటుడు దునియా విజయ్ సరసన శంకర్ IPS సినిమాతో తెరంగేట్రం చేసిన కేథరీన్ అదే సంవత్సరంలో పృథ్వీరాజ్ సరసన మలయాళంలో ది ధ్రిల్లర్ సినిమాలో నటించింది. అదే సంవత్సరంలో కన్నడ భాషలో ఉప్పుకుండం బ్రదర్స్, విష్ణు సినిమాలలో నటించింది. 2012లో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా విఫలమైనా కేథరీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకులు కూడా ఆమె నటన, అందచందాలే ఆ సినిమాకున్న ఏకైక మంచి అంశంగా అభివర్ణించారు. ప్రస్తుతం కేథరీన్ నానీ సరసన పైసా, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే తెలుగు సినిమాల్లో నటిస్తోంది.

వ్యక్తిగత జీవితం

మార్చు

కేథరీన్ దుబాయికి చెందిన మలయాళం కేథలిక్ కుటుంబంలో జన్మించింది.[1] ఆమె చెప్పిన ప్రకారం "నేను అనర్గళంగా మలయాళం మాట్లాడలేను. మేము ఇంటిలో ఆంగ్లంలో మాట్లాడుకుంటాము. నేను హిందీ లో కూడా చక్కగా మాట్లాడాగలను. ప్రస్తుతం తెలుగు భాషను నేర్చుకుంటున్నాను".[2] ఈమె దుబాయిలో 12 గ్రేడు వరకు చదివింది. అచటనుండి బెంగళూరుకు ఉన్నత విద్య అభ్యసించటానికి వచ్చింది. ఈమె సెయింట్ జోసెఫ్ కాలేజీ, బెంగళూరులో రెండు సంవత్సరములు విద్యాభ్యాసం చేసింది.[3] ఈమె విద్యాభ్యాసం చేసే కాలంలో సంగీత వాద్యాలను ఉపయోగించుట, పాడుట, నృత్యం నేర్చుకుంది. ఈమె ఐస్ స్కేటింగ్ కూడా చేయగలదు.[2] ఈమె "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్", "జోస్కో జ్యుయలర్స్", "దక్కన్ క్రానికల్" లకు మోడల్ గా వ్యవహరిస్తున్నది. ఈమె "శ్రీకంఠదత్త వొడియార్ కాలెండర్"లో ఒక షాట్ లో గలదు. ఈమె అనేక నగరాలలో గల వివిధ రాంప్ షోలలో పాల్గొంది.[4]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2010 శంకర్ ఐ.పి.ఎస్. శిల్పా కన్నడ
ది త్రిల్లర్ మీరా మళయాళం
2011 ఉప్పుకండం బ్రదర్స్ బ్యక్ ఇన్ యాక్షన్ వినిలా సత్యనేశన్ మళయాళం
విష్ణు మీనాక్షి కన్నడ
2012 గొడ్‌ఫాదర్ వాణి కన్నడ
2013 చమ్మక్ చల్లో సునైనా తెలుగు
ఇద్దరమ్మాయిలతో ఆకాంక్ష తెలుగు
2014 పైసా నూర్ తెలుగు
మద్రాస్ కలైయరసి తమిళం
ఎర్రబస్సు రాజి తెలుగు
2015 రుద్రమదేవి అన్నంబిక తెలుగు
2016 కదకళి మీను కుట్టి తమిళం
కణితన్ అను తమిళం
సరైనోడు ఎం.ఎల్.ఏ. హంసితా రెడ్డి తెలుగు
2017 కదంబన్ \ గజేంద్రుడు (2019 తెలుగు) రతి తమిళం
గౌతమ్ నంద ముగ్ధా తెలుగు
నేనే రాజు నేనే మంత్రి దెవికా రాణి తెలుగు
జయ జానకి నాయక తెలుగు "ఎ ఫర్ అప్పిలు" అనే పాటలో ప్రత్యేక ప్రదర్శన
కథా నాయగన్ కన్మణి తమిళం
2018 కలగలప్పు 2 హేమ తమిళం
ఆనెంగులుం అల్లెంగులుం మళయాళం చిత్రీకరణ జరుగుతుంది
2019 వదలడు తెలుగు \ తమిళ్
2020 వరల్డ్ ఫేమస్ లవర్[5] స్మిత తెలుగు
2022 భళా తందనానా తెలుగు
బింబిసారా ఐర తెలుగు
మాచర్ల నియోజవర్గం తెలుగు

మూలాలు

మార్చు
  1. "Katherine, the new girl on the block". nowrunning.com. Archived from the original on 5 November 2013. Retrieved 7 November 2012.
  2. 2.0 2.1 "Riding high". The Hindu. Archived from the original on 27 సెప్టెంబరు 2012. Retrieved 7 November 2012.
  3. "Katherine Exclusive Interview". Archived from the original on 15 April 2013. Retrieved 7 November 2012.
  4. "Katherine Heroine In S Narayan Movie". Archived from the original on 8 February 2015. Retrieved 7 November 2012.
  5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.