కథనం (2019 సినిమా)

రాజేష్ నాదేండ్ల దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
(కథనం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)

కథనం 2019, ఆగస్టు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజేష్ నాదేండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ భరధ్వాజ్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటించగా, రోషన్ సాలూరు సంగీతం అందించాడు. గాయత్రి ఫిల్మ్స్ పతాకంపై బి. నాగేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందించారు.

కథనం
కథనం సినిమా పోస్టర్
దర్శకత్వంరాజేష్ నాదేండ్ల
రచనరాజేంద్ర భరద్వాజ్
స్క్రీన్ ప్లేరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతబి. నాగేంద్ర రెడ్డి, శర్మ చుక్కా
తారాగణంఅనసూయ భరధ్వాజ్
అవసరాల శ్రీనివాస్
వెన్నెల కిషోర్
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
సంగీతంరోషన్ సాలూరు
నిర్మాణ
సంస్థ
గాయత్రి ఫిల్మ్స్
విడుదల తేదీ
9 ఆగస్టు 2019 (2019-08-09)
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అను(అనసూయ భరద్వాజ్‌) సినిమా పరిశ్రమలో రచయితగా కథలు రాస్తూ.. దర్శకత్వం చేసే అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. నలుగురు నిర్మాతలు చెప్పిన కథకు స్క్రిప్ట్ రాసేందుకు అంగీకరిస్తుంది. ఆ చిత్రానికి అనసూయను దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి, స్క్రిప్ట్‌ వర్క్‌ చేయమని సలహా ఇస్తారు నిర్మాతలు. అయితే ఆ కథకు సంబంధించిన కథనాన్ని ఎలా రాసుకుంటుందో, నగరంలో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలకు, అనుకు ఉన్న సంబంధం ఏమిటి, ఆ హత్యలు చేసేది ఎవరు, అలా ఎందుకు చేస్తున్నారన్నది మిగతా కథ.[1][2]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: రాజేష్ నాదేండ్ల
  • నిర్మాత: బి. నాగేంద్ర రెడ్డి, శర్మ చుక్కా
  • రచన, స్క్రీన్ ప్లే: రాజేంద్ర భరద్వాజ్
  • సంగీతం: రోషన్ సాలూరు
  • ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
  • నిర్మాణ సంస్థ: గాయత్రి ఫిల్మ్స్

విడుదల

మార్చు

ఈ చిత్రం 2019, ఆగస్టు 9న విడుదలై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి ప్రతికూల స్పందనలను అందుకుంది.[3][4]

మార్కెటింగ్

మార్చు

2018, అక్టోబరులో ప్రధాన తారాగణం ఆధ్వర్యంలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయబడింది.[5] 2019, ఆగస్టు 3న ట్రైలర్ విడుదలయింది.

మూలాలు

మార్చు
  1. సాక్షి, సినిమా (9 August 2019). "'కథనం' మూవీ రివ్యూ". బండ కళ్యాణ్‌. Archived from the original on 9 ఆగస్టు 2019. Retrieved 3 January 2020.
  2. "Kathanam Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 10 August 2019. Retrieved 3 January 2020.
  3. Kathanam Movie Review {1.5/5}: A dreary, long film that fails to take off, retrieved 3 January 2020
  4. Chowdhary, Y. Sunita (9 August 2019). "'Kathanam' review: An unimpressive narrative is its downfall". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 3 January 2020.
  5. "'Kathanam': Anasuya Bharadwaj unveils her look from the film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 January 2020.

ఇతర లంకెలు

మార్చు