అవసరాల శ్రీనివాస్
అవసరాల శ్రీనివాస్ భారతీయ నటుడు, దర్శకుడు, సినిమా స్క్రిప్ట్ రచయిత. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శ్రీనివాస్ కొద్ది రోజులు విజయవాడ, కొత్త ఢిల్లీ, చెన్నై, కోల్కతాలలో నివసించారు. శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసారు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలసిస్ విషయంలో ప్రిన్స్‍టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో పనిచేసారు.[1] యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్ (UCLA) నుండి స్క్రీన్ రైటింగ్ లో డిప్లోమా పొందారు. లీస్ట్రాస్ బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్ వద్ద సంవత్సరం పాటు నటనలో శిక్షణ పొందారు. న్యూయార్క్ లో కొన్ని రోజులు రంగస్థలంలో పనిచేసి, ఆపై బ్లైండ్ ఆంబిషన్ అనే చిత్రానికి సహదర్శకుడిగా పనిచేసారు. యూనివర్సల్ స్టూడియోస్ వద్ద స్క్రిప్ట్ స్క్రీనర్ గా పనిచేసారు. అష్టా-చమ్మా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కొని సన్నివేశాలను వ్రాయటంలో సహాయమందించారు.[2] ముగ్గురు, పిల్ల జమీందార్, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ లాంటి సినిమాలల్ పనిచేసారు. ఊహలు గుసగుసలాడే అనే ప్రేమ-హాస్య కథా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.[3]
అవసరాల శ్రీనివాస్ | |
---|---|
![]() | |
జననం | |
ఇతర పేర్లు | శ్రీ, శ్రీని, లంబూ |
వృత్తి | నటుడు, రచయిత, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2007-ప్రస్తుతం |
తల్లిదండ్రులు | వెంకట సత్యనారాయణ మూర్తి, నాగమణి |
2022 డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలవుతున్న అవతార్ 2(అవతార్: ది వే ఆఫ్ వాటర్) సినిమాకు తెలుగు మాటలు అవసరాల శ్రీనివాస్ అందించారు.[4]
బాల్యం, విద్యాభ్యాసం సవరించు
అవసరాల శ్రీనివాస్ స్వస్థలం కాకినాడ. హైదరాబాదులో పెరిగాడు. తండ్రి బ్యాంకర్.[5]విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, చెన్నై, కోల్ కత లో కూడా కొద్ది రోజులున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. కొద్ది రోజుల పాటు ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. స్క్రీన్ రైటింగ్, సినిమా సంబంధిత కోర్సులు కొన్ని పూర్తి చేశాడు.[6]
సినిమారంగం సవరించు
2008 లో విడుదలైన అష్టా చమ్మా సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[7]
సినిమాలు సవరించు
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2019 | కథనం | |
2018 | అ! | శివ |
అంతరిక్షం | ||
దేవదాస్[8] | రాజన్ | |
2016 | నాన్నకు ప్రేమతో | |
జ్యో అచ్యుతానంద | దర్శకుడు | |
2015 | కంచె (సినిమా) | |
2014 | ఊహలు గుసగుసలాడే | దర్శకుడు |
2013 | అమృతం చందమామలో | అమృత రావు |
అడ్డా[9] | కిశోర్ | |
అంతకు ముందు... ఆ తరువాత... | విశ్వ | |
అరవింద్ 2 | కథానాయకుడు | |
సుకుమారుడు | ఏఎన్ఆర్ | |
చమ్మక్ చల్లో | కిశోర్ | |
2011 | వరప్రసాద్ అండ్ పొట్టిప్రసాద్ | వర ప్రసాద్ |
ముగ్గురు | అంజి | |
పిల్ల జమీందార్ | కన్నబాబు | |
గోల్కొండ హైస్కూల్ | మాటలు, వాయిస్ ఓవర్ | |
2010 | ఆరెంజ్ | అజయ్ |
సరదాగా కాసేపు | శ్రీనివాస్ | |
2008 | అష్టా-చమ్మా | ఆనంద్ |
2007 | బ్లైండ్ ఆంబిషన్ | సహదర్శకత్వం |
పురస్కారాలు సవరించు
- 2014: ఉత్తమ సహాయనటుడు (ఊహలు గుసగుసలాడే)
మూలాలు సవరించు
- ↑ "rediff.com: ఫ్రం ప్రిన్స్టన్ టు అష్టాచెమ్మా". Specials.rediff.com. Retrieved 2013-12-12.
- ↑ "rediff.com: ఫ్రం ప్రిన్స్టన్ టు అష్టాచెమ్మా". Specials.rediff.com. Retrieved 2013-12-12.
- ↑ TNN (2013-09-12). "శ్రీనివాస్ అవసరాల టర్న్స్ డైరెక్టర్ -- టైంస్ ఆఫ్ ఇండియా". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-12-04. Retrieved 2013-12-12.
- ↑ "Avatar 2: 'అవతార్2'కు డైలాగ్ రైటర్‌గా అవసరాల శ్రీనివాస్". web.archive.org. 2022-12-14. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "24 గంటలూ సినిమా గురించిన ధ్యాసే". 7 April 2019. Archived from the original on 8 April 2019.
- ↑ "Srinivas Avasarala interview". Idlebrain.com. Idlebrain. 11 September 2008.
- ↑ "మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌తో అవసరాల". 14 March 2019. Archived from the original on 8 April 2019. Retrieved 8 April 2019.
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
- ↑ "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.