కథలో రాజకుమారి 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1][2]

సినిమా పోస్టరు

సినిమాల్లో ప్రతినాయకుని పాత్ర‌లు వేస్తుంటాడు అర్జున్ (నారా రోహిత్‌). 50 సినిమాల‌ను పూర్తి చేసిన అర్జున్ కి పురస్కారాలు కూడా బాగానే వ‌స్తాయి. దాంతో.. త‌నో పెద్ద నటుడినన్న గ‌ర్వం అత‌నిలో పెరుగుతుంది. అంతేకాకుండా.. సినిమాల్లో చూపించే విల‌నిజాన్ని, బాడీలాంగ్వేజ్‌ని బ‌య‌ట కూడా ప్ర‌ద‌ర్శిస్తుంటాడు. తోటివాళ్ల‌ని చాలా హీనంగా చూస్తుండే అర్జున్ జీవితంలో ఓ ఊహించ‌ని సంఘటన జ‌రుగుతుంది. అది అత‌ని జీవితాన్నే మార్చివేస్తుంది. ఫ‌లితంగా.. అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో కూడా క్ర‌మంగా మార్పు వ‌స్తుంది. అయితే ఆ మార్పు వ‌ల్ల త‌న పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌లేక‌పోతుంటాడు అర్జున్‌. దీంతో బాగా నిరుత్సాహ‌ప‌డిపోయిన అత‌ను.. ఎలాగైనా మునుప‌టిలా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఆ క్ర‌మంలో చాలా మందిని స‌ల‌హా అడుగుతాడు. చివ‌ర‌కి ఓ వ్య‌క్తి 'నీ జీవితంలో నీకున్న‌ శ‌త్రువు ఎవ‌రో గుర్తించు. వారి జీవితంలోకి వెళ్లి.. వారి ఆనందాల‌ను దూరం చేయ్. అప్పుడు నీలో రాక్ష‌స‌త్వం బ‌య‌ట‌కొస్తుంది. న‌టుడిగా తిరిగి రాణిస్తావ్ ' అని చెబుతాడు. త‌న‌కు శ‌త్రువు ఎవ‌రున్నారా? అంటూ బాగా ఆలోచించిన అర్జున్‌.. త‌న శ‌త్రువు సీత అని గుర్తిస్తాడు. అలా..సీత‌ జీవితంలోకి వెళ్లిన అర్జున్, ఆమెని ఎలాంటి ఇబ్బందుల‌కు గురిచేశాడ‌న్న‌దే మిగిలిన కథ.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • సంగీతం: ఇళయరాజా, విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌
  • కెమెరా: న‌రేష్ కె రానా
  • ఎడిటింగ్: కార్తీక్ శ్రీ‌నివాస్‌
  • నిర్మాత‌లు: సౌంద‌ర్య న‌ర్రా, ప్ర‌శాంతి, బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి, కృష్ణ విజ‌య్‌
  • క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ సూర‌ప‌నేని
  • నిర్మాణ సంస్థ: ఆరోహి సినిమా
  • విడుద‌ల తేది: సెప్టెంబ‌ర్ 15, 2017

మూలాలు

మార్చు
  1. "Nara Rohith Next Movie is Kathalo Rajakumari". businessoftollywood.com. 21 November 2015. Archived from the original on 25 November 2015. Retrieved 26 November 2015.
  2. "Namita Is Rohit's Rajakumari". gulte.com. 21 November 2015. Retrieved 26 November 2015.

బాహ్య లంకెలు

మార్చు