కనెక్టికట్

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాష్ట్రం
Map of USA CT.svg

కనెక్టికట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య దిశలో న్యూ ఇంగ్లండ్ ప్రదేశంలో ఉన్నది. 1614 లో డచ్ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ 1636 వ సంవత్సరానికి కనెక్టికట్ బ్రిటీషువారి ఏలుబడిలోనికి వచ్చింది. అమెరికా స్వతంత్ర పోరాటంలో బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేసిన పదమూడు కాలనీలలో కనెక్టికట్ కూడా ఒకటి. కనెక్టికట్ వాసులను నట్ మెగ్గర్లు అని కానీ, యాంకీలు అనిగానీ పిలుస్తారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం కనెక్టికట్ అమెరికాలోకెల్లా అత్యంత సంపన్న రాష్ట్రం.