న్యూయార్క్ రాష్ట్రం

అమెరికా దేశంలో ఇది ఒక రాష్ట్రం

న్యూయార్క్ అమెరికా లోని రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా ఈశాన్య భాగంలో మధ్య అట్లాంటిక్లో ఉంది. ఈ రాష్ట్రం అమెరికా రాష్ట్రాలన్నింటిలోకీ తృతీయ అత్యధిక జనాభా కలిగి ఉంది. వెర్మాంట్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, న్యూజెర్సీ, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియా రాష్ట్రాలు న్యూయార్క్ సరిహద్దుల్లో ఉన్నాయి. కెనడా భూభాగాలయిన క్యూబెక్, ఒంటారియోలు న్యూయార్కుకు అంతర్జాతీయ సరిహద్దులు. న్యూయార్క్ నగరం, బఫెలో, రోచెస్టర్, యాంకర్స్, సైరాక్యూస్ ఈ రాష్ట్రపు అయిదు అతి పెద్ద నగరాలు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే దేశంగా ఏర్పడిన తొలి 13 రాష్ట్రాల్లో న్యూయార్కు ఒకటి. 2019 లో ఈ రాష్ట్ర జనాభా 1.9 కోట్లు. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఇది నాలుగవది.

రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతుల మంది న్యూయార్కు మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నివసిస్తారు.[1] 2019 లో 83.4 లక్షల జనాభాతో న్యూయార్కు, అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం.[2] న్యూయార్కులో ఐరాస ప్రధాన కార్యాలయం ఉంది. న్యూయార్కును ప్రపంచానికి సంస్కృతిక, ఆర్థిక, ద్రవ్య, మీడియా రాజధానిగా భావిస్తారు. ఆర్థికంగా ఇదిద్ అత్యంత బలమైన నగరం.

విస్తీర్ణంలో న్యూయార్కు అమెరికా రాష్ట్రాల్లో 27 వ స్థానంలో ఉంది. భౌగోళికంగా న్యూయార్కు వైవిధ్యమైనది. దక్షిణ ప్రాంతంలో అట్లాంటిక్ తీర మైదానం, న్యూయార్కు నగరం, హడ్సన్ నదీ లోయ ఉండగా, ఉత్తర ప్రాంతం అప్పలాచియన్ పర్వతాలతో కూడుకుని ఉంటుంది. రాష్ట్ర పశ్చిమ ప్రాంతాన్ని మహా సరస్సుల ప్రాంతంలో భాగంగా పరిగణిస్తారు. ఈ ప్రాతం ఒంటారియో సరస్సు, ఎరీ సరస్సు, నయాగరా జలపాతాలకు సరిహద్దుల్లో ఉంది.రాష్ట్రం లోని మధ్య ప్రాంతం ఫింగర్ సరస్సులతో కూడుకుని పర్యాటక ప్రదేశంగా ప్రజాదరణ పొందుతోంది.

17 వ సతాబ్ది తొలినాళ్లలో డచ్చి వారు ఇక్కడ వలసలను స్థాపించారు. 1664 లో బిటిషు వారు దీన్ని ఆక్రమించుకున్నారు. అమెరికా స్వాతంత్ర్య యుద్ధంలో వలసదారులపై విజయం సాధించి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

దాదాపు 200 కాలేజీలు విశ్వవిద్యాలయాలతో రాష్ట్రం విద్యా రంగంలో ప్రముఖ స్థానంలో ఉంది. బఫలో లోని స్టేట్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, న్యూ యార్క్ యూనివర్సిటీ మొదలైనవి రాష్ట్రం లోని ప్రముఖ విద్యా సంస్థలు.[3][4][5]

మూలాలు మార్చు

  1. "2018 ACS DEMOGRAPHIC AND HOUSING ESTIMATES". United States Census Bureau. Archived from the original on 3 మే 2020. Retrieved 10 March 2020.
  2. "2018 ACS DEMOGRAPHIC AND HOUSING ESTIMATES". United States Census Bureau. Archived from the original on 3 మే 2020. Retrieved 10 March 2020.
  3. "2020 Best National University Rankings". www.usnews.com.
  4. "Academic Ranking of World Universities 2015". ShanghaiRanking Consultancy. Archived from the original on 2015-10-30. Retrieved August 27, 2015.
  5. "CWUR 2015—World University Rankings". Center for World University Rankings. Retrieved August 27, 2015.