కనెక్ట్
కనెక్ట్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు.[2] నయనతార, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబరు 22న విడుదలైంది.[3]
కనెక్ట్ | |
---|---|
దర్శకత్వం | అశ్విన్ శరవణన్ |
రచన | అశ్విన్ శరవణన్ , కావ్య రాంకుమార్ |
నిర్మాత | విఘ్నేష్ శివన్ |
తారాగణం | నయనతార అనుపమ్ ఖేర్ సత్యరాజ్ |
ఛాయాగ్రహణం | మణికంఠన్ కృష్ణమాచార్య |
కూర్పు | రిచర్డ్ కెవిన్ |
సంగీతం | పృథ్వీ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థ | యూవీ క్రియేషన్స్[1] |
విడుదల తేదీ | 22 డిసెంబర్ 2022 |
సినిమా నిడివి | 99 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుసుసాన్ (నయనతార) తన భర్త జోసెఫ్ (వినయ్ రాయ్), కుమార్తె అనా జోసెఫ్ (హనియా నఫీసా), సుసాన్ తండ్రి ఆర్థర్ (సత్యరాజ్) తో కలిసి అందమైన జీవితం సాగిస్తూ ఉంటుంది. జోసెఫ్ వృత్తిరీత్యా కరోనా సమయంలో చికిత్స అందిస్తున్న సమయంలో అతను వైరస్ బారిన పడి మరణిస్తాడు. ఇలా కరోనా కారణంగా హ్యాపీగా జీవిస్తున్న ఈ ఫ్యామిలీ పరిస్థితిలో తలకిందులు అవుతాయి. ఇక దీంతో అనా జోసెఫ్ (హనియా నఫీసా) తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అతనిని ఎలాగైనా కమ్యూనికేట్ చేయడానికి ఓయిజా బోర్డు ప్రయోగించడంతో ఎన్నో అపవిత్ర ఆత్మలు ఆ ఇంట్లోకి చేరుకొని ఆమెను దుష్టశక్తి ఆవహిస్తుంది. ఆర్థర్ (సత్యరాజ్), సుసాన్ (నయనతార) ముంబైకి చెందిన పూజారి (అనుపమ్ ఖేర్) ని ఆశ్రయిస్తారు. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
మార్చు- నయనతార
- అనుపమ్ ఖేర్
- సత్యరాజ్
- వినయ్ రాయ్
- హనియా నఫీసా
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రౌడీ పిక్చర్స్
- నిర్మాత: విఘ్నేష్ శివన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ శరవణన్
- సంగీతం: ప్రిథ్వి చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ: మణికంఠన్ కృష్ణమాచార్య
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy. "యూవీకి నయనతార 'కనెక్ట్'" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Andhra Jyothy (6 December 2022). "'కనెక్ట్' అవ్వాల్సిందే!" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ Namasthe Telangana (7 December 2022). "నయనతార హారర్ థ్రిల్లర్". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
- ↑ "'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?". 21 December 2022. Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.