కపూర్తలా

పంజాబ్ రాష్ట్రంలోని నగరం

కపూర్తలా పంజాబ్ రాష్ట్రంలోని నగరం. ఇది కపూర్తలా జిల్లా ముఖ్యపట్టణం. ఇది బ్రిటిష్ ఇండియాలోని కపూర్తలా సంస్థానానికి (అహ్లువాలియా రాజవంశం పాలించింది) రాజధాని కూడా. ఫ్రెంచ్, ఇండో-సారాసెనిక్ వాస్తుశైలితో కూడుకున్న దాని ప్రముఖ భవనాలతో కూడిన ఈ నగరపు లౌకిక, సౌందర్య మిశ్రమం దాని రాచరిక గతాన్ని పట్టి చూపుతాయి. దీనిని ప్యాలెస్ & గార్డెన్స్ నగరం అని కూడా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన నగరం కపూర్తలా. [2]

కపూర్తలా
నగరం
జగత్‌జిత్ క్లబ్, కపూర్తలా
జగత్‌జిత్ క్లబ్, కపూర్తలా
కపూర్తలా is located in Punjab
కపూర్తలా
కపూర్తలా
పంజాబ్‌లో నగర స్థానం
కపూర్తలా is located in India
కపూర్తలా
కపూర్తలా
కపూర్తలా (India)
నిర్దేశాంకాలు: 31°23′N 75°23′E / 31.38°N 75.38°E / 31.38; 75.38Coordinates: 31°23′N 75°23′E / 31.38°N 75.38°E / 31.38; 75.38
దేశం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాకపూర్తలా
స్థాపించిన వారురణాధీర్ కపూర్[1]
ప్రభుత్వం
 • నిర్వహణమునిసిపల్ కార్పొరేషన్, కపూర్తలా
సముద్రమట్టం నుండి ఎత్తు
225 మీ (738 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం1,01,854
భాషలు
 • అధికారికపంజాబీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
144 601
టెలిఫోన్ కోడ్01822
వాహనాల నమోదు కోడ్PB-09

చరిత్రసవరించు

సంస్థానంసవరించు

 
కపూర్తలా జెండా

కపూర్తలా స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో కపూర్తలా సంస్థానానికి రాజధానిగా ఉంది. దీనిని అహ్లువాలియా సిక్కు పాలకులు పాలించారు. కపూర్తలా జెండాకు రెండు రంగుల నేపథ్యంతో "ప్రో రీజ్ ఎట్ పాట్రియా" అనే లాటిన్ నీతి వాక్యంతో ("రాజు కొరకు, దేశం కొరకు") ఉంటుంది.

జనాభా వివరాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం తాత్కాలిక సమాచారం ప్రకారం కపుర్తాల జనాభా 101,854, వీరిలో పురుషులు 55,485, మహిళలు 46,169. అక్షరాస్యత రేటు 85.82 శాతంగా ఉంది. [3]

కపూర్తలాలో మతం[4]
మతం శాతం
సిక్కు మతం
  
72.79%
హిందూ మతం
  
24.74%
ఇస్లామ్
  
1.26%
క్రైస్తవం
  
0.59%
ఇతరులు
  
0.64%

స్మారక చిహ్నాలు, భవనాలుసవరించు

కపూర్తలా నగరంలో సైనిక్ స్కూల్ (పూర్వం జగత్జిత్ ప్యాలెస్ ), షాలిమార్ బాగ్ (గార్డెన్స్), జిల్లా కోర్టు భవనాలు, మూరిష్ మసీదు, పంచ మందిరం ("ఐదు దేవాలయాలు"), గడియార స్థంభం, స్టేట్ గురుద్వారా, కంజ్లి వెట్ ల్యాండ్స్, 15,000 మంది కూర్చోగల ఫీల్డ్ హాకీ మైదానమైన గురు నానక్ స్టేడియం, జగత్‌జిత్ క్లబ్, ఎన్‌జెఎస్ఏ ప్రభుత్వ కళాశాల వంటి అనేక భవనాలు, ఆసక్తి కలిగించే ప్రదేశాలూ ఉన్నాయి. దేశంలోని మొదటి వాతావరణ మార్పు థియేటర్‌ ఈ నగరంలోనే ఉంది.

రవాణాసవరించు

కపూర్తలా నగరం పంజాబ్ లోను, ఉత్తర భారతదేశం లోనూ ఉన్న ప్రధాన రవాణా మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. ఇది జలంధర్ నగరం నుండి 19 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కున ఉంది. [5]

జాతీయ రహదారి 703 ఎ, శ్రీ గురు నానక్ దేవ్ జీ మార్గ్ (ఎన్‌హెచ్ 703 ఎఎ) లు కపూర్తలాను పక్క రాష్ట్రాలతో కలుపుతాయి. [6] [7]

జలంధర్-ఫిరోజ్‌పూర్ మార్గంలో ఉన్న కపూర్తలా రైల్వే స్టేషను, రెండు ప్రధాన రైల్వే జంక్షన్ స్టేషన్లైన జలంధర్, ఫిరోజ్‌పూర్‌ ల ద్వారా నగరాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు కలుపుతుంది. [8]

కపూర్తలాకు అత్యంత సమీపం లోని విమానాశ్రయం, శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం 75 కిలోమీటర్ల దూరం లోని అమృత్‌సర్ వద్ద ఉంది [5] .

విద్యసవరించు

కపూర్తలా లోని ప్రధానమైన ఉన్నత విద్యాసంస్థలు

 • జిఎన్‌డియు ప్రాంతీయ ప్రాంగణం, ఫట్టుధింగా, సుల్తాన్‌పూర్ లోధి, కపూర్తలా, 2013 లో స్థాపించబడింది.
 • కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (CEM)
 • ఎస్డీ పబ్లిక్ స్కూల్, షేఖూపూర్, కపూర్తలా
 • కపూర్తలా వ్యవస్థాపకుడు రణధీర్ సింగ్ పేరిట 1856 లో స్థాపించబడిన NJSA ప్రభుత్వ కళాశాల, రణధీర్ కళాశాలగా పేరు పొందింది [9]
 • ఆనంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (ACEM)
 • మహిళల కోసం హిందూ కన్యా కళాశాల
 • బెబే నంకీ జిఎన్‌డియు కళాశాల మిత్రా.
 • లార్డ్ కృష్ణ పాలిటెక్నిక్ కళాశాల (ఎల్కెపిసి), సుభాన్‌పూర్ రోడ్, కపూర్తలా
 • షాహీద్ ఉధమ్ సింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, సుభాన్‌పూర్ రోడ్, కపూర్తలా. (SUS COLLEGE)
 • సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ.

కపూర్తలాలో అనేక ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

 • ఆనంద్ పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్
 • బావా లాల్వాని పబ్లిక్ స్కూల్
 • క్రైస్ట్ కింగ్ కాన్వెంట్ స్కూల్, నగరంలోని ఏకైక ICSE కాన్వెంట్ పాఠశాల
 • ధిల్వాన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ (డిఐపిఎస్)
 • ప్రభుత్వం బాలికలు సీనియర్ సెకండరీ పాఠశాల కపూర్తలా (ఘంటా ఘర్ పాఠశాల)
 • జెకె పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్ (స్థానిక వ్యక్తిత్వం జాండా మల్ శర్మ ప్రారంభించారు)
 • కె
 • కేంద్రీయ విద్యాలయ కపుర్థాల కంటోన్మెంట్
 • కెఆర్ జైన్ డిఎవి పబ్లిక్ స్కూల్
 • MDSD సీనియర్ సెకండరీ స్కూల్
 • ఎంజిఎన్ పబ్లిక్ స్కూల్
 • ఓంకార్ పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్
 • ప్రితా లీ లెసన్ సీనియర్ సెకండరీ స్కూల్
 • సైనిక్ స్కూల్
 • లిటిల్ ఏంజిల్స్ కో-ఎడ్ స్కూల్
 • రణధీర్ స్కూల్
 • జిటిబి ఇంటర్నేషనల్ సీనియర్ సెక. పాఠశాల
 • ప్రేమ్‌జోట్ Sr Sec పబ్లిక్ స్కూల్
 • కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-10-07. Retrieved 2020-11-03.
 2. "Top 10 Least Populated Cities of India - Census.co.in".
 3. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
 4. "Kapurthala City Population Census 2011 - Punjab".
 5. 5.0 5.1 "How to reach Kapurthala". Kapurthala district official website. Retrieved 29 August 2020.
 6. "Kapurthala-Taran Taran road declared as NH- 703 A A named as Shri Guru Nanak Dev Ji Marg". All India Radio (AIR). 17 October 2019. Retrieved 29 August 2020.{{cite news}}: CS1 maint: url-status (link)
 7. "NH No. 703AA in Punjab named as Guru Nanak Dev Ji Marg". DD News. 18 October 2019. Retrieved 29 August 2020.{{cite news}}: CS1 maint: url-status (link)
 8. "Time table of KAPURTHALA (KXH) railway station". Rail Drishti. Archived from the original on 17 ఏప్రిల్ 2021. Retrieved 29 August 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 9. "College of excellence, 150 years ago". The Tribune. 1 October 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=కపూర్తలా&oldid=3560134" నుండి వెలికితీశారు