కమలనయన్ బజాజ్
కమలనయన్ బజాజ్ (1915 జనవరి 23-1972 మే 1) మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.
కమలనయన్ బజాజ్ | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1957-1971 | |
నియోజకవర్గం | వార్థా లోక్‌సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1915 జనవరి 23 |
మరణం | 1972 మే 1 | (వయసు 57)
సంతానం | రాహుల్ బజాజ్ |
తల్లిదండ్రులు | జమ్నాలాల్ బజాజ్ జానకీ దేవి బజాజ్ |
జీవితచరిత్ర
మార్చుప్రారంభ జీవితం విద్య
మార్చుకమలనయన్ బజాజ్ బజాజ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ పెద్ద కుమారుడు.[1] కమలనయన్ 1915 జనవరి 23న జన్మించాడు.[2] 1954లో తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన బజాజ్ గ్రూప్ కు నాయకత్వం వహించాడు.[3] అతను ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేశాడు.
వృత్తి
మార్చుత్రీ-వీలర్స్ సిమెంట్, అల్లాయ్ కాస్టింగ్ ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో బజాజ్ గ్రూప్ ప్రముఖ పాత్ర పోషించింది .[3]
కమలనయన్ బజాజ్ కు రాహుల్ బజాజ్, సుమన్ జైన్, శిశిర్ బజాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.[4][5] రాహుల్ బజాజ్ కమలనయన్ బజాజ్ పెద్ద కుమారుడు.[2]
రాజకీయ జీవితం
మార్చుకమలనయన్ బజాజ్ వార్ధా లోక్ సభ నియోజకవర్గం నుండి 1957 నుంచి 1971 వరకు మూడుసార్లు ఎంపీగా గెలిచాడు. 1969 లో తన రాజకీయ సహచరుడు మొరార్జీ దేశాయ్‌తో కలిసి కాంగ్రెసులో చేరాడు. 1971 పార్లమెంట్ ఎన్నికలలో కమలనయన్ బజాజ్ ఓడిపోయారు. ఆ తరువాత అతను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.[2]
కమలనయన్ బజాజ్ 1972 మే 1 న 57 సంవత్సరాల వయసులో మరణించాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "About Us | Brief History Of Bajaj Electricals". www.bajajelectricals.com.
- ↑ 2.0 2.1 2.2 Bhandari, Bhupesh (23 January 2015). "Kamalnayan Bajaj: A 'Gandhian' rebel". Business Standard. Retrieved 29 November 2018. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "a3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 3.0 3.1 3.2 "The Bajaj Story | Bajaj group of Companies, Kushagra Bajaj, Vice Chairman". www.bajajgroup.org. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "a2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Updates". @businessline.
- ↑ "Shishir Bajaj - Forbes India Magazine". Forbes India.