మొరార్జీ దేశాయి
మొరార్జీ దేశాయి (1896 ఫిబ్రవరి 29, – 1995 ఏప్రిల్ 10) [1] భారత స్వాతంత్ర్య సమర యోధుడు. జనతా పార్టీ నాయకుడు. అతను 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు భారతదేశ 4వ ప్రధానిగా తన సేవలనందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో: బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోంమంత్రి, ఆర్థికమంత్రి పదవులతొ పాటు భారతదేశ 2వ ఉపప్రధాని పదవిని చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణ ఆసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 1974 మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ లో జరిగిన మొదటి అణుపరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్ లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేసాడు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేసాడు. మరోవైపు భారతదేశపు నిఘావ్యవస్థ (రా) ను దెబ్బతీసి పాకిస్తాన్‌లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా అతనిపై పలు విమర్శలు ఉన్నాయి.
మొరార్జీ దేశాయి | |||
| |||
పదవీ కాలం 24 మార్చి 1977 – 28 జూలై 1979 | |||
రాష్ట్రపతి | బి.డి.జట్టి (ఆపద్ధర్మ) నీలం సంజీవరెడ్డి | ||
---|---|---|---|
ముందు | ఇందిరా గాంధీ | ||
తరువాత | చరణ్ సింగ్ | ||
భారత దేశ హోం శాఖా మంత్రి
| |||
పదవీ కాలం 1 జూలై 1978 – 28 జూలై 1979 | |||
ముందు | చరణ్ సింగ్ | ||
తరువాత | యశ్వంతరావు చవాన్ | ||
భారత దేశ ఉపప్రధానమంత్రి
| |||
పదవీ కాలం 13 మార్చి 1967 – 16 జూలై 1969 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
ముందు | వల్లభబాయ్ పటేల్ | ||
తరువాత | చరణ్ సింగ్ జగ్జీవన్ రాం | ||
భారత దేశ ఆర్థిక శాఖా మంత్రి
| |||
పదవీ కాలం 13 మార్చి 1967 – 16 జూలై 1969 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
ముందు | సచ్చీంద్ర చౌదరి | ||
తరువాత | ఇందిరా గాంధీ | ||
పదవీ కాలం 13 మార్చి 1958 – 29 ఆగస్టు 1963 | |||
ప్రధాన మంత్రి | జవహర్ లాల్ నెహ్రూ | ||
ముందు | జవహర్ లాల్ నెహ్రూ | ||
తరువాత | టి.టి.కృష్ణమాచారి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భడేలీ, బొంబాయి రాజ్యం, బ్రిటిష్ ఇండియా | 1896 ఫిబ్రవరి 29||
మరణం | 1995 ఏప్రిల్ 10 (aged 98) న్యూఢిల్లీ, భారత దేశము | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (1988–1995) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ (1969కు ముందు) భారత జాతీయ కాంగ్రెస్ (ఒ)(1969–1977) జనతా పార్టీ(1977–1988) | ||
జీవిత భాగస్వామి | గుజ్రాబెన్ దేశాయ్ (m. 1911) | ||
పూర్వ విద్యార్థి | విల్సన్ కళాశాల, ముంబై | ||
వృత్తి | సివిల్ సర్వెంట్ ఉద్యమకారుడు | ||
సంతకం | |||
పురస్కారాలు | భారతరత్న నిషాన్-ఇ-పాకిస్థాన్ |
ప్రారంభ జీవితం
మార్చుజననం
మార్చుమొరార్జీ దేశాయ్ బొంబాయి రాజ్యంలో (ప్రస్తుత గుజరాత్) [2] బ్లస్టర్ జిల్లాకు చెందిన భడేలీ గ్రామంలో 1896 ఫిబ్రవరి 29 న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఉపాధ్యాయుడు.[3]
పాఠశాల విద్య
మార్చుఅతను ప్రాథమిక విద్యను సౌరాష్ట్రకు చెందిన సవరకుండ్లలోని కుండ్ల పాఠశాలలో (ప్రస్తుతం జె.వి.మోదీ పాఠశాల) చదివాడు. తరువాత వాల్సాద్ లోని భాయ్ అవా భాయ్ ఉన్నత పాఠశాలలో చదివాడు. ముంబైలోని విల్సన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత అతను గుజరాత్ లో సివిల్ సర్వీసులో చేరాడు. 1927-28 గోద్రాలో జరిగిన అల్లర్ల సమయంలో హిందువులపై మెతక వైఖరి అవలంభించాననే అపరాధ భావంతో 1930 మేన అతను గోద్రా డిప్యూటీ కలెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసాడు.[4]
స్వాతంత్ర్య సమరయోధుడు
మార్చుఅతను మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోఅనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు, కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. గుజరాత్ ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ముఖ్యమైన నాయకుడయ్యాడు.1934, 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అతను బొంబాయి ప్రెసిడెన్సీలో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి బాధ్యతలను చేపట్టాడు. Writer By Mannapeetar.kesanapalli
ప్రభుత్వంలో
మార్చుబాంబే ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాల విభజన
మార్చుభారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అతను బొంబాయి సంస్థానానికి హోం మంత్రి అయ్యాడు. 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. బొంబాయి రాష్ట్రం ద్వి భాషా రాష్ట్రంగా ఉండేది. బొంబాయి రాష్ట్రంలో గుజరాత్, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 1956 నుండి సంయుక్త మహారాష్ట్ర సమితి పేరుతో ఒక క్రియాశీలక సంస్థ ఏర్పడి కేవలం మరాఠీ మాట్లాడే ప్రజల కోసం మహారాష్ట్ర రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపట్టింది. ఒక దృఢమైన జాతీయవాదిగా అతను అటువంటి ఉద్యమాలను వ్యతిరేకించాడు. వాటిలో ప్రత్యేక గుజరాత్ రాష్ట్ర సాధన కోసం ఇందూలాల్ యాగ్నిక్ అధ్వర్యంలో మహాగుజరాతీ ఉద్యమం కూడా ఉంది. వివిధ భాషా, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యాలతో అనేక తరాలుగా దీర్ఘకాలం స్థిరపడిన పౌరులు ఉన్నందున దేశాయ్ ముంబయి మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం లేదా సార్వజనీన స్వభావం గల ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా మార్చాలని ప్రతిపాదించాడు. గాంధీ భావాలకు వ్యతిరేకంగా ఫ్లోరా ఫౌంటైన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు చేరుకున్న " సమైక్య మహారాష్ట్ర సమితి" ముంబై శాఖకు చెందిన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు పోలీసులు ఆదేశించాడు. నిరసనకారులను "సేనాపతి బాపట్" నేతృత్వం వహించాడు. దేశాయ్ ఆదేశంతో జరిగిన కాల్పుల సంఘటనలో 11 సంవత్సరాల బాలికతో సహా 105 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ సంఘటన సమస్య తీవ్రతను మరింత పెంచి, భాష ఆధారంగా రెండు వేర్వేరు రాష్ట్రాలకు అంగీకరించడానికి ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత బొంబాయి (ప్రస్తుతం ముంబై) దాని ముఖ్యపట్టణం అయినది. ఉద్యమం జరిగిన ఫ్లోరా ఫౌంటెన్ ప్రాంతం 105 మంది ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ "హతత్మా చౌక్" (మరాఠీ భాషలో "మేర్థీర్స్ స్క్వేర్") గా పేరు మార్చబడింది. తరువాత దేశాయ్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కేబినెట్ లో హొం మంత్రి బాధ్యతలను చేపట్టాడు.
హోం మంత్రిగా
మార్చుహోం మంత్రిగా దేశాయ్, సినిమాలు, థియేటర్ ప్రొడక్షన్లలో నటిస్తున్న పాత్రల అసభ్యకర సన్నివేశాలను ("ముద్దు" సన్నివేశాలతో పాటు) చట్ట పరంగా బహిష్కరించాడు.
ధృఢమైన గంధేయవాదిగా దేశాయ్, ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సోషలిస్టు విధానాలకు వ్యతిరేకంగా సామాజిక సంప్రదాయవాదిగా, అనుకూల-వ్యాపార, ఉచిత సంస్థ సంస్కరణలకు అనుకూలంగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎదిగిన అతను, అవినీతి వ్యతిరేక అంశాలతో తీవ్ర జాతీయవాదిగా, ప్రధానమంత్రి నెహ్రూ, అతని మిత్రపక్షాలను విభేదించాడు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైనా ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ తోను అతని సహచరులతోను విభేదాలుండేవి. నెహ్రూ వయస్సురీత్యా ఆరోగ్యం క్షీణించడంతో ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడయ్యాడు. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా నెహ్రూ అనుచరుడు లాల్ బహాదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. 18 నెలల తరువాత 1966ల ప్రారంభంలో ఊహించని విధంగా లాల్ బహాదూర్ శాస్త్రి తాష్కెంట్ లో మరణించిన తదుపరి మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉన్న నాయకునిగా ప్రధాని రేసులో ఉన్నాడు. అయినప్పటికీ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీతో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది. దేశాయ్ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా సేవలనందించాడు. అతను భరత హోం మంత్రిగా 1969 వరకు కొనసాగాడు. తరువాత ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ కాలంలో ఇందిరా గాంధీ 14 పెద్ద బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఈ కారణంగా అతను ఇందిరా గాంధీ కేబినెట్ కు రాజీనామా చేసాడు.
కాంగ్రెస్ పార్టీ విభజన తరువాత మోరార్జీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) పార్టీలో చేరాడు. ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ (రూలింగ్) అని పిలిచే ఒక నూతన విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయంగా, దేశాయ్, ఇందిరా గాంధీల రెండు విభాగాలు సిండికేట్ అండ్ సిండికేట్ అని వరుసగా పిలువబడ్డాయి. 1971 సార్వత్రిక ఎన్నికలలో ఇందిరా గాంధీ విభాగం కొద్ది సీట్ల తేడాతో గెలిచింది. మొరార్జీ దేశాయ్ పార్లమెంటు సభ్యునిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొరార్జీ గుజరాత్ లోని నవనిర్మాణ ఉద్యమానికి మద్దతుగా 1975 మార్చి 12 న జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు వెళ్లాడు.[5]
1971 సాధారణ ఎన్నికలలో ప్రచారం సందర్భంగా ప్రభుత్వ పౌర సేవకులను (సివిల్ సర్వెంట్లు), ప్రభుత్వ పరికరాలను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చిన తరువాత, అలహాబాద్ హైకోర్టు ఈ ఎన్నికల మోసంపై ఇందిరా గాంధీని దోషిగా నిర్ధారించింది.[6] తదుపరి 1975–77లో అత్యవసర పరిస్థితి సమయంలో భారీ అణిచివేతలో భాగంగా దేశాయ్, ఇతర ప్రతిపక్ష నేతలను ఇందిరా గాంధీ ప్రభుత్వం జైలు శిక్ష విధిందింది.
ఎమర్జెన్సీ కాలంలో
మార్చులోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, 1977 ఎమర్జెన్సీ వ్యతిరేకతతో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన సీట్లను కోల్పోవలసి వచ్చింది. 1975 లో విధించబడిన అత్యవసర పరిస్థితి 1977 ఫిబ్రవరి - మార్చి నెలలలో జరిగన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన అంతమయింది. కాంగ్రసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, జనసంఘ్, సోషలిస్టు పార్టీలు "జనతాపార్టీ" పేరుతో ఒకటయ్యాయి. మొరార్జీ దేశాయ్ ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి డెమొక్రటిక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ స్థాపించాడు. జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చాడు. ఫిబ్రవరి 16 - మార్చి 10వ తేదీ మధ్య జరిగిన ఎన్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. ఇందిరాగాంధీ- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకోబడింది. మార్చి 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
భారతదేశ ప్రధానమంత్రి (1977-79)
మార్చుమొదటి దశ ప్రధానమంత్రి
మార్చుఇందిరా గాంధీ మార్చి 21వ తేదీ అత్యవసర పరిస్థితి పసంహరించుకోవడానికి నిర్ణయించుకున్న తరువాత, జరిగిన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టాడు. 1962 యుద్ధం తరువాత మొదటి సారిగా అతను ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో స్నేహ పూర్వక సంబంధాలను వృద్ధి చేసాడు. అతను జియా ఉల్ హక్తో చర్చించి స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచాడు. చైనాతో దౌత్య సంబంధాలు కూడా పునఃస్థాపన చేయబడ్డాయి. అత్యవసర సమయంలో రాజ్యాంగానికి చేసిన అనేక సవరణలను ఆయన ప్రభుత్వం రద్దు చేసింది. ఏదైనా భవిష్యత్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని కష్టతరం చేసింది. ఏదేమైనా, జనతా పార్టీ సంకీర్ణం, వ్యక్తిగత, విధాన ఘర్షణలతో నిండిపోయింది. అంతర్గత ఘర్షణలతో ఏమీ సాధించలేకపోయింది. సంకీర్ణ నాయకత్వంలో ఎటువంటి పార్టీ లేకుండా, ప్రత్యర్థి గ్రూపులు దేశాయ్ ను పదవీత్యుడిని చేయడానికి పోటీ పడ్డారు. అత్యవసర-శకం దుర్వినియోగాలపై ఇందిరా గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద విమర్శలకు గురైనందున తన పరిపాలన మరింత దిగజారింది,
మొదటి అణు పరీక్ష
మార్చు1974 లో భారతదేశం మొట్టమొదటి అణు పరీక్ష జగిగినప్పటికి, భారతదేశ అణు రియాక్టర్లను "దేశంలో అణు బాంబుల కోసం ఎప్పటికీ ఉపయోగించరు, నేను సహాయం చేయగలిగితే దానిని చూస్తాను" అని దేశాయ్ తెలిపాడు.[7] 1977 లో, యు.ఎస్ అధ్యక్షుడు కార్టర్ పాలనా యంత్రాంగం భారత్‌కు భారజలం, యురేనియం పదార్థాలను భారత దేశంలోని అణు రియాక్టర్ల కొరకు అమ్మివేయాలని ప్రతిపాదించింది కానీ అణు పదార్థాల వినియోగంలో అమెరికన్ ఆన్-సైట్ తనిఖీ అవసరం అని తెలిపింది. దీనిని దేశాయ్ వ్యతిరేకించాడు.[8] 1974 లో ఆశ్చర్యకర అణు పరీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాన అణు శక్తులు లక్ష్యంగా చేసుకున్న తరువాత దేశీయంగా, అతను భారతీయ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాడు. మొరార్జీ దేశాయ్ భారతదేశ ప్రధాన గూఢచార సంస్థ "రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్" (R & AW) ను, దాని బడ్జెట్, కార్యకలాపాలను తగ్గించడం ద్వారా మూసివేసాడు. అతను 1990 లో పాకిస్థాన్ అధ్యక్షుడు గులాం ఇస్తాక్ ఖాన్ నుండి పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం 'నిషాన్-ఇ-పాకిస్థాన్" పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పాకిస్థాన్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయునిగా గుర్తింపు పొందాడు. తరువాత, అతని విధానాలు దేశంలో సామాజిక, ఆరోగ్య, పరిపాలనా సంస్కరణలను ప్రోత్సహించాయి. పాకిస్థాన్ లో అణుపరీక్ష చేస్తున్న కహుటా నుండి పాకిస్థాన్ జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ కు జరిగిన టెలీఫోన్ సంభాషణ గురించి R&AW కు తెలుసునని అతను వెల్లడించాడు.[9]
'రా' ను నాశనం చేయడం
మార్చుమొరార్జీ దేశాయ్ భారతదేశ బాహ్య గూఢచారి సంస్థ అయిన "రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW)" ఇందిరా గాంధీకి వ్యక్తిగత భద్రతా గార్డులుగా వ్యవహరిస్తుందని వివరించాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ కార్యకలాపాలను నిలిపి వేసాడు. ఆ సంస్థకు నిధులు, కార్యకలాపాలు ఇవ్వకుండా చేసి దాని ప్రాభవాన్ని తగ్గించాడు.[10][11] పాకిస్తాన్ తొలి అణుకేంద్రం కహూటాలో ఉందని 1977లో రా ఏజెంట్లు విజయవంతంగా కనుగొని సమాచారాన్ని భారతదేశానికి చేరవేసినప్పుడు, ఒక ఏజెంటు తనవద్ద ఉన్న కహూటా అణుకేంద్రపు ప్లాన్ పటాన్ని ఇవ్వాలంటే పదివేల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి విన్నవించగా దాన్ని తిరస్కరించడమే కాక ఆ రహస్య సమాచారాన్ని, అది తమకు తెలుసన్న సంగతినీ స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్‌కి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో రా ఏజెంటును పాకిస్తాన్‌లో కనిపెట్టి చంపారు.[12]
పదవీ విరమణ
మార్చు1979లో రాజ్ నారాయణ్, చరణ్ సింగ్ లు జనతాపార్టీ నుండి వైదొలగారు. దేశాయ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుండి పదవీవిరమణ పొందాలని ఒత్తిడి తెచ్చారు. "జనతా పార్టీ సభ్యుడు ఏకకాలంలో ప్రత్యామ్నాయ సామాజిక లేదా రాజకీయ సంస్థ సభ్యుడిగా ఉండరాదు" అని రాజ్ నారాయణ్, చరణ్ సింగ్, వామపక్ష నాయకులైన మధు లిమాయే, కృష్ణకాంత్, జార్జి ఫెర్నాడెజ్ లు డిమాండ్ చేయడం వలన కూలిపోయింది. "ద్వంద్వ సభ్యత్వం" పై దాడికి జనసంఘ్ పార్టీ సభ్యులయిన జనతా పార్టీ సభ్యులు ప్రత్యేకంగా దర్శకత్వం వహించారు. వారు జనసంఘ్ సైద్ధాంతిక మాతృసంఘమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులయ్యారు.[13]
మరణం
మార్చుమొరార్జీ దేశాయ్ జనతాపార్టీకి 1980 సార్వత్రిక ఎన్నికలలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రచారం చేశాడు, కాని ఎన్నికలో పోటీ చేయలేదు. పదవీ విరమణ తరువాత అతను ముంబైలో నివసించి తన 99వ యేట 1995 ఏప్రిల్ 10 న మరణించాడు.[14] అత్యధిక కాలం జీవించిన భారత ప్రధానిగా గుర్తింపు పొందాడు.
సంఘ సేవ
మార్చుమొరార్జీ దేశాయ్ గాంధేయవాది, సంఘసేవకుడు, సంఘ సంస్కర్త. అతను గుజరాత్ విద్యాపీఠ్ కు ఛాన్సలర్ గా ఉన్నాడు. అతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోకూడా ఈ విద్యాపీఠ్ ను అక్టోబరు మాసంలో సందర్శించాడు. అతను సాధారణ జీవితం గడిపాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు కూడా పోస్ట్ కార్టులను తానే వ్రాసేవాడు. కైరా జిల్లాలో రైతులతో సమావేశాలను నిర్వహించడానికి సర్దార్ పటేల్ అతనిని నియమించాడు. ఇవి చివరకు అమూల్ కో-ఆపరేటివ్ ఉద్యమం స్థాపనకు దొహదపడ్డాయి.
వ్యక్తిగత జీవితం కుటుంబం
మార్చుమొరార్జీ దేశాయ్ 1911 లో తన 15వ యేట గుజ్రాబెన్ ను వివాహమాడాడు.[15] గుజరాన్ ఆమె భర్త ప్రధానమంత్రి కావాలని చూసింది కానీ అంతకు పూర్వమే మరణించింది. వారికి కాంతి దేశాయ్ అనే కుమారుడు ఉన్నాడు. జగదీప్, భరత్ దేశాయ్ అనబడే మనుమలు ఉన్నారు. జగదీష్ దేశాయ్ కుమారుడు మధుకేశ్వర్ దేశాయ్ [16] పై తన తాత వారసత్వం పునరుద్ధరించే బాధ్యత పడింది.[17] మధుకేశ్వర దేశాయ్ ప్రస్తుతం భారతీయ్ జనతా యువమోర్చాకు ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.[18] భరత్ దేశాయ్ కుమారుడు విశాల్ దేశాయ్ రచయిత, సినిమా నిర్మాత.[19]
మూత్ర చికిత్స న్యాయవాది
మార్చు1978లో "మూత్ర చికిత్స" దీర్ఘకాలిక అభ్యాసకుడైన దేశాయ్ డేంరాథర్ తో "60 మినిట్స్" కార్యక్రమంలో మాట్లాడుతూ మూత్రం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలను వివరించాడు. వైద్య చికిత్స పొందలేని లక్షల మంది భారతీయులకు మూత్ర చికిత్స అనేది పరిపూర్ణ వైద్య పరిష్కారం అని దేశాయ్ పేర్కొన్నాడు.[20][21][22] మూత్రం తాగడం ద్వారా అతను తన దీర్ఘాయువుని అందుకున్నాడని తెలిపాడు - అతను దీనిని "జీవజలము" అని పిలిచాడు.[23][24]
మూలాలు
మార్చు- ↑ Profile of Morarji Desai
- ↑ Bhattacharya, DP (26 May 2014). "Gujarati Prime Ministers Morarji Desai & Narendra Modi share similarities". Gandhinagar: India Times. Retrieved 23 March 2018.
- ↑ Kuldip Singh (10 April 1995). "Obituary: Morarji Desai". The Independent. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 23 March 2018.
- ↑ Ajay Umat & Harit Mehta (10 Jun 2013). "Can Narendra Modi follow in Morarji Desai's footsteps?". The Economic Times. Retrieved 2013-06-10.
- ↑ Krishna, Ananth V. (2011). India Since Independence: Making Sense of Indian Politics. Pearson Education India. p. 117. ISBN 9788131734650. Retrieved 22 November 2012.
- ↑ "Indira Gandhi convicted of election fraud — History.com This Day in History — 6/12/1975". History.com. Retrieved 2013-07-10.
- ↑ "The World: Morarji Desai: The Ascetic Activist". Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 19 March 2014.
- ↑ "Nation: Jimmy's Journey: Mostly Pluses". Archived from the original on 1 అక్టోబరు 2007. Retrieved 19 March 2014.
- ↑ "Kaoboys of R&AW: Down Memory Lane" by B. Raman
- ↑ "Significant Distrust and Drastic Cuts: The Indian Government's Uneasy Relationship with Intelligence". International Journal of Intelligence and CounterIntelligence. 30 (3): 522–531. 2017. doi:10.1080/08850607.2017.1263529.
- ↑ "Indian intelligence revealed: an examination of operations, failures and transformations". Intelligence and National Security. 32. 2017. doi:10.1080/02684527.2017.1327135.
- ↑ ఫజల్, రేహాన్. "1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?". BBC Telugu. doi:10.1080/02684527.2017.1327135.
- ↑ Lloyd I. Rudolph and Susanne H. Rudolph, In Pursuit of Lakshmi: The Political Economy of the Indian State (1987), University of Chicago Press, pp 457–459.
- ↑ https://www.nytimes.com/1995/04/11/obituaries/morarji-desai-dies-at-99-defeated-indira-gandhi-to-become-premier-of-india.html
- ↑ Dubey, Scharada (2009). Movers and Shakers Prime Minister of India. Westland. p. Morarji Desai Section Page 1. Retrieved 26 August 2014.[permanent dead link]
- ↑ Khanna, Summit (11 April 2010). "Morarji's 3G scion to enter politics". Daily News and Analysis (DNA). Ahmedabad. DNA. Retrieved 4 February 2012.
- ↑ Yagnik, Bharat (11 April 2010). "Great-grandson to revive Morarjis legacy in state". The Times of India. TNN. Retrieved 4 February 2012."Morarji's great grandson to revive legacy".
- ↑ "Morarji Desai's great grandson Madhukeshwar joins BJP's youth wing as vice-president". The Economic Times. 30 May 2013.
- ↑ "A lightly carried legacy". The Afternoon. Archived from the original on 2018-05-10. Retrieved 2018-05-24.
- ↑ Chowdhury, Prasenjit (27 జూలై 2009). "Curative Elixir: Waters Of India". The Times of India. Archived from the original on 30 జూన్ 2010.
- ↑ Tietze, Harald (1996). Urine the Holy Water. p. 16. ISBN 0846451905.
- ↑ Wasson, R.G., 1979. Soma brought up-to-date. Journal of the American Oriental Society, 99(1), pp.100-105.
- ↑ Singh, Kuldip (1995). "OBITUARY: Morarji Desai". No. Monday 10 April 1995. The Independent. Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 24 మే 2018.
- ↑ "KaoBoys of R&AW".
బయటి లంకెలు
మార్చు- Media related to Morarji Desai at Wikimedia Commons
రాజకీయ కార్యాలయాలు | ||
---|---|---|
అంతకు ముందువారు జవాహర్ లాల్ నెహ్రూ |
భారత ఆర్థిక మంత్రి 1958–1963 |
తరువాత వారు టి.టి.కృష్ణమాచారి |
అంతకు ముందువారు సర్దార్ వల్లభభాయి పటేల్ |
భారతదేశ ఉపప్రధాని 1967–1969 |
తరువాత వారు చరణ్ సింగ్ |
తరువాత వారు జగ్జీవన్ రాం | ||
అంతకు ముందువారు సచ్చీంద్ర చౌదరి |
భారతదెశ ఆర్థిక మంత్రి 1967–1969 |
తరువాత వారు ఇందిరా గాంధీ |
అంతకు ముందువారు ఇందిరా గాంధీ |
భారతదేశ ప్రధానమంత్రి 1977–1979 |
తరువాత వారు చరణ్ సింగ్ |
భారత ప్లానింగ్ కమిషన్ చైర్‌పర్సన్ 1977–1979 | ||
అంతకు ముందువారు చరణ్ సింగ్ |
భారతదేశ హోంమంత్రి 1978–1979 |
తరువాత వారు యశ్వంతరావు చవాన్ |
అంతకు ముందువారు బి.జి.ఖేర్ |
బొంబాయి సంస్థాన ముఖ్యమంత్రి 1952-1957 |
తరువాత వారు యశ్వంతరావు చవాన్ |