కమిందు మెండిస్

శ్రీలంక క్రికెటర్

పాస్‌వల్ హండి కమిందు దిలంక మెండిస్, శ్రీలంక క్రికెటర్. దేశీయ క్రికెట్‌లో జాతీయ జట్టు, కొలంబో క్రికెట్ క్లబ్ కోసం ఆడాడు.[1] ద్వంద్వ బౌలర్ గా ఒకే ఓవర్లో కుడి, ఎడమ చేతి డెలివరీలను బౌల్ చేశాడు.[2][3][4] 2018 అక్టోబరులో శ్రీలంక క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

కమిందు మెండిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాస్‌వల్ హండి కమిందు దిలంక మెండిస్
పుట్టిన తేదీ (1998-09-30) 1998 సెప్టెంబరు 30 (వయసు 26)
గాలే, శ్రీలంక
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్, కుడిచేతి ఆఫ్ స్పిన్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 160)2022 జూలై 8 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 190)2019 మార్చి 10 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2022 జనవరి 21 - జింబాబ్వే తో
తొలి T20I (క్యాప్ 77)2018 అక్టోబరు 27 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2021 సెప్టెంబరు 14 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015Galle
2018Colombo
2020–presentKandy Falcons
2022–presentSylhet Strikers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20
మ్యాచ్‌లు 1 7 5
చేసిన పరుగులు 61 127 76
బ్యాటింగు సగటు 61.00 21.16 15.20
100s/50s 0/1 0/1 0/0
అత్యధిక స్కోరు 61 57 41
వేసిన బంతులు 150 48
వికెట్లు 2 0
బౌలింగు సగటు 75.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/32
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 1/–
మూలం: Cricinfo, 8 July 2022

పాస్‌వల్ హండి కమిందు దిలంక మెండిస్ 1998, సెప్టెంబరు 30న శ్రీలంకలోని గాలేలో జన్మించాడు.

దేశీయ క్రికెట్

మార్చు

మెండిస్ 13 సంవత్సరాల వయస్సులో గాలేలోని రిచ్‌మండ్ కాలేజీకి క్రికెట్ ఆడుతున్నప్పుడు రెండు చేతులతో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. 2015 నవంబరు 30న ఏఐఏ ప్రీమియర్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్‌లో చరిత్ అసలంకతో కలిసి లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[5][6]

మరుసటి నెలలో 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[7] 2016 డిసెంబరులో అండర్-19 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[8] 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[9]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2018 ఆగస్టులో శ్రీలంక క్రికెట్ 2018 ఆసియా కప్ కోసం 31 మంది ఆటగాళ్ళతో కూడిన ప్రాథమిక జట్టులో చేర్చింది.[10]

2018 అక్టోబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[11] 2018 అక్టోబరు 27న ఇంగ్లాండ్‌పై శ్రీలంక తరపున తన టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[12] ఈ మ్యాచ్‌లో అతను 24 పరుగులు చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Kamindu Mendis". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  2. "Under-19 World Cup: Watch Sri Lanka's ambidextrous bowler Kamindu Mendis". BBC Sport. Retrieved 2023-08-24.
  3. "A true all-rounder: Meet ambidextrous spinner Kamindu Mendis". International Cricket Council. Retrieved 2023-08-24.
  4. "England get first taste of ambidextrous Mendis in Sri Lanka warm-up win". The Guardian (in ఇంగ్లీష్). 5 October 2018. Retrieved 2023-08-24.
  5. "AIA Premier Limited Over Tournament, Group B: Badureliya Sports Club v Galle Cricket Club at Kaluthara, Nov 30, 2015". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  6. "Kamindu Mendis, Sri Lanka's ambidextrous asset". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
  7. "SL include Charana Nanayakkara in U-19 World Cup squad". ESPNCricinfo. Retrieved 2023-08-24.
  8. Weerasinghe, Damith (11 December 2016). "Kamindu Mendis to lead Sri Lanka U19s in Youth Asia Cup". ThePapare.com. Retrieved 2023-08-24.
  9. "U-19 Cricket: Kamindu to lead Sri Lanka U19s at ICC Youth WC". Sunday Times (Sri Lanka). Archived from the original on 2017-12-14. Retrieved 2023-08-24.
  10. "No Malinga in SL preliminary squad for Asia Cup". Daily Sports. Archived from the original on 23 August 2018. Retrieved 2023-08-24.
  11. "Ambidextrous Kamindu Mendis breaks into SL T20I squad". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  12. "Only T20I (N), England tour of Sri Lanka at Colombo, Oct 27 2018". ESPN Cricinfo. 18 February 2018. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు

మార్చు