కమీనా 2013లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన జానీ గద్దర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. 2013 సెప్టెంబరు 13 న ఈ చిత్రం విడుదలైనది.

కథసవరించు

అక్రమదందాలు, చట్టవ్యతిరేకమైన వ్యాపారాలు చేసే ధర్మ, తేజ, కైలాశ్, శివ, సిద్దార్థ్ లు ఐదుగురు పార్ట్ నర్స్. ఓ అక్రమ వ్యాపారంలో ఐదుకోట్లు పెట్టుబడి పెట్టి పదికోట్లు సులభంగా సంపాదించాలనుకునేందు ఐదుగురు ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలోనే ఐదుకోట్లు సమకూర్చి...ఒడిశాలోని భువనేశ్వర్ కు శివ ద్వారా తరలించాలని సిద్ధమవుతారు. అయితే ఓ కారణంతో డీల్ పూర్తికాకుండానే ఐదుకోట్ల రూపాయలు కొట్టేసేందుకు సిద్ధార్థ్ పథకం రచిస్తాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శివను చంపేసి ఐదుకోట్ల రూపాయలను సిద్దు చేజిక్కించుకుంటాడు. అయితే ఎందుకు ఐదు కోట్ల రూపాయలను కొట్టేయాలనుకుంటాడు. ఏ కారణం కోసం సిద్ధార్థ్ డబ్బు కాజేయాలనుకుంటాడో ఆ లక్ష్యం నెరవేరిందా? సిద్ధార్థ్ మోసానికి గురైన మిగితా ముగ్గురు ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే కమీనా చిత్రం.

నటులుసవరించు

సిబ్బందిసవరించు

  • సంగీతం - అగస్త్య

లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కమీనా&oldid=2320211" నుండి వెలికితీశారు