బ్రహ్మాజీ

నటుడు

బ్రహ్మాజీ ఒక పేరొందిన తెలుగు నటుడు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో, ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకారు, మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు.

బ్రహ్మాజీ
Brahmaji.jpg
జననం
సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీరావు

(1965-08-09) ఆగస్టు 9, 1965 (వయస్సు 55)

సినీరంగ ప్రవేశంసవరించు

బ్రహ్మాజీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. తండ్రి రెవిన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తల్లి ది అమలాపురం సమీపంలోని అద్దంకివారి లంక. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. ఈయనకు నలుగురు అక్కలు ఒక అన్న. ఈయన తాత బ్రహ్మం గారి పేరు మీదుగా శివాజీ, బాలాజీ తరహాలో ఈయనకు బ్రహ్మాజీ అని పేరు పెట్టారు. చదువుకునే రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులుకు రెవిన్యూ శాఖ ఉద్యోగులు చేసిన సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు.

మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండేళ్ళ కోర్సు అయిపోయిన తర్వాత మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఎం.ఎ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు.[1] ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది వేషాల కోసం తిరుగుతున్న సమయంలో కృష్ణవంశీతో పరిచయమైంది. ఇద్దరూ రూమ్మేట్లుగా ఉన్నారు. ఆ తరువాత కృష్ణవంశీ దర్శకుడైనప్పుడు బ్రహ్మాజీకి తన సినిమాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించాడు.[2] కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడుతా విజయవంతమై మంచి దర్శకునిగా నిలదొక్కుకున్న తరుణంలో బ్రహ్మాజీని కథానాయకునిగా పెట్టి సింధూరం సినిమా తీశాడు.[3] ఈ సినిమాలో బ్రహ్మాజీ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. Interview With Brahmaji (Part 1) - Cinigoer.com
  2. Brahmaji - Nenu Na Prayanam - Tv9
  3. "ఆ దర్శకుడు నాలుగేళ్లు తిప్పించుకున్నాడు!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 25 January 2018. Retrieved 25 January 2018. CS1 maint: discouraged parameter (link)
  4. సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్‌' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్‌ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020. CS1 maint: discouraged parameter (link)
  5. "Babu Bangaram Review". 123telugu. 12 August 2016.
  6. "143 review". idlebrain. Retrieved 16 May 2019. CS1 maint: discouraged parameter (link)
  7. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019. CS1 maint: discouraged parameter (link)
  8. Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రహ్మాజీ&oldid=3178560" నుండి వెలికితీశారు