కమ్లియా జుబ్రాన్

కమ్లియా జుబ్రాన్ పాలస్తీనా గాయకురాలు, పాటల రచయిత్రి, సంగీత దర్శకురాలు.

కమ్లియా జుబ్రాన్
Kamilya Jubran with Oud in Cologne (8397).jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంకమ్లియా జుబ్రాన్
జననం1963
అక్రే, ఇజ్రాయిల్
మూలంపాలస్తీనా
వృత్తిగాయకురాలు, పాటల రచయిత్రి , సంగీత దర్శకురాలు
క్రియాశీల కాలం1983 - ప్రస్తుతం

జననంసవరించు

కమ్లియా జుబ్రాన్ 1963లో ఇజ్రాయిల్, అక్రే లోని పాలస్తీనా కుటుంబంలో జన్మించింది.[1][2] ఈవిడ తండ్రి ఎలియాస్ సంగీత ఉపాధ్యాయుడు, సాంప్రదాయ పాలస్తీనా వాయిద్యాల తయారీదారుడు.[3] కమ్లియా సోదరుడు ఖలేద్ కూడా సంగీతకారుడు.[4] జుబ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి, టెల్లింగ్ స్ట్రింగ్స్ (2007) అనే డాక్యుమెంటరీని తయారుచేసింది. ఇందులో తరాలు మారుతున్నకొద్ది ఇజ్రాయిల్ సాంస్కృతి యొక్క మార్పును, గుర్తింపును చూపించడం జరిగింది.[5]

హీబ్రూ యూనివర్సిటీలోని సామాజిక కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 1981 లో జెరూసలేంకు వెళ్లింది.[2]

కమ్లియా 2002లో ఐరోపాకు వెళ్లింది.[6]

వృత్తిజీవితంసవరించు

1982-2002 వరకు తూర్పు జెరూసలెం లోని అరబిక్ సంగీత బృందమైన సబ్రీన్ లో ప్రధాన గాయకురాలుగా పనిచేసింది. వాద్యాలను కూడా వాయించగలదు. 2002 నుండి వేర్నేర్ హాల్లర్ వంటి పలు యూరోపియన్ సంగీతకారులతో కలిసి పనిచేయడమేకాకుండా, సోలోగా కూడా ప్రదర్శనలు ఇచ్చింది.[1] 2013లో "మల్టీ_వైరల్" అనే చిత్రంలో టామ్ మోరెల్, జూలియన్ అస్సాంగ్ లతో కలిసి అతిథి పాత్రలో నటించింది.

గ్రామఫోన్ రికార్డుల జాబితాసవరించు

 1. దుఖన్ అల్-బరాకిన్ (1984)
 2. మావ్ట్ అల్-నబి (1988)
 3. జై అల్ హమమ్ (1994)
 4. అల ఫెయిన్ (2000)
 5. వమీడ్ (2006)
 6. వనాబ్ని (2010)
 7. మకాన్ (2009)
 8. నహౌల్ (2013)

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "Biography". Kamilya Jubran. Retrieved 23 June 2017. CS1 maint: discouraged parameter (link)
 2. 2.0 2.1 "Finishing a musical odyssey alone". The Daily Star (Lebanon). June 23, 2004. Retrieved 23 June 20176. Check date values in: |accessdate= (help)CS1 maint: discouraged parameter (link)
 3. Torstrick, Rebecca L. (2004). Culture and Customs of Israel. Greenwood Publishing Group. p. 165. ISBN 0313320918.
 4. Brinner, Benjamin (2009). Playing across a Divide: Israeli-Palestinian Musical Encounters. Oxford University Press. p. 6. ISBN 9780195175813.
 5. "2007 Telling Strings". Balzli & Fahrer GmbH Filmproduction. Retrieved 23 June 2017. CS1 maint: discouraged parameter (link)
 6. "Kamilya Jubran, voix jaillissante de la chanson orientale". Le Monde. January 1, 2009. Retrieved 2 July 2016. CS1 maint: discouraged parameter (link)