సరస్వతీ దేవి (సంగీత దర్శకురాలు)
సరస్వతీ దేవి, ఖోర్షెడ్ మినోచెర్-హోమ్జీ 1912 ఆగస్టు 9న జన్మించింది. ఆమె భారతీయ సంగీత దర్శకురాలు, స్కోర్ కంపోజర్. 1930, 1940 లలో హిందీ చలన చిత్రాలలో పనిచేసింది.[1][2] బాంబే టాకీస్ వారి అచూత్ కన్య (1936)లో ఆమె చేసిన స్కోర్, 'మై బన్ కి చిరియ్రా బన్కే బన్ బన్ బోలూ రే ' తో ఆమె చాలా పేరుపొందింది . ఆమె ఇంకా నర్గీస్ తల్లి, సంజయ్ దత్ అమ్మమ్మ జద్దన్‌బాయి కలిసి భారతీయ చలనచిత్రంలో మొదటి మహిళా సంగీత స్వరకర్తలుగా పరిగణించుతారు.[3]
సరస్వతీ దేవి | |
పుట్టింది | ఖుర్షీద్ మంకేషా
1912
మినోచర్-హోమ్జీ |
---|---|
మరణించారు | 1980 ఆగస్టు 9 | (వయస్సు 67–68)
వృత్తి | సంగీత దర్శకుడు |
సంవత్సరాలు
చురుకుగా |
1935 – 1961 |
ప్రారంభ జీవితం
మార్చుఆమె పార్సీ కుటుంబంలో పుట్టింది. సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేది. ఇది గ్రహించిన ఆమె తండ్రి ఆమెను ధ్రుపద్, ధామర్ శైలిలో గానం చేయడంలో నిష్ణాతులైన 'విష్ణు నారాయణ్ భట్ ఖండే' వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించడానికి చేర్పించారు. తర్వాత ఆమె లక్నో లోని మారీస్ కాలేజీ (తరువాత - భాత్‌ఖండే మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ గా పిలవబడుతోంది )లో చేరి సంగీతం అభ్యసించింది.[4] 15 సంవత్సరాలు వయస్సులో సొంతంగా తమ వాద్యబృందం (ఆర్కెస్ట్రా) ఏర్పరచుకున్నారు. వారి ఇంటి పేరైన హోమ్జీ అనే దాని మీద హోమ్జీ సిస్టర్స్ గా పేరు పొందారు.[5]
వృత్తి
మార్చు1920ల చివరలో బొంబాయి (ముంబై)లో ఆకాశవాణి కేంద్రం (ఆల్ ఇండియా రేడియో స్టేషన్)ను ఏర్పాటు చేయడంతో ఆమె తన సోదరి మానెక్‌తో కలిసి సంగీత కచేరీలు ఇచ్చేది. హోమ్‌జీ సిస్టర్స్‌గా పిలిచే వీరి ఈ కార్యక్రమం శ్రోతలకు బాగా నచ్చింది.[6] ఖుర్షీద్ పాడుతుంటే సోదరి సితార్, మాండలిన్ వాయిద్యాలు వాయిస్తుండేది.[5] బాంబే టాకీస్ వ్యవస్థాపకుడు, హిమాన్షు రాయ్ తన సినిమాల కోసం మంచి సాంప్రదాయ సంగీతం పాడే గాయని (క్లాసికలిస్ట్) కోసం వెతుకుతున్నాడు. ఆమె పాటలను రేడియోలో విని, ఆమెను సంప్రదించి, ఆమెకు స్టూడియోని సందర్శించమని ఆమెను ఆహ్వానించి తమ సంగీతం గదిని చూపించాడు. ఆమె అక్కడ సంగీత విభాగాన్ని చూసుకోవాలని తన చలనచిత్రాలకు సంగీతం అందించాలని అతను కోరాడు. హోమ్జీ ఈ ప్రతిపాదనని అంగీకరించి దానిని సవాలుగా తీసుకుని పనిచేసింది. 1935లో హిమాన్షు రాయ్ భార్య 'దేవికా రాణి' నటించిన "జవానీ కి హవా'" సినిమా ఆమెకు ఇచ్చిన మొదటి చిత్రం. నటీనటులను పాడేలా చేయడం ఆమెకు చాలా కష్టమైంది. రాగాలను (ట్యూన్) సరళీకృతం చేయాల్సి వచ్చింది. వారు గాయకులు కాదు. నేపథ్య గానం (ప్లే బ్యాక్) అప్పటికీ పరిచయం చేయకపోవడంతో పాటలకు బదులుగా కొన్ని సంఘటనలను సంగీతంతో సర్దుబాటు చేయాల్సి వచ్చింది.[3]
"జవానీ కి హవా" తర్వాత ఆమె మొదటి హిట్ చిత్రం "అచూత్ కన్య" (1936). అశోక్ కుమార్, దేవికా రాణితో పాటు, ఆమె ఒక పాట చిత్రీకరణకు ముందు రోజుకు చాలా గంటలు రిహార్సల్ చేస్తూ గడిపారు. 1936లో, ఆమె "జన్మభూమి" చిత్రానికి సంగీతాన్ని అందించింది, ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో విడుదలైంది. హిందీ సినిమా మొట్టమొదటి స్పష్టమైన జాతీయ గీతాలలో ఒకటైన "జై జై జననీ జన్మభూమి" (మా జన్మ భూమికి స్వాగతం) జె.ఎస్. కశ్యప్ రాశాడు. తదనంతరం, ఈ పాట బృందగానం (కోరస్)లోని ఒక ట్యూన్‌ను బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) తన ఇండియన్ న్యూస్ సర్వీస్ కోసం సిగ్నేచర్ ట్యూన్‌గా ఉపయోగించింది.[3]
పార్సీ సమాజం (కమ్యూనిటీ)లో పెద్ద కోలాహలం, నిరసనలు చెలరేగాయి. బాంబే టాకీస్ డైరెక్టర్ల బోర్డులో పార్సీ సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు తమ సమాజానికి చెందిన అమ్మాయిలు చలన చిత్రాలలో ఉండడాన్ని వ్యతిరేకించారు. రాయ్ వారిని సమర్థించాడు. ఆమెకు సరస్వతీ దేవి అనే పేరు పెట్టడం ద్వారా హోమ్జీ అనే గుర్తింపును దాచిపెట్టాడు. ఆమె సోదరికి 'చంద్రప్రభ' అని పేరు పెట్టాడు. హిందీ చిత్రాలలో మొదటి మహిళా సంగీత దర్శకురాలు సరస్వతీ దేవి. దేవి 1961 వరకు సినిమా సంగీతాన్ని సమకూర్చింది. ఆమె "జీవన్ నయ్యా " (1936) చిత్రంలో అశోక్ కుమార్ పాడిన 'కోయి హుమ్‌దుమ్ నా రహా ' పాటను కంపోజ్ చేసింది. తరువాత 'ఝుమ్రూ' (1961)లో కిషోర్ కుమార్ పాడాడు.[3] జూలా (1941) చిత్రంలో అశోక్ కుమార్ పాడిన ఏక్ చతుర్ నార్ కర్ కే శృంగార్ అనే ప్రసిద్ధ పాటకు ఆమే అసలు స్వరకర్త, ఆ తర్వాత పడోసన్ చిత్రంలో మన్నాడే, కిషోర్ కుమార్ పాడారు. ఆమె చివరి చలన చిత్రం బాబా స్ కిలాడీకి మంచి సంగీతం అందించింది. కానీ ఇతర కారణాల వలన విజయవంతం కాలేదు. విదేశీ సంగీతం, కొత్త సంగీతం సంగీత దర్శకుల ఒరవడిలో ఈ సోదరీమణులు వెనకపడి, పేదరికాన్ని అనుభవించారు. సోదరి చంద్ర ప్రభ గ్రంథాలయాపాలకురాలిగా ఉద్యోగానికి వెళితే, ఈమె సంగీత పాఠాలు ఇంటింటికీ వెళ్లి చెప్పే పరిస్థితికి వచ్చింది.[5]
మరణం
మార్చుఆమె వివాహం చేసుకోలేదు. ఆమె అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసించింది. ఓ రోజు బస్సు నుంచి కింద పడి తుంటి ఎముక విరిగింది. ఆమె సహాయం కోసం సినీ ప్రముఖులు ఎవరూ ముందుకు రాలేదు. ఆమెకు ఇరుగుపొరుగు వారి సహాయం మాత్రమే లభించింది. సరస్వతీ దేవి 1980 ఆగస్టు 9న 68 సంవత్సరాల వయస్సులో మరణించింది, ఆమె ప్రస్తుత యుగానికి ఒక బంగారు లంకె అయి మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది.[5]
చలన చిత్రాల జాబితా (ఫిల్మోగ్రఫీ)
మార్చుసంవత్సరం | చలన చిత్రం | గమనిక (లు) |
---|---|---|
1935 | జవానీకి హవా | |
1936 | అచ్యుత్ కన్య | |
జన్మభూమి | ||
జీవన్ నయ్య | ||
మమత | ||
మియా బివి | ||
1937 | ఇజ్జత్ | |
జీవన్ ప్రభాత్ | ||
ప్రేమ్ కహానీ | ||
సావిత్రి | ||
1938 | భాభి | |
నిర్మల | ||
వచన్ | ||
1939 | దుర్గ | |
కంగన్ | RC పాల్ తో | |
నవజీవన్ | ||
1940 | ఆజాద్ | RC పాల్ తో |
బంధన్ | RC పాల్ తో | |
పృథ్వీ వల్లభ | ||
1941 | జూలా | |
నయా సంసార్ | RC పాల్ తో | |
1943 | భక్త రైదాస్ | |
ప్రార్థన | ||
1944 | డాక్టర్ కుమార్ | |
పరాఖ్ ఖుర్షీద్ అన్వర్ | ||
1945 | ఆమ్రపాలి | |
1946 | మహారాణి మృణాల్ దేవి | |
1947 | ఖండాని | |
1948 | నక్లి హీరా | |
1949 | ఉషా హరన్ | |
1950 | బ్రహ్మచారి భర్త | మహమ్మద్ ఇబ్రహీంతో |
1955 | ఇనాం | SN త్రిపాఠితో |
1961 | బాబాసా రి లాడి (రాజస్థానీ) |
ప్రస్తావనలు
మార్చు- ↑ "Dil Deke Dekho: To Usha Khanna, the unsung woman who broke film records in a man's world". www.dailyo.in. Retrieved 2018-04-28.
- ↑ Nathan, Archana. "Picture the song: Devika Rani is a free-spirited bird in 'Main Ban Ki Chidiya'". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-04-28.
- ↑ 3.0 3.1 3.2 3.3 "'This Kishore lad is no singer, I tell you'". Business Standard. 16 October 2010.
- ↑ "Saraswati Devi: One Of The First Music Directors In Indian Cinema | #IndianWomenInHistory". Feminism in India (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-29. Retrieved 2018-04-28.
- ↑ 5.0 5.1 5.2 5.3 "చివరి రోజుల్లో ...". స్వాతి: సపరివారపత్రిక. 31 March 2023.
- ↑ Dutt, Sharad (14 April 2018). "Saraswati Devi: India's Maiden Female Composer". www.millenniumpost.in.
గ్రంథ పట్టిక
మార్చు- Gulzar, Govind Nihalani; Chatterjee, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. ISBN 978-81-7991-066-5.
- Morcom, Anna (2007). Hindi Film Songs and the Cinema. Ashgate Publishing, Ltd. ISBN 978-0-7546-5198-7.
- Pauwels, Heidi R. M. (2007). Indian Literature and Popular Cinema: Recasting Classics. Routledge. ISBN 978-1-134-06255-3.
- Ranade, Ashok Da. (2006). Hindi Film Song: Music Beyond Boundaries. Bibliophile South Asia. ISBN 978-81-85002-64-4.
- Ranchan, Vijay (2014). Story of a Bollywood Song. Abhinav Publications. GGKEY:9E306RZQTQ7.
బాహ్య లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సరస్వతీ దేవి పేజీ
- https://www.youtube.com/watch?v=RtthfgNa7YY Original Ek Chatur Naar Kar Kar Shringar