కరంధముఁడు
- 1. కరంధముఁడు యయాతి పుత్రుఁడు అగు తుర్వసుని పౌత్రుని కొడుకు.
- 2కరంధముఁడు . రెండవ ఖనిత్రుని కొడుకు. ఈతనికి నామాంతరము బలాశ్వుఁడు. బలపరాక్రమవంతుఁడు అయి ఇతఁడు రాజ్యము ఏలుచుండఁగా మత్సరంబున పరరాజులు ఇతని పట్టణమును ముట్టడించిరి. అప్పుడు ఇతఁడు అతి ఖిన్నుఁడు అయి ఏకాంతంబున చింతించుచు తన పాణిద్వయంబుచే వక్త్రనాసికంబులు మూసికొని ఉండఁగా ఇతని అంగుళ మధ్యంబుననుండి వెడలిన ఉచ్ఛ్వాసంబున సంఖ్యాతీతబలంబులు పుట్టి శత్రువర్గంబుల జయించెను. ఈకారణంబున ఇతనికి కరంధముఁడు అను పేరుకలిగెను. ఇతని కొడుకు అవీక్షిత్తు.
ఈ వ్యాసం పౌరాణిక వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |