కరణ్ సింగ్ గ్రోవర్

కరణ్ సింగ్ గ్రోవర్ (జననం 1982 ఫిబ్రవరి 23) భారతీయ మోడల్, నటుడు. ఆయన దిల్ మిల్ గయే, ఖుబూల్ హై వంటి టెలివిజన్ ధారావాహికలలో తన నటనకు ప్రసిద్ధి చెందాడు. అలాగే అలోన్, హేట్ స్టోరీ 3 వంటి బాలీవుడ్ చిత్రాలలో నటనకు కూడా ఆయన ప్రేక్షకాదరణ పొందాడు.

కరణ్ సింగ్ గ్రోవర్
2015లో హేట్ స్టోరీ 3 ప్రచారంలో కరణ్ సింగ్ గ్రోవర్
జననం (1982-02-23) 1982 ఫిబ్రవరి 23 (వయసు 42)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, ముంబై
వృత్తి
  • మోడల్
  • నటుడు
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దిల్ మిల్ గయ్యే
కుబూల్ హై
కసౌతి జిందగీ కే (2018 టీవీ సిరీస్)
జీవిత భాగస్వామి
పిల్లలు1
సంతకం

2019లో కసౌతి జిందగీ కే 2 అనే టెలివిజన్‌ షో చేసిన ఆయన అదే సంవత్సరం BOSS: బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్‌తో తన డిజిటల్ అరంగేట్రం చేశాడు. 2020లో యాక్షన్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్‌లో, 2021లో కుబూల్ హై 2.0 వెబ్ సిరీస్‌లో నటించాడు.[3]

జీవితం తొలి దశలో మార్చు

కరణ్ సింగ్ గ్రోవర్ 1982 ఫిబ్రవరి 23న న్యూఢిల్లీలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు.[4] ఆయన చిన్నతనంలో వారి కుటుంబం సౌదీ అరేబియాలోని అల్ ఖోబార్‌కు వెళ్లింది. ఆయన సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (IHM), ముంబై నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒమన్‌లోని షెరటన్ హోటల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా కొంతకాలం పనిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం మార్చు

 
తన భార్య బిపాసా బసుతో కలిసి కరణ్ సింగ్ గ్రోవర్

భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి శ్రద్ధా నిగమ్‌ని 2008లో కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం చేసుకున్నాడు. వారు 10 నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆయన మళ్ళి 2012లో సినీ నటి జెన్నిఫర్ వింగెట్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2014లో విడిపోయారు.

ఆ తరువాత ఆయన నటి బిపాషా బసును 2016 ఏప్రిల్ 30న వివాహం చేసుకున్నాడు. వీరికి 2022 నవంబరు 12న కుమార్తె దేవి బసు సింగ్ గ్రోవర్ జన్మించింది.[6]

బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తాము మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆగస్టు 2016లో ప్రకటించారు. కాగా ఈ జంట 2015లో భూషణ్ పటేల్ తెరకెక్కించిన అలోన్‌ సినిమాలో మొదటిసారి కనిపించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంట థ్రిల్లర్ వెబ్ సిరీస్ డేంజరస్ లోనూ కూడా కలిసి నటించారు.

పురస్కారాలు మార్చు

Year Award Category Work Result Source
2004 గ్లాడ్రాగ్స్ మాన్‌హంట్ కాంటెస్ట్ మోస్ట్ పాపులర్ మోడల్ అవార్డు విజేత
2007 కళాకర్ అవార్డ్స్ బెస్ట్ ప్రామిసింగ్ స్టార్ దిల్ మిల్ గయ్యే విజేత
2008 ఇండియన్ టెలీ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ (పాపులర్) దిల్ మిల్ గయ్యే నామినేట్ చేయబడింది
2008 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ శిల్పా ఆనంద్ తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ దిల్ మిల్ గయ్యే విజేత
2008 గోల్డ్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ (పాపులర్) దిల్ మిల్ గయ్యే నామినేట్ చేయబడింది
2008 గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ & టీవీ ఆనర్స్ శిల్పా ఆనంద్ తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ దిల్ మిల్ గయ్యే నామినేట్ చేయబడింది
2008 ఇండియన్ టెలీ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ జరా నాచ్కే దిఖా నామినేట్ చేయబడింది
2010 గోల్డ్ అవార్డ్స్ మోస్ట్ ఫిట్ యాక్టర్ (మేల్) విజేత
2013 ఇండియన్ టెలీ అవార్డ్స్ సుర్భి జ్యోతి తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ ఖుబూల్ హై నామినేట్ చేయబడింది
2013 ఇండియన్ టెలీ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ ఖుబూల్ హై నామినేట్ చేయబడింది
2013 ఇండియన్ టెలీ అవార్డ్స్ బెస్ట్ టెలివిజన్ పర్సనాటిటి ఆఫ్ ది ఇయర్ ఖుబూల్ హై విజేత
2013 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ దేశ్ కా సితార – బెస్ట్ యాక్టర్ పాపులర్ ఖుబూల్ హై విజేత
2013 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ డ్రామా ఖుబూల్ హై నామినేట్ చేయబడింది
2013 జీ గోల్డ్ అవార్డ్స్ సుర్భి జ్యోతి తో కలిసి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ ఖుబూల్ హై విజేత
2013 జీ గోల్డ్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ పాపులర్ ఖుబూల్ హై విజేత
2017 జీ గోల్డ్ అవార్డ్స్ రైజింగ్ స్టార్ బాలీవుడ్ విజేత
2019 జీ గోల్డ్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ నెగేటివ్ (పాపులర్) కసౌతి జిందగీ కే విజేత

మూలాలు మార్చు

  1. "I am getting divorced this Monday: Shraddha Nigam – Lifestyle – DNA". Dnaindia.com. 16 July 2010. Retrieved 28 December 2013.
  2. "First Pics: Bipasha Basu and Karan Singh Grovers Mehendi". NDTV. Retrieved 29 April 2016.
  3. "Karan Singh Grover shares the first poster of Qubool Hai 2.0 with Surbhi Jyoti". Bollywood Hungama. 10 January 2021. Retrieved 10 January 2021.
  4. "Do you know Karan Singh Grover has a hot brother called Ishmeet Singh Grover? - daily.bhaskar.com". daily.bhaskar.com. 17 May 2014. Retrieved 29 December 2014.
  5. "Unknown facts about Karan Singh Grover on his birthday, fans pray for his comeback". Filmibeat. 24 February 2014. Archived from the original on 5 మార్చి 2014. Retrieved 31 July 2014.
  6. "Bipasha basu: తల్లైన బిపాసా". web.archive.org. 2023-02-21. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)